S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/09/2017 - 00:59

హైదరాబాద్, నవంబర్ 8: 2019 ఎన్నికల్లోనూ తెరాస పార్టీయే ఆధికారంలోకి వస్తుందని అసెంబ్లీలో ఎంఐఎం శాసనసభా పక్షం నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెరాసతో ఎంఐఎం కలిసి పనిచేస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు బల్దియా ఎన్నికల్లో పట్టినగతే వచ్చే ఎన్నికల్లోనూ పునరావృతం కాబోతుందన్నారు.

11/08/2017 - 23:52

హైదరాబాద్, నవంబర్ 8: వైద్య ఆరోగ్య శాఖకు జీవం పోశామని, చీటికీ మాటికీ వైద్యులపై విమర్శలు చేయవద్దని, వారంతా బాగా పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పేర్కొన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఆస్పత్రులు భయంకర స్థితిలో కూరుకుపోయాయని, నేటి వైద్య ఆరోగ్య మంత్రి కూడా వైద్యుడు కనుక కష్టపడి పనిచేసి వైద్య రంగాన్ని అభివృద్ధి చేశారని పేర్కొన్నారు.

11/08/2017 - 23:49

హైదరాబాద్, నవంబర్ 8: తెలంగాణ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో 1261 ఉద్యోగాలకు తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. 1196 స్ట్ఫా నర్సులు, 6 ఫిజియో థెరపిస్టులు, 35 రేడియోగ్రాఫర్లు, రెండు పారామెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్ పోస్టులు, 21 హెల్త్ సూపర్‌వైజర్ పోస్టులు, ఒక రిఫ్రాక్షనిస్టు పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నెల 16 నుండి డిసెంబర్ 11 వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు.

11/08/2017 - 23:46

కాటారం, నవంబర్ 8: నాటుసారా తాగి ఏడుగురు వ్యక్తులు అస్వస్థతకు గురి కాగా వారిలో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో బుధవారం చోటుచేసుకుంది. మండలంలోని గుమ్మళ్ళపల్లిలో బుధవారం కూలీ పనులు చేసుకుంటున్న కుటుంబంతో పాటు తోటి కూలీలు ఓచోట నాటుసారా సేవించారు. దాంతో ఆ కుటుంబంతో పాటు కూలీలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

11/08/2017 - 23:45

హైదరాబాద్, నవంబర్ 8: పశు సంవర్థక శాఖలో అర్హులైన అధికారులకు పదోన్నతులు కల్పించాలని, ఇంకా పెండింగ్‌లో ఉన్న వారికీ ఈ నెలాఖరులోగా పదోన్నతులు కల్పిస్తామని రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనానివాస్ యాదవ్ తెలిపారు. పశుసంవర్థక శాఖను పటిష్టం చేయడంలో భాగంగా వివిధ స్థాయిలో పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియను త్వరలో పూర్తి చేయనున్నట్లు చెప్పారు.

11/08/2017 - 23:44

హైదరాబాద్/ ఉప్పల్, నవంబర్ 8: తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యను పటిష్ఠం చేయడానికి ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. బుధవారం శాసన మండలి సమావేశం చైర్మన్ కె.స్వామి గౌడ్ అధ్యక్షతన జరిగింది.

11/08/2017 - 22:40

హైదరాబాద్, నవంబర్ 8: పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ కాంగ్రెస్, వామపక్షాల నేతలు, కార్యకర్తలు వేర్వేరుగా ఉద్యమించారు. పెద్ద నోట్ల రద్దు జరిగి బుధవారానికి ఏడాది పూర్తయిన సందర్భంగా టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ ఆర్‌సి కుంతియా, సిఎల్‌పి నేత కె.

11/08/2017 - 22:37

చిట్యాల, నవంబర్ 8: పత్తిని కొనుగోలు చేసే సీసీఐ కేంద్రాల్లో అధికారులు పత్తిని కొనుగోలు చేయడంలేదని పత్తిరైతులు నల్లగొండ జిల్లా చిట్యాలలో బుధవారం రాస్తారోకో చేశారు.

11/08/2017 - 22:36

వరంగల్, నవంబర్ 8: అధికార పార్టీకి చెందిన నాయకుల, కార్పొరేట్ కంపెనీల నల్లడబ్బును తెల్లగా మార్చేందుకే ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెద్దనోట్లను రద్దు చేసారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ ఆరోపించారు. ప్రధాని మోడీ పెద్దనోట్ల రద్దు వ్యవహారంలో తుగ్లక్‌లా వ్యవహరించారని, ప్రధాని, ఆర్‌బీఐ గవర్నర్ కలిసి ఆడిన నాటకమని విమర్శించారు.

11/08/2017 - 22:35

ఆదిలాబాద్,నవంబర్ 8: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో గోం డు, లంబాడా గిరిజన తెగల మద్య ప్రచ్చన్నపోరు రాజుకుంది. వలసవచ్చిన లంబాడా తెగలను ఎస్టీ జాబితా నుండి తొలగించి, అడవులను నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఆదివాసీ గిరిజనులకు హక్కులు కల్పించాలన్న డిమాండ్లతో ఉట్నూరు ఏజెన్సీ కేంద్రం లో బుధవారం ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళ్తే..

Pages