S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/15/2017 - 01:55

హైదరాబాద్, అక్టోబర్ 14: పాలమూరు జిల్లాకు మరీ ముఖ్యంగా కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి దీపావళి పండగ నాలుగు రోజుల ముందే వస్తోంది. 30 ఏళ్ల నుండి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పేరు పేపర్లలలో వస్తోందే తప్ప, నీళ్లు మాత్రం కల్వకుర్తికి రాలేదు. ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్న చొరవ, నీటిపారుదల మంత్రి టి. హరీష్‌రావు కృషితో కృష్ణా జలాలు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా అసెంబ్లీ నియోజకవర్గానికి వస్తున్నాయి.

10/15/2017 - 01:54

హైదరాబాద్, అక్టోబర్ 14: హైదరాబాద్‌ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత 15 రోజులుగా దాదాపు నగరం యావత్తూ వానలతో బెంబేలెత్తిపోతోంది. ఈ సీజన్‌లో తెలంగాణలోని ఇతర జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే వర్షాలు ఎక్కువగా కురిశాయి. తెలంగాణలో ఏ ప్రాంతంలో లేనివిధంగా ఇక్కడ వానలు కురుస్తున్నాయి. వానల వల్ల ప్రధాన రోడ్లలో, కూడళ్లలో నీళ్లు పెద్దమొత్తంలో నిలిచిపోయి, వాహనాల రాకపోకలకు ఇబ్బంది తప్పడం లేదు.

10/15/2017 - 01:52

వరంగల్, అక్టోబర్ 14: టెక్స్‌టైల్ పరిశ్రమలో ఫాం టు ఫ్యాషన్ సూత్రంతో సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని రాష్ట్ర ఐటి, చేనేత, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. విద్య, పారిశ్రామిక, ఐటి రంగాల అభివృద్ధి ద్వారా వరంగల్ మరో ఆర్థిక రాజధానిగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు.

10/15/2017 - 01:49

హైదరాబాద్, అక్టోబర్ 14: దీపావళి పండగ సెలవు అక్టోబర్ 19కి మారింది. మొదట తొలుత అక్టోబర్ 18న సెలవుగా ప్రభుత్వం పేర్కొంది. అయితే 19న వచ్చిన అమావాస్య రోజే పండగ జరపాలని పండితులు సూచించారు. దీంతో సెలవును 19కి మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే, అక్టోబర్ 17న (నరక చతుర్ధశి) ప్రకటించిన ఐచ్ఛిక సెలవును 18కి మార్చారు. దీంతో 18, 19 తేదీలు సెలవులుగా ప్రకటించినట్టయింది.

10/15/2017 - 01:39

హైదరాబాద్, అక్టోబర్ 14: ఆంధ్ర రాష్ట్రంలో రైతులు కష్టకాలంలో ఉంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించి, వారిని ఆదుకోకుండా సన్మానాలు, సత్కారాలు, భూ ఒప్పందాలు, విదేశీ ప్రతినిధులతో కాలక్షేపం చేయడం దారుణమని ప్రతిపక్షనేత, వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. రైతుల నష్టానికి పూర్తిగా పరిహారం ఇవ్వాలని, నిరుద్యోగుల ఆత్మహత్యలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన బహిరంగ లేఖ రాశారు.

10/15/2017 - 01:37

విజయవాడ, అక్టోబర్ 14: ఆరోగ్యపరమైన ఆర్థిక విజయం కోసం గో ఆధారిత ప్రకృతి సాగు ఎంతో అవసరమని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. ఇందుకోసం సంబంధిత రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరంగా కూడా ప్రోత్సాహం ఎంతో అవసరమన్నారు.

10/15/2017 - 01:32

అమరావతి, అక్టోబర్ 14: విజయవాడ చుట్టుపక్కల ఉన్న 45 గ్రామాలను నగర పాలక సంస్థ (విఎంసి)లో దశలవారీగా విలీనం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. శనివారం ఉదయం విజయవాడ నగరం, గన్నవరం నియోజకవర్గ పరిధిలో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్‌లను ఆహ్వానించి ఒక సమావేశం నిర్వహించాలని అధికారులను కోరారు. ఆరు నెలల్లోగా ఈ పనిని పూర్తిచేయాలని ఆదేశించారు.

10/15/2017 - 01:28

హైదరాబాద్, అక్టోబర్ 14: తెలుగు రాష్ట్రాల్లో వివిధ కార్పొరేట్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్ధుల ఆత్మహత్యలు ఆగడం లేదు. నెల వ్యవధిలో ఇరు రాష్ట్రాల్లో సుమారు 50మంది విద్యార్ధులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. చాలా సంఘటనలు పోలీసు స్టేషన్ల వరకూ కూడా వెళ్లడం లేదు.

10/15/2017 - 01:24

విశాఖపట్నం, అక్టోబర్ 14: నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శనివారం రాత్రి తెలిపారు. ఇది క్రమమేపీ బలపడి రాగల 48 గంటల్లో మధ్య బంగాళాఖాతం, పరిసరాల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందన్నారు. అల్పపీడనం కూడా బలపడి ఈ నెల 19 నాటికి వాయుగుండంగా

10/15/2017 - 01:23

శ్రీశైలం ప్రాజెక్టు, అక్టోబర్ 14: శ్రీశైలం రిజర్వాయర్‌లోకి గత రెండు రోజులుగా వరదనీరు రాక పెరగడంతో క్రమంగా శనివారం మధ్యాహ్నానికి ఏడుగేట్లు ఎత్తి 1,94,278 క్యూసెక్కుల నీటిని దిగువన నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు.

Pages