S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/24/2018 - 02:43

తిరుపతి, జనవరి 23: కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరుడు కొలువైవున్న తిరుమల పుణ్యక్షేత్రంలో రథసప్తమి వేడుకలు బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. సర్వసాధారణంగా స్వామివారి బ్రహ్మోత్సవాల్లో తొమ్మిది రోజులు పాటు స్వామివారు రెండు పూటలా రోజుకు రెండు వాహనాలపై విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు.

01/24/2018 - 02:37

ఖమ్మం, జనవరి 23: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను కలిసేందుకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు సంబంధించి బుధవారం ఉదయం కొత్తగూడెంలోనూ, సాయంత్రం ఖమ్మంలోనూ ఆయనతో అపాయింట్‌మెంట్ కూడా తీసుకున్నారు. అధికార టీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్, టీడీపీలకు చెందిన పలువురు నేతలు ఆయనను కలిసి సంఘీభావం తెలపనున్నట్లు సమాచారం.

01/24/2018 - 02:04

న్యూఢిల్లీ, జనవరి 23: తెలుగు రాష్ట్రాల్లోని సఫాయి కర్మాచారుల సంక్షేమంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని అఖిల భారత సఫాయి మజ్దూర్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. హరిద్వార్‌లో జరిగిన అఖిల భారత సఫాయి మజ్దూర్ కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసాయి. పారిశుద్ధ్య కార్మికుల నియామకాలలో ఔట్ సోర్సింగ్ విధానాలను రద్దుచేయాలని కాంట్రాక్టు సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని ఈ సమావేశాల్లో తీర్మానించారు.

01/24/2018 - 01:47

హైదరాబాద్, జనవరి 23: తెలంగాణను ప్రపంచ దేశాలకు పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ వ్యవహారాల మంత్రి కె తారక రామారావు తెలిపారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలు దేశాల అధినేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల సిఇవోలు, చైర్మన్లు సమావేశాలకు హాజరయ్యారు.

01/24/2018 - 01:42

అమరావతి, జనవరి 23: ఆంధ్రప్రదేశ్‌కు 974 కిలోమీటర్ల సముద్రతీరం ఉందని, కృష్ణా-గోదావరి బేసిన్‌లో అపార చమురు నిక్షేపాలు ఉన్నాయని, పెట్రోలియం శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు దేశంలో తమ రాష్ట్రం ఎంతో అనుకూలమని సౌదీ ఆర్మ్‌కో సంస్థకు సీఎం చంద్రబాబు సూచించారు. దావోస్ పర్యటనలో రెండోరోజు మంగళవారం సౌదీ ఆర్మ్‌కో ప్రెసిడెంట్ సైద్ అల్ హద్రమీతో బాబు సమావేశమయ్యారు.

01/24/2018 - 01:39

హైదరాబాద్, జనవరి 23: భూసేకరణ ప్రక్రియలో యజమానులకు సకాలంలో నష్టపరిహారం చెల్లించకుంటే ప్రక్రియ నిలిపే స్తామని హైకోర్టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలను హెచ్చరించింది. భూ యజమానులకు నష్టపరిహారం చెల్లించడంలో నిర్లక్ష్యం మానుకోవాలని హైకోర్టు సూచించింది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్జి జి వెంకటకృష్ణయ్య హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి భూసేకరణ ప్రక్రియ, నష్టపరిహారం చెల్లింపులో జరుగుతున్న జాప్యంపై లేఖ రాశారు.

01/24/2018 - 01:37

హైదరాబాద్, జనవరి 23: వస్తు సేవల పన్ను చట్టం దేశ స్వాతంత్య్రానంతరం ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద పన్ను సంస్కరణ అని ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. జీఎస్టీ వల్ల రాష్ట్రాలు వేసే అన్ని రకాల పన్నులూ, కేంద్ర ప్రభుత్వం వేసే అన్ని రకాల పన్నుల స్థానంలో ఒకే ఒక పన్ను చెల్లింపు వ్యవస్థ ఏర్పడిందన్నారు.

01/23/2018 - 04:00

హైదరాబాద్, జనవరి 22: నిజాయితీ, అంకితభావంతో పని చేసి, మీపై రైల్వే శాఖ ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేయాలని రైల్వే బోర్డు సిగ్నల్, టెలికం డైరక్టర్ జనరల్ అఖిల్ అగర్వాల్ ఇండియన్ రైల్వే సర్వీస్ సిగ్నల్ ఇంజినీరింగ్ (ఐఆర్‌ఎస్‌ఎస్‌ఈ)లో శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సూచించారు.

01/23/2018 - 03:59

హైదరాబాద్, జనవరి 22: రెండు రెండు గిన్నీస్ రికార్డులను సృష్టించడం ద్వారా ప్రముఖ విద్యాసంస్థలు హోలీ మేరీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (హిట్స్), గీతం యూనివర్శిటీలు మరో రికార్డును సృష్టించాయి. హోలీ మేరీ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూట్స్ కార్యదర్శి అరిమండ విజయశారదా రెడ్డి అత్యధిక మైండ్‌ఫైల్‌నెస్ లెసన్ ద్వారా సోమవారం నాడు రెండో పర్యాయం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సృష్టించారు.

01/23/2018 - 03:48

ఖమ్మం, జనవరి 22: తెలంగాణ తెలుగుదేశం పార్టీకి మరో భారీషాక్ తగలనుంది. తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, పార్లమెంటరీ పార్టీ మాజీ నేత నామా నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమయినట్టుగా తెలుస్తోంది. కొంతకాలంగా ఆయన కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరగ్గా ఆది, సోమవారాల్లో అందుకు సంబంధించిన ప్రక్రియ వేగవంతమైనట్లు సమాచారం.

Pages