S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/15/2018 - 02:58

హైదరాబాద్, మార్చి 14: కొత్త పంచాయితీ చట్టం నిబంధనల మేరకే గ్రామ పంచాయితీలకు ఎన్నికలు జరుగుతాయని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గ్రామ పంచాయితీలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే విషయమై రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.

03/15/2018 - 02:50

హైదరాబాద్, మార్చి 14: హైదరాబాద్ నగరంతో పాటు ఔటర్ రింగు రోడ్డు పరిధిలోని 190 గ్రామాలకు సమృద్ధిగా మంచినీటి సరఫరాకు రాష్ట్రప్రభుత్వం రూ.1900 కోట్లతో పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తోందని, మిషన్ భగీరథ విజన్ త్వరలో సాకారమవుతుందని మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు ప్రకటించారు.

03/15/2018 - 04:31

హైదరాబాద్: తెలంగాణ విమోచనా దినోత్సవాన్ని ఏటా సెప్టెంబర్ 17న పాటిద్దామని శాసనసభలో బిజెపి నేత జి. కిషన్‌రెడ్డి పిలుపు ఇచ్చారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో బుధవారం ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా తెలంగాణ విమోచనా దినోత్సవాన్ని జరుపుకునేందుకు ఆనాటి కాంగ్రెస్ అంగీకరించలేదంటూ కే. చంద్రశేఖరరావు ఆరోపించిన విషయాన్ని గుర్తు చేశారు.

03/14/2018 - 02:39

హైదరాబాద్, మార్చి 13: కాగితపువుడ్ ప్లాంటేషన్‌ను సాగు చేస్తున్న రైతులకు గిట్టుబాటుధరలు లభించేలా చూస్తామని ఐటిసి పేపర్ బోర్డ్స్ అండ్ స్పెషాలిటీ పేపర్స్ డివిజన్ ఐటి డివిజన్ సివోవో వాడిరాజ్ కులకర్ణి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కంపెనీ మిల్లుకు రైతులు తమ పంట ఉత్పత్తులను సరఫఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కోనుగోలు ఆర్డర్‌ను రైతులకు నేరుగా విడుదల చేస్తామన్నారు.

03/14/2018 - 02:42

యాదగిరిగుట్ట, మార్చి 13: రాష్ట్రంలోని 75లక్షల మంది రైతులకు నేరుగా రెండు పంటలకు 8వేల రూపాయలు రైతులక్ష్మి పథకం ద్వారా ఈ ఏడాది అందించేందుకు బడ్జెట్‌లో 12వేల కోట్ల కేటాయింపులను చేయనున్నారని రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్, ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి వెల్లడించారు. సమితి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన కుటుంబంతో కలిసి లక్ష్మీనరసింహుడిని దర్శించుకున్నారు.

03/14/2018 - 02:42

హైదరాబాద్, మార్చి 13: పట్టణాల పురోగతికి తెలంగాణ నగర ఆర్థిక అభివృద్ధి సంస్థ ద్వారా మరిన్ని నిధులు ఇవ్వనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు. మంగళవారం సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషననర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్సును నిర్వహించారు. పట్టణాల్లో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాల కొరకు నిధులు కేటాయించాల్సి ఉందన్నారు.

03/14/2018 - 01:44

హైదరాబాద్, మార్చి 13: రాష్ట్రంలో పేద గొల్ల, కురుమ కులాల వారిని ఆదుకునేందుకు పెద్ద ఎత్తున గొర్రెలు, పొట్టేలు సరఫరా చేశామని పాడిపరిశ్రమాభివృద్ధి మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మంగళవారం నాడు శాసనసభలో తెలిపారు.

03/14/2018 - 01:44

హైదరాబాద్, మార్చి 13: అలి అసెంబ్లీ హాల్‌లో ఎడమవైపు ఉండే కాంగ్రెస్ సభ్యులు విసిరిన మైక్‌కు మండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు కుడివైపుఎలా తగిలిందని షబ్బీర్ అలి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి డైరెక్షన్ మేరకే తాను ఆసుపత్రిలో చేరినట్టు ఓ దినపత్రికలో కూడా వచ్చిందన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని, ముఖ్యమంత్రి నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

03/14/2018 - 00:19

హైదరాబాద్, మార్చి 13: కాగితపు ఉడ్ ప్లాంటేషన్‌ను సాగు చేస్తున్న రైతులకు గిట్టుబాటుధరలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఐటిసి పేపర్ బోర్డ్స్ అండ్ స్పెషాలిటీ పేపర్స్ డివిజన్ ఐటి డివిజన్ సివోవో వాడిరాజ్ కులకర్ణి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కంపెనీ మిల్లుకు తమ పంట ఉత్పత్తులను సరఫఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కోనుగోలు ఆర్డర్‌ను రైతులకు నేరుగా విడుదల చేస్తామన్నారు.

03/14/2018 - 00:18

హైదరాబాద్, మార్చి 13: అన్ని రంగాల్లో రాష్ట్రం సమగ్ర అభివృద్ధి సాధిస్తోందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు పళ్ల రాజేశ్వర్ రెడ్డి, నారదాసు లక్ష్మణ్‌రావు, ప్రభాకార్ అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసన మండలిలో వారు ప్రసంగించారు. వ్యవసాయం నుంచి ఐటి వరకు అన్ని రంగాలపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా అభివృద్ధి జరిగేలా చూస్తుందని అన్నారు.

Pages