S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/09/2017 - 01:35

హైదరాబాద్-కాచిగూడ, నవంబర్ 8: నటుడు కమల్ హసన్ దేశద్రోహి అని కాకినాడ శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి సంచలన వాఖ్యలు చేశారు. ఆయన బుధవారం జలవిహర్‌లో విలేఖరుతో మాట్లాడుతూ, హిందువులు తీవ్రవాదులని, కాషాయ ఉగ్రవాదులని కమల్ చేసిన విమర్శలను ఏ హిందువూ సహించడని అన్నారు. హిందూవుల ప్రతిష్టను దిగజార్చే వారంతా దేశద్రోహులేనని అన్నారు.

11/09/2017 - 01:34

హైదరాబాద్/ ఖైరతాబాద్, నవంబర్ 8: ప్రధాని మోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. చిన్న, సన్నకారు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, జిఎస్‌టి వల్ల పరిస్థితి మరింత దిగజారిందని అన్నారు. నోట్ల రద్దు, జిఎస్‌టితో కుదేలైన రైతును ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన మండిపడ్డారు.

11/09/2017 - 01:34

హైదరాబాద్, నవంబర్ 8: ఎస్సీ, ఎస్టీ వర్గాల్లోని కిషోర బాలికల భద్రత, రక్షణకు మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం విడదల చేసింది. ఇందుకు అవసరమైన శిక్షణను ఇవ్వడం, సంబంధిత లక్ష్యాలను వెల్లడించింది. ఎస్సీ, ఎస్టీల్లోని 13 నుంచి 21 ఏళ్ల లోపు వయస్సు ఉన్న అవివాహిత కిషోర బాలికలు ఎక్కడెక్కడ పాఠశాల విద్య మానివేసి ఉన్నారో ఆయా అంగన్‌వాడీల ద్వారా గుర్తించాలని ప్రభుత్వం తెలిపింది.

11/09/2017 - 01:32

హైదరాబాద్, నవంబర్ 8: ఈ నెల 10న కౌలు రైతుల రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ కౌలు రైతు సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే సదస్సుకు రాష్ట్ర నలుమూలల నుంచి కౌలు రైతులు హాజరు కావాలని సంఘం అధ్యక్షుడు రమేష్, ఉపాధ్యక్షుడు వెంకట్రాములు, కార్యదర్శి టి.సాగర్ విజ్ఞప్తి చేశారు.

11/09/2017 - 01:32

హైదరాబాద్, నవంబర్ 8: తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనురాగ్ శర్మ పదవీ కాలం ఈనెల 12తో ముగియనుంది. మూడున్నరేళ్లు డీజీపీగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన ఆదివారం పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా డీజీపీ అనురాగ్ శర్మ బుధవారం కాస్సేపు మీడియాతో మాట్లాడారు.

11/09/2017 - 01:31

హైదరాబాద్, నవంబర్ 8: మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత డి శ్రీ్ధర్ బాబుకు హైకోర్టులో ఉపశమనం లభించింది. చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌లో ఎన్‌డిపిఏ చట్టం కింద నమోదైన కేసులో శ్రీ్ధర్ బాబుకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. ఈ బెయిల్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ షామీమ్ అక్తర్ మంజూరు చేశారు.

11/09/2017 - 01:30

హైదరాబాద్, నవంబర్ 8: కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచందర్‌రెడ్డి ఏ మాత్రం ఆత్మగౌరవం లేని చీడ పురుగని టిఆర్‌ఎస్ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు ఆగ్రహం వ్యక్తం చేసారు. మంత్రి కెటిఆర్‌ను విమర్శించే స్థాయి వంశీచందర్‌రెడ్డికి లేదన్నారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే కల్వకుర్తి ప్రజలే ఆయనకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

11/09/2017 - 01:06

హైదరాబాద్, నవంబర్ 8: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. ప్రాజెక్టు నిర్మాణంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన స్టేను హైకోర్టు బుధవారం ఎత్తివేసింది. ప్రాజెక్టు విషయంలో మంచినీటి అవసరాలకు ఉద్దేశించిన నిర్మాణాలను ఆపాల్సిన అవసరం లేదంటూ క్లియరెన్స్ ఇచ్చింది.

11/09/2017 - 01:05

హైదరాబాద్, నవంబర్ 8: దేశంలో ఏ రాష్ట్రం చేయని సాహసం తెలంగాణ చేస్తోందని, రైతులకు 24 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరాతో సరికొత్త రికార్డు నెలకొల్పుతోందని సీఎం కె చంద్రశేఖరరావు ప్రకటించారు. విద్యుత్ రంగానికి సంబంధించి అన్నివిధాలా కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. కొత్త సబ్‌స్టేషన్ల ఏర్పాటు, కొత్త లైన్ల నిర్మాణం, అదనపు ఉత్పాదక కేంద్రాలు నెలకొల్పుతున్నామని ప్రకటించారు.

11/09/2017 - 01:01

హైదరాబాద్, నవంబర్ 8: హైదరాబాద్ నగరంలో బిచ్చగాళ్లకు గడ్డుకాలం వచ్చింది. ఫుట్‌పాత్‌లు, బస్టాండ్, రైల్వే స్టేషన్ల వద్ద భిక్షమెత్తుకునే యాచకులను పోలీసులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు జరుగనున్న నేపథ్యంలో నగరంలో ఎక్కడా యాచకులు కనిపించకూడదని, యాచక రహిత నగరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Pages