S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/26/2015 - 05:54

హైదరాబాద్/ అమలాపురం, డిసెంబర్ 25: మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ మెట్ల సత్యనారాయణ రావు(74) శుక్రవారం కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో కొద్ది రోజులుగా హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఉదయం 10.30 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. అనంతరం ఆయన పార్థివదేహాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌కు తరలించారు.

12/26/2015 - 05:53

హైదరాబాద్, డిసెంబర్ 25: తెలుగు రాష్ట్రాలు ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్నాయి. వారం రోజులుగా వివిధ మతాలకు చెందిన పండుగలు వరుసగా రావడంతో అన్ని మతాలవారూ ఉత్సాహంగా, ఉల్లాసంగా పండుగలు నిర్వహించుకుంటున్నారు. హిందువులు పవిత్రంగా భావించే ముక్కోటి ఏకాదశితో ఆధ్యాత్మిక వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ముస్లింలు పవిత్ర దినంగా జరుపుకునే మహ్మద్ ప్రవక్త జన్మదినోత్సవం మిలాద్-ఉన్-నబీ పండుగ వచ్చింది.

12/26/2015 - 05:52

విజయవాడ (పటమట), డిసెంబర్ 25: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం ఉదయం గుణదల మేరిమాత పుణ్యక్షేత్రం సందర్శించి, పుణ్యక్షేత్రం ప్రధాన దేవాలయంలో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.

12/26/2015 - 05:51

తిరుమల, డిసెంబర్ 25: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలో శుక్రవారం రాత్రి పున్నమి గరుడ సేవను ఘనంగా నిర్వహించారు. ప్రతినెల పౌర్ణమి రోజున గరుడ వాహన సేవను టిటిడి నిర్వహిస్తున్న విషయం పాఠకులకు విధితమే. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి 7 గంటల నుండి 8 గంటల మధ్య విశేషాలంకారణ భూషితుడైన శ్రీ మలయప్పస్వామి గరుడ వాహనంపై అధిరోహించి పురమాడ వీధుల్లో ఊరేగారు.

12/26/2015 - 05:50

హైదరాబాద్, డిసెంబర్ 25: ఐఐటి జెఇఇ మెయిన్స్‌కు హాజరయ్యే అభ్యర్ధులకు అవకాశాలను మూడుకు పెంచింది. ఇంత వరకూ విద్యార్ధులకు రెండు అవకాశాలు మాత్రమే ఉండగా, దానిని మూడుకు పెంచింది. జెఇఇ మెయిన్స్ పరీక్షను ఆఫ్ లైన్‌లో 2016 ఏప్రిల్ 3న, ఆన్‌లైన్‌లో ఏప్రిల్ 9, 10 తేదీల్లో నిర్వహించనున్నారు. పరీక్షకు రిజిస్ట్రేషన్ డిసెంబర్ 31వ తేదీతో ముగియనుంది.

12/26/2015 - 05:48

హైదరాబాద్, డిసెంబర్ 25: రైళ్లలో మహిళల భద్రత కోసం త్వరలో దక్షిణ మధ్య రైల్వేకి మహిళా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) రానుంది. ఇప్పటికే మెట్రోపాలిటిన్ నగరాల్లోని సబర్బన్ రైళ్లలో మహిళల భద్రత కోసం వేగంగా పని చేసేందుకు వీలుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో 12 మహిళా ఆర్‌పిఎఫ్ కంపెనీలను రైల్వే ఏర్పాటు చేసింది.

12/26/2015 - 05:47

తిరుపతి, డిసెంబర్ 25: భారత ప్రథమ పౌరుడు, రాష్టప్రతి డాక్టర్ ప్రణబ్‌ముఖర్జీ సాంప్రదాయ దుస్తులు ధరించి శుక్రవారం సాయంత్రం తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు వరాహక్షేత్ర సాంప్రదాయం ప్రకారం రాష్టప్రతి, గవర్నర్, ముఖ్యమంత్రిలతో కలసి భూవరాహస్వామిని దర్శించుకుని శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు.

12/26/2015 - 05:33

కరీంనగర్, డిసెంబర్ 25: విద్యార్థుల సంక్షేమాన్ని కాంక్షించి ప్రభుత్వ వసతిగృహాల్లో ఏర్పాటుచేసిన బయోమెట్రిక్ విధానం ఆరంభశూరత్వంగానే మారింది. ఆదిలో దీని అమలుపై అధికారయంత్రాంగం ప్రత్యేక శ్రద్దచూపినా, అనంతరకాలంలోఅంతగా పట్టించుకోకపోవటంతో అత్యధిక హాస్టళ్ళలోని సిబ్బంది ఈవిధానాన్ని అటకెక్కించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

12/26/2015 - 05:20

విజయవాడ, డిసెంబర్ 25: పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించే నిమిత్తం శుక్రవారం ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి ఘనస్వాగతం లభించింది. పర్యటన అనంతరం గన్నవరం చేరుకుని తిరుపతికి బయల్దేరి వెళ్లేముందు ఆయనకు ఘనంగా వీడ్కోలు లభించింది. హైదరాబాద్ నుంచి భారతీయ వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో ఉదయం పదిన్నరకు గన్నవరంకు చేరుకున్నారు.

12/26/2015 - 05:17

తిరుమల, డిసెంబర్ 25 : తిరుమల క్షేత్రం శుక్రవారం భక్తకోటితో నిండిపోయింది. క్రిస్మస్, న్యూ ఇయర్ వరుస సెలవుల నేపథ్యంలో శ్రీవారి దర్శనార్థం రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి కూడా భారీగా యాత్రికులు తరలివచ్చారు. గురువారం 67,358 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కాగా శుక్రవారం తిరుమల వైకంఠం క్యూకాంప్లెక్స్ 1,2లోని కంపార్ట్‌మెంట్లన్ని పూర్తిగా భక్తులతో నిండిపోయాయి.

Pages