S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/17/2017 - 04:30

రామాయంపేట, నవంబర్ 16: బడి పిల్లలను తీసుకొని వచ్చిన బస్సును పార్కింగ్ చేయడానికి వెనుకకు తీస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి బస్సుకు నిప్పంటుకుంది. టైర్లు కాలిపోవడాన్ని గమనించిన డ్రైవర్ బస్సులో నుండి కిందికి దూకినా బస్సుకు తాకడంతో షాక్‌కు గురయ్యాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ బాధితుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందగా..క్లీనర్ కిందకి దూకి బతికి బయటపడ్డాడు..వివరాల్లోకి వెళ్తే ..

11/17/2017 - 04:26

హైదరాబాద్, నవంబర్ 16: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ,ఎస్టీ, బిసి , మైనార్టీ , జనరల్ , కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్ స్కూళ్లలో విద్యార్ధులందరికీ ఒకే రకమైన భోజన వసతులు, వౌలిక వసతులు కల్పించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కావల్సిన నిధులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు.

11/17/2017 - 04:25

హైదరాబాద్, నవంబర్ 16: రాష్ట్రంలో నర్సింగ్ విభాగానికో ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేస్తామని వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి చెప్పారు. గురువారం నాడు శాసనసభలో డాక్టర్ లక్ష్మణ్, ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిస్తూ నర్సింగ్ డైరెక్టరేట్ అవసరం ఉందని అన్నారు. మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు కూడా పరిశీలనలో ఉందని చెప్పారు.

11/17/2017 - 04:25

హైదరాబాద్, నవంబర్ 16: వచ్చే ఏడాది మార్చిలోగా రాష్ట్రంలో లక్ష ఎకరాలకు సాగు నీరు అందిస్తామని నీరుపారుదల మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తర కార్యక్రమంలో ఎత్తిపోతల పథకం పనులపై ఎమ్మెల్యే వేముల వీరేశం అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఉదయ సముద్రం ఎత్తిపోతల పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు.

11/17/2017 - 04:24

హైదరాబాద్, నవంబర్ 16: రాష్ట్రంలో గురుకుల విద్యాలయాలు చక్కగా పని చేస్తున్నాయని, 90 శాతానికిపైగా ఉత్తీర్ణతతో పాటు సుప్రసిద్ధ విద్యా సంస్థల్లో సీట్లు పొందడంతో పాటు మంచి మంచి ర్యాంకులు సాధిస్తున్నారని మంత్రి జి జగదీశ్‌రెడ్డి చెప్పారు.

11/17/2017 - 00:35

హైదరాబాద్, నవంబర్ 16: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు శుభవార్త. ఎస్‌ఆర్‌ఎస్‌పి పరిధిలో ఈ యాసంగి సీజన్‌లో 6.10 లక్షల ఎకరాలకు సాగునీటిని సరఫరా చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్‌లో ఈ సాగునీటిని విడుదల చేయాలని, ఈ విషయమై నాలుగు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సును నిర్వహించాలని మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావు ఉన్నతాధికారుల సమావేశంలో వెల్లడించారు.

11/17/2017 - 00:35

హైదరాబాద్/ఖైరతాబాద్, నవంబర్ 17: జర్నలిస్టులకు త్రిబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కట్టించడంతో పాటు వారి సంక్షేమానికి 100 కోట్లు కేటాయిస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. సాదారణ ప్రజల లాగే జర్నలిస్టులను సైతం ప్రభుత్వం మోసం చేస్తుందని మండిపడ్డారు.

11/16/2017 - 22:58

హైదరాబాద్, నవంబర్ 16: దళిత విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్‌షిప్‌లకోసం ప్రభుత్వం గురువారం దాదాపు 108 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) లో 1785 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇందులో ఇప్పటి వరకు 1251 కోట్ల రూపాయలు విడుదల చేశారు.

11/16/2017 - 22:57

హైదరాబాద్, నవంబర్ 16: కల్లుగీత కార్మికులకు చెల్లించే పరిహారాన్ని రెండు లక్షల నుండి ఐదు లక్షలకు పెంచినట్టు అబ్కారీ మంత్రి పద్మారావు గౌడ్ చెప్పారు. శ్రీనివాస్ గౌడ్ అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిస్తూ 2014 నుండి నేటి వరకూ రాష్ట్రంలో 1.69 కోట్ల ఈతచెట్లను నాటామని అన్నారు.

11/16/2017 - 22:57

హైదరాబాద్, నవంబర్ 16: ఒక్కో గదిలో ఇరవేసి మంది విద్యార్థులు, ఒకటే బాత్‌రూమ్, ఒకటే ఫ్యాన్ ఇదేనా బంగారు తెలంగాణ అంటే అని కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ మూడేళ్లలో ఏర్పాటు చేసిన గురుకుల విద్యాసంస్థల్లో కనీసం ఒక్కదానికైనా పక్కా భవనాన్ని ఏర్పాటు చేసిందా? రెగ్యులర్ ఉద్యోగులను నియమించిందా?

Pages