S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/04/2018 - 04:32

హైదరాబాద్, మార్చి 3: ప్రస్తుత వేసవిలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంటుందన్న నేపథ్యంలో వివిధ శాఖల అధికారులు వడగాడ్పుల యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌కె జోషి ఆదేశించారు. శనివారం సచివాయలంలో వివిధ శాఖల ఉన్నతాధిరులతో ఆయన వడగాడ్పుపలపై సమీక్ష నిర్వహించారు.

03/04/2018 - 04:30

హైదరాబాద్, మార్చి 3: తెలంగాణ రాష్ట్రం వైద్య రంగంలో అత్యంత ఆధునిక సదుపాయాలకు హబ్‌గా మారిందని, దేశ, విదేశాల నుంచి హైదరాబాద్‌కు వైద్య చికిత్సకు వస్తున్నారని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. శనివారం ఇక్డ అంతర్జాతీయ మెడికల్ డయాగ్నిస్టిక్స్ కంపెనీ డయాబెటోమిక్స్‌ను ఆయనన ప్రారంభించారు.

03/04/2018 - 04:28

మేడ్చల్, మార్చి 3: గుండ్లపోచంపల్లి అపెరల్ ఎక్స్‌పోర్ట్ పార్కును పూర్తిస్థాయిలో అభివృద్ధి పరిచి పూర్వవైభవం తీసుకురావాలని అధికారులను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. మేడ్చల్ మండలంలోని గుండ్లపోచంపల్లిలోని టీఎస్‌ఐఐసీ పార్కు జోనల్ కార్యాలయంలో శనివారం మంత్రి కేటీఆర్.. అపెరల్ పార్కుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. టీఎస్‌ఐఐసీ అపెరల్ పార్కులో ఎన్ని యూనిట్లు ఉన్నాయి.. ఎంతమంది పరిశ్రమలు స్ధాపించారు..

03/04/2018 - 04:24

మహబూబ్‌నగర్, మార్చి 3: గ్రామ పంచాయతీ చట్టాల్లో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కొత్త మార్పులు రాబోతున్నాయని ఇప్పటికే ఆ ప్రక్రియ ఓ దశకు చేరుకుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని వైట్‌హౌస్ ఫంక్షహాల్‌లో సర్పంచుల ప్రాంతీ య సమ్మేళనం రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.

03/04/2018 - 04:24

హైదరాబాద్, మార్చి 3: రాష్ట్రంలో ఇప్పటి వరకు 24 లక్షల క్వింటాళ్ల కందులను రూ.1315 కోట్లతో కొనుగోలు చేసినట్టు మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. శనివారం సెక్రెటరియేట్‌లో కందుల కొనుగోళ్లపై సంబందింత శాఖల అధికారులతో ఆయన సమీక్షా-సమావేశం నిర్వహించారు. కందుల కొనుగోళ్ల వ్యవహారంలో కేం ద్రం ఉదాసినంగా వ్యవహరిస్తుందని అసంతృప్తి వ్యక్తం చేశారు.

03/04/2018 - 04:23

హైదరాబాద్, మార్చి 3: సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకుంటూ అక్రమాలకు అరికడుతున్న తెలంగాణ పౌరసరఫరాల శాఖ దేశానికి ఆదర్శమని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ కార్యదర్శి రవికాంత్ అన్నారు. రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయన ఎఫ్‌సీఐ సౌత్ రీజనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్‌డీ నజీమ్, తెలంగాణ మేనేజర్ జీఎస్ రాజశేఖర్‌తో కలిసి పౌరసరఫరాల భవన్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును పరిశీలించారు.

03/04/2018 - 04:22

హైదరాబాద్, మార్చి 3: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు పట్టాదారు పుస్తకాల పంపిణీ కార్యక్రమంపై వస్తున్న భిన్న కథనాలను భూపరిపాలనా శాఖ డైరెక్టర్ వీ.కరుణ ఖండించారు. పద్ధతి ప్రకారం భూప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా అన్ని కార్యక్రమాలు సజావుగా జరుగుతున్నాయని చెప్పారు. 72.11లక్షల ఖాతాదారులకు 53.34లక్షల ఖాతాలకు సంబంధించి ఆదార్ ఫీడింగ్ ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలిపారు.

03/04/2018 - 04:22

హైదరాబాద్, మార్చి 3: తెలంగాణ సొమ్ము తిన్న రాష్ట్ర ఐటి, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కే. తారక రామారావు కళ్ళు నెత్తికి ఎక్కాయని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. శాప్ మాజీ చైర్మన్ రాజ్ ఠాకూర్‌తో పాటు నిజామాబాద్, గ్రేటర్ హైదరాబాద్‌లోని పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శనివారం ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్‌లో చేరారు.

03/04/2018 - 04:21

హైదరాబాద్, మార్చి 3: ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అవకాశవాది అని ఎఐసిసి నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిద్ధాంతపరంగా బిజెపి పట్ల రహాస్య ఒప్పందం ఉందని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ దుయ్యబట్టారు. 2014 ఎన్నికల్లో బిజెపితో కలిసి పోటీ చేయాలని అడ్జస్ట్ కావాలని దాదాపు బతిమిలాడారని ఆయన తెలిపారు.

03/04/2018 - 04:20

జగిత్యాల, మార్చి 3: రాబోవు బడ్జెట్ సమావేశంలో పంచాయతీరాజ్ చట్టంలో మార్పు లు తీసుకురాబోతున్నామని, సక్రమంగా పనిచేయని సర్పంచ్‌లను తొలగించేలా మార్పు లు ఉంటాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి మొట్టమొదటిసారిగా జగిత్యాలకు రాగా, పౌర సన్మానాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు.

Pages