S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/14/2017 - 04:33

మెదక్ రూరల్, మే 13: అడవుల పెంపు నకు అటవీ ప్రాంతాల్లోని ఖాళీస్థలాల్లో మొక్కల పెంపకానికి సీడ్‌బాల్స్ వేయనున్నట్టు అటవీ శాఖ మంత్రి జోగు రామన్న వెల్లడించారు. త్వరలోనే తెలంగాణ పబ్లిక్ కమిషన్ ద్వారా 1305 క్షేత్రస్థాయి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వేయనున్నట్టు తెలిపారు. వన్యప్రాణులను వేటాడే వారిని ఉపేక్షించేదిలేదని, ఎంతటి వారైనా చర్య లు తప్పవని హెచ్చరించారు.

05/14/2017 - 04:31

హైదరాబాద్, మే 13: ఇందిరా పార్కు వద్ద ఉన్న ధర్నా చౌక్‌కు ఈ నెల 15న వెళ్ళేందుకు ప్రభుత్వం నిరాకరిస్తే మొత్తం జంట నగరాలను ఎక్కడికక్కడ ధర్నా చౌక్‌గా మార్చేయాలని టి.జెఎసి చైర్మన్ ఎం. కోదండరామ్ పిలుపునిచ్చారు.

05/14/2017 - 03:28

హైదరాబాద్, మే 13: త్వరలో జరిగే తెలంగాణ తొలి తెలుగు ప్రపంచ మహాసభలను గొప్పగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ సూచించారు. తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేయడంలో తెలంగాణ గొప్ప పాత్ర పోషించిందని, అదంతా మహాసభల్లో ప్రతిబింబించాలని అన్నారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనం ప్రజలకు అందే విధంగా రచనలు చేసి చైతన్య పరచాలని కవులు, దర్శకులు, రచయితలను ముఖ్యమంత్రి కోరారు.

05/14/2017 - 03:26

హైదరాబాద్, మే 13: అభివృద్ధి చెందుతున్న దేశాల్లో శరవేగంగా చోటు చేసుకుంటున్న పట్టణాభివృద్ధి నేపథ్యంలో జీవించే హక్కు, గౌరవాన్ని పరిరక్షించేవిధంగా పట్టణ ప్రణాళిక వ్యూహాలకు కొత్త రూపం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఐక్య రాజ్య సమితి (ఐరాస) ఆవాస అధిపతిగా ఇటీవల నియమితులైన కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

05/14/2017 - 02:53

హైదరాబాద్, మే 13: దక్షిణ మధ్య రైల్వేలో కొనసాగుతున్న పనులపై జనరల్ మేనేజర్ వినోద్‌కమార్ యాదవ్ రైల్వే అధికారులతో సమీక్షించారు. శనివారం రైల్ నిలయంలో జరిగిన సమావేశంలో ముఖ్య పరిపాలనాధికారి ఆర్‌సి భూల్‌చందాని పాల్గొన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని జిఎం వినోద్‌కుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు.

05/14/2017 - 02:51

హైదరాబాద్, మే 13: అసెంబ్లీలో సిఎం కెసిఆర్ ఇచ్చిన హామీ మేరకు బిసి కార్పొరేషన్, 10 బిసి ఫెడరేషన్లకు నిధులు కేటాయించాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. గత మూడేళ్లగా బిసి కులాలు తమ వృత్తుల కోసం ఫెడరేషన్లకు దాదాపు లక్షా 60 వేల మంది చేసుకున్న దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని అన్నారు. కృష్ణయ్య సిఎం కెసిఆర్‌కు శనివారం లేఖ రాశారు.

05/14/2017 - 02:48

హైదరాబాద్, మే 13: ధర్నాలను చేసే ప్రజాస్వామిక హక్కును ఎవరూ కాలరాయలేరని మాజీ డిజిపి, బిజెపి నేత వి దినేష్‌రెడ్డి పేర్కొన్నారు. ధర్నాలు, ఉద్యమాలు చేసి అధికారంలోకి వచ్చిన పార్టీ ధర్నా చౌక్‌ను తొలగిస్తామని అనడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు.

05/14/2017 - 02:47

హైదరాబాద్, మే 13: తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల్లో డిగ్రీలో చేరేందుకు మహిళలకు నిర్వహించిన ప్రవేశ పరీక్షల ఫలితాలను పోర్టల్‌లో ఉంచినట్లు సొసైటీ కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ తెలిపారు. అభ్యర్థులు తమ ఫలితాలను సొసైటీ అధికారిక పోర్టల్‌ను సందర్శించి తెలుసుకోవచ్చని సూచించారు.

05/14/2017 - 02:46

ఘట్‌కేసర్, మే 13: సురక్షితంగా గమ్యస్థానికి చేర్చాల్సిన ఓ క్యాబ్ డ్రైవర్.. యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడిన సంఘటన మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధి నారపల్లిలో శుక్రవారం రాత్రి జరిగింది. నగరంలోని సీతాఫల్‌మండిలో నివాసం ఉంటున్న పబ్ డ్యాన్సర్ కల్పన (20) శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల సమీపంలో ఉప్పల్ వెళ్లాల్సి ఉండగా పరిచయం ఉన్న రవి అనే క్యాబ్ డ్రైవర్‌కు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.

05/14/2017 - 02:43

హైదరాబాద్, మే 13: రాష్ట్రంలో ప్రైవేటు వడ్డీ వ్యాపారులదే ‘హవా’ నడుస్తున్నది. ప్రజలు తమ ఆర్థికపరమైన కష్టాల నుంచి గట్టెక్కేందుకు బ్యాంకులపై ఆధారపడకుండా, ప్రైవేటు వడ్డీ వ్యాపారులనే ఆశ్రయిస్తున్నారు. అందుకు కారణం తెలంగాణలో బ్యాంకుల వంటి వ్యవస్థాగతమైన సంస్థల ద్వారా రుణ సౌకర్యం తక్కువగా ఉండడమేనని తెలంగాణ సామాజిక అభివృద్ధి నివేదికలో వెల్లడైన వాస్తవం.

Pages