S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/13/2017 - 01:15

హైదరాబాద్, మే 12: రాజధానికి 260 కిలో మీటర్ల దూరంలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఎలా సాగుతున్నాయో ముఖ్యమంత్రి కెసిఆర్ తన చాంబర్ నుంచే పరిశీలిస్తారు. నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు తన చాంబర్ నుంచే ప్రాజెక్టు పనులు చూస్తూ సూచనలు చేస్తారు. ఇదే సమయంలో ప్రాజెక్టు పనులు చేపట్టిన కాంట్రాక్టు సంస్థ మెగా కన్‌స్ట్రక్షన్ తన కార్యాలయం నుంచే పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు సూచనలు అమలు చేస్తుంది.

05/13/2017 - 01:14

హైదరాబాద్, మే 12: రాష్ట్రంలో రానున్న వారం రోజుల్లో ఎండలు ముదిరే అవకాశం ఉంది. చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 44 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుందని ప్రభుత్వ వాతావరణ శాఖ విశే్లషణ విభాగం వెల్లడించింది. రాష్ట్రంలోని ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 41 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు, మిగిలిన ప్రాంతాల్లో 39 డిగ్రీల నుంచి 42 డిగ్రీలకు చేరుకుంటుందని స్పష్టం చేసింది.

05/13/2017 - 01:13

హైదరాబాద్, మే 12: ఐపిఎస్ అధికారులు వెంటనే తమ కుటుంబాలకు చెందిన స్థిరాస్తుల వివరాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపించాలని సూచిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సర్క్యులర్‌ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డిజిపిలకు పంపించారు.

05/12/2017 - 06:27

హైదరాబాద్, మే 11: దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ జోన్ పరిధిలోని పార్లమెంట్ సభ్యులతో జిఎం వినోద్‌కుమార్ యాదవ్ గురువారం సమావేశమయ్యారు. రైల్వే పెండింగ్ పనులపై చర్చించారు. జోన్ పరిధిలోని తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన పార్లమెంట్ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపిలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను చిన్న స్టేషన్లలో ఆపాలని కోరారు.

05/12/2017 - 06:25

హైదరాబాద్, మే 11: రాష్టప్రతి, ఉప రాష్టప్రతి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థికే ఓటు వేయాలని టిఆర్‌ఎస్ నాయకత్వం నిర్ణయించింది. బిజెపికి ప్రస్తుత బలానికి తోడు రోజు రోజుకు కొత్త మిత్రుల బలం తోడవుతోంది. ఎన్నికల్లో ప్రత్యర్థులుగా నిలిచిన వారు సైతం మద్దతు ఇస్తున్నారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసినప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో బిజెపికి మద్దతు ఇవ్వనున్నట్టు కెసిఆర్ వివరించారని పార్టీ వర్గాలు తెలిపాయి.

05/12/2017 - 06:25

హైదరాబాద్, మే 11: భూ సేకరణ చట్ట సవరణకు ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అయినప్పటికీ శాసనసభలో బిల్లు ఆమోదించి కేంద్ర నుంచి ఆమోదముద్ర వేయించుకుని పంతం నెగ్గించుకున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం అదే స్ఫూర్తితో జోనల్ వ్యవస్థ రద్దుకు రంగం సిద్ధం చేస్తోంది. రాష్ట్ర విభజన చట్టంలో జోనల్ వ్యవస్థ రద్దుకు అవకాశం ఉండటంతో చట్టబద్ధ ప్రక్రియ ద్వారా రద్దు చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.

05/12/2017 - 06:19

హైదరాబాద్, మే 11: వంతెనలకు చెక్ డ్యామ్‌లు నిర్మించాలనే తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నం విజయవంతం అవుతోంది. కర్నాటకలో తొలుత దీన్ని అమలు చేశారు. వంతెనను చెక్ డ్యామ్‌గా ఉపయోగపడేట్టు నిర్మించడం వల్ల నీటిని సద్వినియోగం చేసుకునే అవకాశం లభిస్తుంది. రాష్ట్రంలో 150 వంతెనలకు చెక్ డ్యామ్‌లను ఏర్పాటు చేయనున్నారు. సాంకేతికంగా అవకాశం ఉన్న అన్ని వంతెనలకు చెక్ డ్యామ్‌లు ఏర్పాటు చేయనున్నారు.

05/12/2017 - 06:19

హైదరాబాద్, మే 11: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న గొర్రెల పెంపకం, గొర్రెల పంపిణీ పథకం విజయవంతం అయ్యేందుకు శాస్ర్తియ విధానంలో ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పేర్కొన్నారు. జూన్ 20వ తేదీ నుండి నాలుగు వేల కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంభించనున్న గొర్రెల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి చర్చించేందుకు గురువారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు.

05/11/2017 - 23:38

హైదరాబాద్, మే 11: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం మెడికల్ పిజి కోర్సుల్లో కన్వీనర్, మేనేజిమెంట్ కోటా ఫీజులను పెంచుతూ జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే ఇచ్చింది. జస్టిస్ చల్లా కోదండరామ్, జస్టిస్ ఎన్ బాలయోగితో కూడిన వెకేషన్ బెంచి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జీవోను సవాలు చేస్తూ జారీ అయిన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు విచారించింది.

05/11/2017 - 23:36

న్యూఢిల్లీ, మే 11: సికింద్రాబాద్ కంటోనె్మంట్ పరిధిలోని (ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్) రోడ్డును మూసివేయవద్దని తెలంగాణ ఎంపీలు కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. గురువారం ఎంపీలు జితేందర్ రెడ్డి, వినోద్ కుమార్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మలు కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, జేపీ నడ్డాలతో సమావేశం అయ్యారు.

Pages