S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/10/2017 - 03:27

హైదరాబాద్, నవంబర్ 9: రాష్ట్రంలో ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ సమయంలో అభ్యర్ధులు హైస్కూల్ చదువు ఆధారంగానే స్థానికతను నిర్ధారిస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు.

11/10/2017 - 03:25

హైదరాబాద్, నవంబర్ 9: చేనేత , మరమగ్గాల కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందని, ఇందుకోసం ప్రభుత్వం బడ్జెట్‌లో 1270 కోట్ల రూపాయిలు కేటాయించిందని ఐటి మంత్రి కె తారకరామారావు చెప్పారు. చేనేత కార్మికులను ఆదుకున్న అంశంపై ఆయన గురువారం నాడు శాసనసభలో ఒక ప్రకటన చేశారు. ఆధునికతను అందిపుచ్చుకోవడంలో లోపంతో చేనేత రంగం తీవ్రంగా ప్రభావితం అయిందని అన్నారు.

11/10/2017 - 02:33

హైదరాబాద్, నవంబర్ 9: ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ ప్రియన్ (53) కన్నుమూశారు. గురువారం మధ్యాహ్నం చెన్నయ్‌లోని తన స్వగృహంలో ఆయనకు తీవ్ర గుండెపోటు రావడంతో హాస్పిటల్‌కు తరలించగా ఆయన కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధారించారు. తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘సింగం’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే.

11/10/2017 - 02:30

హైదరాబాద్, నవంబర్ 9: ఉగ్రవాదాన్ని టెక్నాలజీతోనే అణచివేశామని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. పోలీస్ శాఖలో ప్రజల సహకారంతోనే తన సేవలు విజయవంతమయ్యాయని డీజీపీ అనురాగ్ శర్మ వెల్లడించారు. గురువారం ఆయన విలేకరుల ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు తనను ఎంతో ఆదరించారని, ఏ పండుగలైనా, ఎలాంటి వేడుకలైనా సామరస్యంగా జరుపుకుంటూ శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా సహకరించారన్నారు.

11/10/2017 - 02:28

హైదరాబాద్/చాంద్రాయణగుట్ట, నవంబర్ 9: తెంలగాణ శాసనమండలిలో గురువారం ఉదయం ఆధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మద్య ప్రశ్నోత్తరాల పర్వం వాడి వేడిగా సాగింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమధానాలిచ్చారు. ఆహార భద్రతకు సంబంధించి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, రాష్ట్రంలో మొత్తం 30 ఫుడ్ ఇన్స్‌పెక్టర్లను నియమించిన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్మారెడ్డి తెలిపారు.

11/10/2017 - 02:27

హైదరాబాద్, నవంబర్ 9: కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులన్నీ పెండింగ్‌లో ఉంటే తమ హయాంలో రన్నింగ్‌లోకి వచ్చాయని నీటిపారుదలశాఖ మంత్రి టి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చుంటే ప్రాజెక్టులు పూర్తి అయ్యేవా? నీళ్లు వచ్చి ఉండేవా? అని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో గురువారం మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్, టిడిపి నేతలు, కార్యకర్తలు మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు.

11/10/2017 - 02:26

హైదరాబాద్, నవంబర్ 9: పదో తరగతి పరీక్షలను 2018 మార్చి 15వ తేదీ నుండి నిర్వహించనున్నట్టు తెలంగాణ పరీక్షల బోర్డు సంచాలకుడు బి సుధాకర్ తెలిపారు. రెగ్యులర్ పరీక్షలు ఉదయం 9.30కు ప్రారంభమై మధ్యాహ్నం 12.15 వరకూ జరుగుతాయి. ఒఎస్సెస్సీ పరీక్షలు మధ్యాహ్నం 12.45 వరకూ జరుగుతాయని, సమయ వేళలలను విద్యార్థులు చూసుకోవాలని చెప్పారు.

11/10/2017 - 02:24

హైదరాబాద్, నవంబర్ 9: పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ఒక్క హైదరాబాద్ నగరంలో ప్రతిపాదించిన లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లకు టెండర్ల ప్రక్రియ పూర్తయినట్లు మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు వెల్లడించారు. గురువారం ఆయన జలమండలి కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెండర్లు పూర్తయిన మొత్తం ఇళ్లను నిర్దేశిత లక్ష్యంతో ఏడాదిలోగా నిర్మించనున్నట్లు తెలిపారు.

11/09/2017 - 23:18

హైదరాబాద్, నవంబర్ 9: తెలంగాణ శాసన సభ మూడు చట్ట సవరణ బిల్లులను ఆమోదించింది. గురువారం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రవేశపెట్టిన పీడీ యాక్టు పరిధిలోకి వచ్చే దోపిడీ, దొంగతనాలు, డ్రగ్స్ నేరాలు, గూండాల రౌడీయిజం, మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులు, ట్రాఫిక్ అఫెండర్స్, భూ కబ్జాదారులపై కఠినంగా వ్యవహరించే విధంగా ఉండే ఈ చట్టాన్ని చట్ట సభ అమోదించింది.

11/09/2017 - 23:18

హైదరాబాద్, నవంబర్ 9: 20 వ అంతర్జాతీయ పిల్లల చలన చిత్రోత్సవాన్ని ‘రాష్ట్ర పండగ’గా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గురువారం రాష్ట్రప్రభుత్వ ముఖ్యకార్యదర్శి (పొలిటికల్) అదర్ సిన్హాపేరుతో సాధారణ పరిపాలనా శాఖ జీఓ జారీ చేసింది. 2017 నవంబర్ 8 నుండి 14 వరకు జరుగుతున్న బాలల చలన చిత్రోత్సవాన్ని రాష్ట్ర పండగగా గుర్తించడంతో ఇందుకు అవసరమైన ఖర్చును బడ్జెట్ నుండి వ్యయం చేసేందకు వీలవుతోంది.

Pages