S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/11/2017 - 23:35

హైదరాబాద్, మే 11: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన సుందిళ్ల బ్యారేజీ దిగువన గోలివాడ గ్రామంలో భూసేకరణకు లైన్ క్లియర్ చేస్తూ సింగిల్ జడ్జి కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు వెకేషన్ కోర్టు నిరాకరించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్, జస్టిస్ ఎన్ బాలయోగితో కూడిన ధర్మాసనం రైతులు దాఖలు చేసిన పిటిషన్లను విచారించింది.

05/11/2017 - 23:35

హైదరాబాద్, మే 11: రాష్ట్ర విభజన సమస్యలను గవర్నర్ సమక్షంలో పరిష్కరించుకోవడానికి ఇరు రాష్ట్రాల మంత్రులతో ఏర్పాటు చేసిన కమిటీ ప్రయత్నం వృథా ప్రయాసగా మారింది. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ పదవీకాలం ముగిసినా ఇంతవరకు మంత్రుల కమిటీ ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేకపోయింది. ఇప్పటి వరకు గవర్నర్ సమక్షంలో మంత్రుల కమిటీ నాలుగు సార్లు సమావేశమైనా ఏ సమస్యను కొలిక్కి తీసుకురాలేకపోయింది.

05/11/2017 - 23:34

హైదరాబాద్, మే 11: పరీక్షలు నిర్వహించే బోర్డులు పుస్తకాలను ముద్రించే పనిలో ఉండటం వల్ల సరికొత్త సమస్యలు వస్తున్నాయని, ఏదో ఒక పనిని మాత్రమే చేసుకోవాలని కేంద్రప్రభుత్వం పరీక్షల బోర్డులను ఆదేశించింది. ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ పుస్తకాలను ముద్రించడం, ఇంటర్ పరీక్షలను నిర్వహించడం మరో పక్క ఇంటర్ జూనియర్ కాలేజీల అనుబంధ గుర్తింపును ఇవ్వడం వంటి విశేష కార్యకలాపాలను నిర్వహిస్తోంది.

05/11/2017 - 23:33

హైదరాబాద్, మే 11: విశ్వవిద్యాలయాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి నియమితులయ్యేందుకు అర్హతగా నిర్ధారించే రాష్టస్థ్రాయి అర్హత పరీక్ష (సెట్) ఈ ఏడాది విద్యార్థులకు శాపంగా మారనుంది. గతంలో విరివిగా అభ్యర్థులను అర్హులుగా గుర్తించిన ‘సెట్’లో ఈ ఏడాది నుండి కొత్తగా అమలులోకి వస్తున్న నిబంధనలతో అర్హత సాధించడం కష్టసాధ్యమే.

05/11/2017 - 04:38

హుజూర్‌నగర్, మే 10 : రాష్ట్రంలో మిర్చి రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని, దీనికి ముఖ్యమంత్రి కెసిఆర్ కారణమని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఆరోపిం చారు. పత్తి వద్దు మిర్చి వేసుకోండి, కందులు వేసుకోండనే సలహాల వల్లనే 7 లక్షల క్వింటాళ్ల మిర్చి వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ మార్కెట్‌లలో రైతులు ఆందోళన చేశారని అన్నారు.

05/11/2017 - 04:35

మునుగోడు, మే 10: తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే కార్యకర్తలు ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వ తీరును ఎండగట్టాలని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని రత్తిపల్లి, క్రిష్టాపురం గ్రామంలో ఎంపి కోటా నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.

05/11/2017 - 04:33

ఆదిలాబాద్, మే 10: తెలంగాణ ప్రభుత్వం జడ్పీటిసిలకు నిధులు, అధికారాలు కల్పించకుండా ఉత్సవ విగ్రహాలుగా మార్చివేసిందని, మం త్రుల పక్కన ఫొటోలకు ఫోజులివ్వడం తప్పా అభివృద్ది పనుల్లో తమకు ఏమాత్రం గౌరవం దక్కడం లేదని జడ్పీటిసిలు నిరసన వ్యక్తం చేశారు. జిల్లాల పునర్విభజన అనంతరం మంచిర్యాల జిల్లా కేంద్రంలో తొలిసారిగా జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశానికి చైర్‌పర్సన్ వల్లకొండ శోభారాణి అధ్యక్షత వహించారు.

05/11/2017 - 04:06

హైదరాబాద్, మే 10: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూలు, సూర్యాపేట, ఆదిలాబాద్, మహబూబాబాద్, నల్లగొండ, వికారాబాద్, మేడ్చల్ (మల్కాజిగిరి) తదితర జిల్లాల్లో మంగళవారం అర్ధ రాత్రి పెనుగాలులు, భారీ వర్షం తీవ్రమైన బీభత్సాన్ని సృష్టించాయి. మంగళవారం రాత్రి సుమారు 11 గంటలకు హఠాత్తుగా ప్రారంభమైన ఈదురు గాలులు, భారీ వర్షం సుమారు రెండు గంటల పాటు కొనసాగాయి.

05/11/2017 - 04:01

చిత్రాలు.. కారులోంచి మృతదేహాలను వెలికితీస్తున్న దృశ్యం * రోదిస్తున్న రాజారవివర్మ కుటుంబసభ్యులు.

05/11/2017 - 03:50

హైదరాబాద్, మే 10: తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో 1061 పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. రాష్ట్రంలో వర్శిటీల అభివృద్ధికి 420 కోట్లు కేటాయించామని, వాటితో విద్యార్థులు, సిబ్బందికి వసతులు, ల్యాబ్‌లు నిర్మిస్తామని, మరమ్మతుల కోసం ఆ నిధులను వినియోగించిన తర్వాత మిగిలితే కొత్త భవనాలకు ఖర్చు చేస్తామని పేర్కొన్నారు.

Pages