S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/18/2017 - 02:47

హైదరాబాద్, నవంబర్ 17: బిసి ప్రజా ప్రతినిధులతో వచ్చే నెల 3వ తేదీన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చెప్పారు. శుక్రవారం నాడు శాసనసభలో సున్నం రాజయ్య, టి ప్రకాష్ గౌడ్ , కె లక్ష్మణ్ తదితరులు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానం చెబుతూ అత్యంత వెనుకబడిన తరగతుల కోసం ప్రత్యేక సంస్థ ఏర్పాటుపై వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో ఉండే అత్యధిక జనాభా బిసిలేనని అన్నారు.

11/18/2017 - 03:34

నల్లగొండ, నవంబర్ 17: నాగార్జున సాగర్ ఎడమకాలువ ఆయకట్టులో యాసంగి పంటల సాగుకు 40టిఎంసిల నీటి విడుదలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఆయకట్టు రైతుల్లో హర్షాతిరేకాలు నిం పింది.

11/18/2017 - 00:53

చేగుంట, నవంబర్ 17: విద్యా వ్యవస్థను పటిష్టపరచడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నిరంతరం కృషి చేస్తున్నారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో మోడల్ పాఠశాల, కళాశాల భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో మంత్రి హరీష్‌రావు కృషితో ఎనలేని అభివృద్ధి జరుగుతోందన్నారు.

11/18/2017 - 00:32

న్యూఢిల్లీ,నవంబరు 17: దేశ రాజధానిలోని ఎన్‌డీఎంసీ పరిధిలో అమలవుతున్న సంక్షేమ కార్యకాలపాలను పరిశిలించేందుకు తెలంగాణ మేయర్లు,అధికారులు బృందం ఢిల్లీలో పర్యటించింది.్ఢల్లీ స్టడిటూర్‌లో భాగంగా తెలంగాణ భవన్‌లోని గురజాడ సమావేశం మందిరంలో న్యూఢిల్లీ మున్సిపాల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ) ఉన్నతాధికారులు,తెలంగాణ రాష్టమ్రేయర్లు,ఉన్నతాధికారులు బృందానికి పవర్ పాయిట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.ఇందులో భాగంగా దేశ రాజధాని ప

11/18/2017 - 00:31

హైదరాబాద్, నవంబర్ 17: రాష్ట్రంలోని ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్టు డిప్యుటీ సిఎం కడియం శ్రీహరి చెప్పారు. శాసనసభ ప్రశ్నోత్తర కార్యక్రమంలో గురువారం నాడు ర్యాగ కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. ఎయిడెడ్ పాఠశాలలు 742 ఉన్నాయని, వాటిలో 1.23 లక్షల మంది చదువుతున్నారని డిప్యుటీ సిఎం చెప్పారు.

11/18/2017 - 00:31

హైదరాబాద్, నవంబర్ 17: ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం నియమించిన ప్రొఫెసర్ టి తిరుపతిరావు కమిటీ నివేదిక ఇవ్వడం లేదని, దాంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు నాగటి నారాయణ, ప్రధానకార్యదర్శి ధనసిరి ప్రకాష్‌లు ఆరోపించారు. ఈనెల 15తో ఐదోసారి గడువు పెట్టారని, అది కూడా దాటిపోయిందని అన్నారు.

11/18/2017 - 00:30

హైదరాబాద్/ఉప్పల్, నవంబర్ 17: స్పెషల్ ఫోకస్‌తో ఐటిడిఎల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. శుక్రవారం శాసన మండలి సమావేశాల ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు రాములు నాయక్ మాట్లాడుతూ ఏజెస్సీ ప్రాంతాల్లో అధిక శాతం ఉన్న గిరిజనులు పలు సమస్యలతో దుర్భర జీవనం గడుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పరిశీలనలో గీత వృత్తి ఫెడరేషన్

11/18/2017 - 00:30

హైదరాబాద్, నవంబర్ 17: జిల్లాల పునర్ విభజన అంశం శాస్ర్తియబద్ధంగా జరగలేదని అసెంబ్లీలో విపక్షాల నేతలు విమర్శించారు. ‘రాష్ట్రంలో పరిపాలనా సంస్కరణలు-నూతన పాలనా వ్యవస్థ’ అనే అంశంపై శుక్రవారం అసెంబ్లీలో చర్చ జరిగింది.

11/18/2017 - 00:29

హైదరాబాద్, నవంబర్ 17: షెడ్యూల్డు కులాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి అభివృద్ధికి అగ్రతాంబూలం ఇస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. ఎస్సీ,ఎస్టీల అభివృద్ధికి ఖర్చు చేసిన ప్రతి పైసా నిజాయితీగా ఖర్చు చేస్తున్నామని అన్నారు.

11/17/2017 - 04:31

హత్నూర, నవంబర్ 16: ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇద్దరు రైతుల నిండు ప్రాణా లు బలయ్యాయ. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చీక్‌మద్దూర్ గ్రామం లో గురువారం ఉదయం 9 గంటలకు చోటు చేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన వేలు రవీందర్‌రెడ్డి (35), మరెల్లి శ్రీశైలం (37) ఉదయం వ్యవసాయ పొలం వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతు కోసం బయలుదేరారు.

Pages