S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/26/2017 - 02:05

హైదరాబాద్, ఫిబ్రవరి 25: కాంగ్రెస్ పార్టీ ఒక దొంగల ముఠా అని ప్రజలకు ఆ పార్టీ సంగతి తెలుసు కాబట్టే తగిన బుద్ధి చెప్పారని, ఉద్యమ కాలంలో బి ఫారమ్‌ల కోసం , మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ నాయకులు ఆంధ్ర నాయకుల ముందు మోకరిల్లారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో శనివారం జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

02/26/2017 - 02:05

హైదరాబాద్, ఫిబ్రవరి 25: తెలంగాణలో ఇద్దరు ఐపిఎస్ అధికారులు బదిలీ అయ్యారు. అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న చారుసిన్హా పోలీస్ ట్రైనింగ్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ జనరల్‌గా బదిలీ అయ్యారు. పోలీస్ ట్రైనింగ్ ఐజిగా పనిచేస్తున్న శ్రీనివాస్‌రెడ్డి గ్రేహౌండ్స్ ఐజిగా బదిలీ అయ్యారు.

02/26/2017 - 02:03

హైదరాబాద్, ఫిబ్రవరి 25: ఉస్మానియా వర్శిటీ పోలీసులపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు విద్యార్థి జెఎసి శనివారం ఫిర్యాదు చేసింది. 22న నిరుద్యోగ ర్యాలీని పురస్కరించుకొని తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అక్రమ అరెస్టు తీరుపై ఓయూ విద్యార్థి జెఎసి ఫిర్యాదు చేసింది.

02/25/2017 - 04:51

హైదరాబాద్, ఫిబ్రవరి 24: శివరాత్రి పర్వదినం సందర్భంగా శుక్రవారం తెల్లవారుజాము నుంచే ‘హోరోం హర...ఓం నమశ్శివాయ’ అని భక్తుల నినాదాలతో రాష్ట్రంలోని శివాలయాలు మార్మోగాయి. ప్రాశస్త్యమైన కీసర గుట్ట, వేములవాడ రాజన్న, హన్మకొండలోని వేయి స్తంభాల గుడి, కాళేశ్వరం, జోగులాంభ, ఏడు పాయల దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. ఇంకా యాదాద్రి, సంస్థాన్ నారాయణపురం, రాష్ట్రంలోని వివిధ విశ్వనాథ ఆలయాలు కిటకిటలాడాయి.

02/25/2017 - 04:50

పాపన్నపేట, ఫిబ్రవరి 24: రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ఏడుపాయల వనదుర్గామాత ఆలయాన్ని అద్భుత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేం దుకు కృషి చేస్తున్నట్లు భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా శుక్రవారం ఏడుపాయల జాతరకు హాజరై ఉత్సవాలను ప్రారంభించారు.

02/25/2017 - 04:02

మహబూబాబాద్, ఫిబ్రవరి 24: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన మొక్కు తీర్చుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ప్రభుత్వం తరఫున కురవి వీరభద్రస్వామికి బంగారు కోర మీసాలు చేయిస్తానని మొక్కుకున్నారు. స్వామి దయతోనే రాష్ట్రం సిద్ధించిందని పేర్కొంటూ..

02/25/2017 - 03:57

హైదరాబాద్, ఫిబ్రవరి 24: వచ్చే వేసవి కాలంలో ప్రజలను వడగాడ్పుల తీవ్రతపై అప్రమత్తం చేసేందుకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించింది. సమాచార టెక్నాలజీ విభాగం డిజాస్టర్ మేనేజిమెంట్ పోర్టల్‌ను ఇప్పటికే ప్రారంభించింది. దీని ద్వారా గ్లోబల్ ఫోర్‌కేస్టింగ్ సిస్టమ్‌ను ఉపయోగించి వేడి గాలుల తీవ్రతను పసిగట్టి ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తుంది.

02/25/2017 - 03:56

హైదరాబాద్, ఫిబ్రవరి 24: తెలంగాణ బౌద్ధ చరిత్రను వెలుగులోకి తీసుకు వస్తామని, దీనిలో భాగంగానే బుద్ధవనం ప్రాజెక్టును ప్రపంచ దేశాలు గర్వించే స్థాయిలో అభివృద్ధి పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని యువజన, పర్యాటక శాఖ కార్యదర్శి డి వెంకటేశం తెలిపారు.

02/25/2017 - 03:54

హైదరాబాద్, ఫిబ్రవరి 24: చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని ఇరు రాష్ట్రాల పాలకులు భావిస్తున్నారు. గవర్నర్ సమక్షంలో ఇరు రాష్ట్రాల మంత్రుల మూడవ సమావేశం ఆదివారం జరుగుతుంది. ఇప్పటికే గవర్నర్ సమక్షంలో రెండు సార్లు సమావేశం అయ్యారు. ఇరు రాష్ట్రాల మంత్రుల సమావేశం అనంతరం గవర్నర్ నరసింహన్ విజయవాడ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించారు.

02/25/2017 - 03:54

హైదరాబాద్, ఫిబ్రవరి 24: తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా జరుగుతున్న పాలన పట్ల విసుగెత్తిపోయారని మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కాంగ్రెస్ నేతలు సమష్టిగా పోరాడితే కెసిఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించవచ్చన్న భావన సామాన్య ప్రజల్లో వ్యక్తమవుతోందని అన్నారు. తెలంగాణ సాధించిన లక్ష్యాన్ని నీరుగార్చారని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు.

Pages