S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/10/2016 - 02:52

అనంతపురం, మే 9: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అనంతపురంలో చేపట్టిన నిరవధిక ఆమరణ దీక్షను పోలీసులు సోమవారం భగ్నం చేశారు. చలసాని శ్రీనివాస్ ఆదివారం అనంతపురంలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన విషయం విదితమే. ఆయన దీక్షకు సిపిఎం, సిపిఐ, ఇతర ప్రజాసంఘాలు సంఘీభావం తెలిపాయి.

05/10/2016 - 02:50

హైదరాబాద్, మే 9: తెలుగునాట కూడా తమిళ సంస్కృతి మొదలయంది. ప్రభుత్వ పథకాలకు వ్యక్తుల పేర్లు పెట్టే సంప్రదాయం మొదలయంది. ‘అన్న’ పేరుతో జనహృదయాల్లో స్థిరపడాలన్న కోరిక కూడా నేతల్లో పెరిగింది. ఆ ఒరవడిలో అధినేతలు ‘అన్న’లవుతున్నారు.

05/10/2016 - 02:43

సింహాచలం, మే 9: వైశాఖ శుద్ధ తదియ పర్వదినాన్ని పురస్కరించుకుని సింహాచలం శ్రీ వరహలక్ష్మీనృసింహస్వామి తన నిజరూప దర్శనభాగ్యాన్ని భక్తకోటికి కల్పించారు. వరాహ వదనంతో, మానవ శరీరంతో, సింహవాలంతో ద్వయావతారరూపుడిగా దర్శనమిచ్చిన నారసింహుని కనులారా చూసిన భక్తులు ఆనంద పరవశులయ్యారు.

05/10/2016 - 02:46

హైదరాబాద్, మే 9: రాష్ట్రంలో కరవు పరిస్థితి వివరించి సహాయం కోరేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం రాత్రి ఢిల్లీ వెళ్లారు.

05/10/2016 - 02:40

విశాఖపట్నం, మే 9: విశాఖపట్నం ఆర్‌కె బీచ్‌లో ఆదివారం సాయంత్రం గల్లంతైన ఐదుగురిలో ముగ్గురి మృతదేహాలు లభించాయి. ఒడిశా రాష్ట్రం కొరాపుట్‌కు చెందిన సీతన్న, బీహార్‌కు చెందిన బాబర్ ఖాన్, విజయనగరం జిల్లా మంగళపాలెం గ్రామానికి చెందిన విద్యార్థి బివి ప్రసాద్ మృతదేహాలు బయటపడ్డాయి. గల్లంతైన మరో ఇద్దరి మృతదేహాల జాడ కోసం గాలింపు తీవ్రతరం చేశారు.

05/10/2016 - 02:39

హైదరాబాద్, మే 9: తొలి రోజు జరిగిన కౌనె్సలింగ్‌లోనే ప్రతిష్టాత్మక వృత్తి విద్యాసంస్థ వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సీట్లు అన్నీ భర్తీ అయ్యాయని సంస్థ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆనంద్ ఎ శామ్యూల్ సోమవారం చెప్పారు. ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా 145 కేంద్రాల్లో నిర్వహించిన ప్రవేశపరీక్షలో 2,12,238 మంది అభ్యర్ధులు హాజరయ్యారు.

05/10/2016 - 02:38

హైదరాబాద్, మే 9: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వరకు చెన్నమనేని రాజేశ్వరరావు జీవిత మహాప్రస్థానం సాగింది. 93ఏళ్ల వయసులో సోమవారం మరణించిన కమ్యూనిస్టు నేత చెన్నమనేని రాజేశ్వరరావు జీవితం తెలంగాణ కీలక పరిణామాలతో ముడిపడి ఉంది. 1923 ఆగస్టు 31న జన్మించిన రాజేశ్వరరావు 13 ఏళ్ల వయసులో సిరిసిల్లలో జరిగిన నాలుగవ ఆంధ్ర మహాభలకు స్వచ్ఛంద సేవకునిగా పని చేశారు.

05/10/2016 - 02:19

గుంటూరు, మే 9: ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలో జిల్లాకు చెందిన విద్యార్థులు రాష్టస్థ్రాయి టాప్‌టెన్ ర్యాంకుల్లో స్థానం సంపాదించి జిల్లా పేరుప్రఖ్యాతులను ఇనుమడింపజేశారు. గుంటూరులోని కొండా వెంకటప్పయ్య కాలనీకి చెందిన మూల్పూరు ప్రశాంత్‌రెడ్డి రాష్టస్థ్రాయిలో నాలుగో ర్యాంకు పొంది, జిల్లాలో టాపర్‌గా నిలిచాడు.

05/10/2016 - 02:17

పాల్వంచ, మే 9: ఊరకుక్కలు వెంటబడి దాడి చేయటంలో ఓ దుప్పి మృతి చెందింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని మొండికట్ట వద్ద సోమవారం జరిగింది. కినె్నరసాని జింకల పార్కులోని ఒక దుప్పి వేసవి తాపానికి తట్టుకోలేక మంచినీటి కోసం బయటకు వచ్చింది. అక్కడి నుండి మండల పరిధిలోని మొండికట్ట ప్రాంతంలోని అటవీ ప్రదేశానికి చేరుకుంది. దుప్పిని చూసిన ఆప్రాంతంలోని కొన్ని వీధికుక్కలు వెంబడించి కరిచేశాయి.

05/10/2016 - 02:00

మారేడుమిల్లి, మే 9: తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం గుజ్జుమామిడివలస పంచాయతీ పరిధిలోని టైగర్ క్యాంపు సమీపంలో సోమవారం ఉదయం యాత్రికులతో వెళుతున్న ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో మహిళ మృతిచెందగా, ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి.

Pages