S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/10/2017 - 23:33

హైదరాబాద్/చాంద్రాయణగుట్ట, నవంబర్ 10: తెలంగాణ శాసన మండలి మూడు చట్ట సవరణ బిల్లులను అమోదించింది. గురువారం హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి ప్రవేశపెట్టిన పీడీ యాక్టు పరిధిలోకి వచ్చే దోపిడీ, దొంగతనాలు, డ్రగ్స్ నేరాలు, గూండాల రౌడీయిజం, మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులు, ట్రాఫిక్ అఫెండర్స్, భూ కబ్జాదారులపై కఠినంగా వ్యవహరించే విధంగా ఉండే చట్టాన్ని మండలి అమోదించింది.

11/10/2017 - 03:51

హైదరాబాద్, నవంబర్ 9: తెలంగాణ జైళ్ల శాఖ ప్రవేశపెట్టిన నూతన సంస్కరణల అమలును పలువురు ప్రశంసించారు. గురువారం చంచల్‌గూడ జైలులో జైళ్ల సంస్కరణలు-అమలుపై జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు దేశంలోని 14 రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ జైళ్లశాఖ ప్రవేశపెట్టి, అమలుపరుస్తోన్న సంస్కరణలను అధ్యయనం చేశారు. అమలు తీరును అభినందించారు.

11/10/2017 - 03:46

హైదరాబాద్, నవంబర్ 9: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పురపాలక, నగర పంచాయతీ కౌన్సిలర్ల గౌరవ వేతనం పెంచేందుకు కృషి చేస్తానని పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ హామీ ఇచ్చినట్లు తెలంగాణ మున్సిపల్, నగర పంచాయతి కౌన్సిలర్ల అసోసియేషన్ వెల్లడించింది. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో అసోసియేషన్ అధ్యక్షుడు కెఎల్‌ఎన్ ప్రసాద్ తదితరులు మంత్రి కెటిఆర్‌ను గురువారం శాసనసభలో కలిసి వినతిపత్రం సమర్పించారు.

11/10/2017 - 03:43

నిజామాబాద్, నవంబర్ 9: రబీలో వ్యవసాయ రంగానికి సరిపడా సాగు నీటిని అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని, సాగు జలాల విషయంలో రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి భరోసా కల్పించారు. నిజాంసాగర్ ఆయకట్టు కింద ఒక్క గుంట భూమి సైతం ఎండిపోనివ్వకుండా, ప్రతి ఎకరాకు సాగునీరందిస్తామని అన్నారు.

11/10/2017 - 03:37

హైదరాబాద్, నవంబర్ 9: తెలంగాణ దేవాలయాలకు ధూపదీప నైవేద్యం, అర్చకులకు గౌరవ వేతనానికి సంబంధించి రాష్ట్రప్రభుత్వం మార్గదర్శకాలతో కూడిన జీవోను బుధవారం జారీ చేసింది. దీనికి సంబంధించి నిర్దేశిత దరఖాస్తు ఫారంను కూడా జీవోకు జతపరిచారు.

11/10/2017 - 03:34

హైదరాబాద్, నవంబర్ 9: తెలంగాణ చరిత్రను తిరగ రాస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. మైనారిటీ సంక్షేమంపై శాసనసభలో జరిగిన చర్చకు గురువారం సమాధానం ఇస్తూ, తెలంగాణకు గొప్ప చరిత్ర ఉందన్నారు. అన్ని మతాలు, కులాలవారు కలిసిమెలిసి జీవిస్తున్నారని, గత మూడేళ్లలో మతకలహాల జాడలేదని గుర్తు చేశారు. గతంలో రాజకీయాల లబ్దికోసం మతకలహాలు సృష్టించేవారని కెసిఆర్ ఆరోపించారు.

11/10/2017 - 03:33

హైదరాబాద్, నవంబర్ 9: మైనార్టీల సంక్షేమానికి గడిచిన మూడేళ్లుగా బడ్జెట్‌లో కేటాయించిన నిధులలో 50 శాతం కూడా ఖర్చు చేయకపోవడంతో ఈ వర్గాలపై ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తుందని శాసనసభలో కాంగ్రెస్ పక్షం ఉప నాయకుడు టి జీవన్‌రెడ్డి విమర్శించారు.

11/10/2017 - 03:31

హైదరాబాద్, నవంబర్ 9: మైనార్టీలు, గిరిజనులకు రిజర్వేషన్లు పెంచే అంశం కేంద్ర ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉందని, ఈ వర్గాలకు రిజర్వేషన్ల పెంపును సాధించి తీరుతామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ధీమా వ్యక్తం చేసారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మారిన సామాజిక పరిస్థితులు, జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలని ఇప్పటికే ప్రధాన మంత్రిని కోరాగా సానుకూలంగా స్పందించారని ముఖ్యమంత్రి తెలిపారు.

11/10/2017 - 03:30

హైదరాబాద్, నవంబర్ 9: పీడీ యాక్టు దుర్వినియోగమయ్యే ప్రమాదముందని, దీనిపై పునరాలోచించాలని శాసనసభలో బిజెపి, కాంగ్రెస్, సీపిఎం డిమాండ్ చేశాయి. గురువారం చట్టసభలో ఈ అంశంపై వాడివేడిగా చర్చ జరిగింది. ఈ అంశంపై స్పందించిన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ, పీడీ ప్రయోగంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిరక్షించబడుతున్నాయని, ఈ చట్టం కొత్తేమి కాదని, 1986 నుంచే ఇది అమల్లో ఉందన్నారు.

11/10/2017 - 03:28

హైదరాబాద్, నవంబర్ 9: కేంద్ర వక్ఫ్ చట్టానికి అనుగుణంగా తెలంగాణ వక్ఫ్ చట్టాన్ని కొత్తగా రూపొందించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తులు అన్నింటినీ వెంటనే గుర్తించి, వాటిని పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వక్ఫ్ బోర్డు సభ్యులతో గురువారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.

Pages