S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/09/2016 - 04:47

హైదరాబాద్, డిసెంబర్ 8: ‘రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేకుండా బాధపడకూడదన్నది నా అభిమతం. అందుకే నిబంధనల ప్రకారం సాధ్యం కాదంటున్నా మానవతా దృక్పథంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను దశల వారీగా క్రమబద్ధీకరించాలని నిర్ణయించాం’ వారం రోజుల కిందట విద్యుత్‌శాఖ ఉద్యోగుల సమ్మె నోటీసుపై స్పంది స్తూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటన ఇది. ‘ఒకే పని చేసే ఉద్యోగులకు ఒకేరకంగా వేతనం ఉండాలి.

12/09/2016 - 04:46

హైదరాబాద్, డిసెంబర్ 8: కేంద్రప్రభుత్వ పథకం కింద నడుస్తున్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల టీచర్ల సర్వీసులను రెగ్యులరైజ్ చేసేందుకు అన్ని ప్రయత్నాలు ప్రారంభించామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కలిసి కోరామని పేర్కొన్నారు.

12/09/2016 - 02:31

చిత్రాలు..గురువారం రాత్రి హైదరాబాద్ నానక్‌రాంగూడలో ఏడంతస్తుల భవనం కూలిపోయన ప్రాంతంలో గుమిగూడిన జనం. స్థానికులను వివరాలు అడిగి తెలుసుకుంటున్న మంత్రి పద్మారావు. పేకమేడలా కూలిన భవంతి శిథిలాలు

12/09/2016 - 02:22

హైదరాబాద్, డిసెంబర్ 8: తపాలా కార్యాలయాల ద్వారా నోట్ల మార్పిడిలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తపాలా అధికారి సుధీర్‌బాబు గురువారం సిబిఐ ఎదుట లొంగిపోయారు. సుధీర్‌బాబుపై సిబిఐ మూడు కేసులు నమోదు చేసింది. హిమయత్‌నగర్, గోల్కొండ, కార్వాన్ తపాలా కార్యాలయాల్లో రూ.2.95 కోట్లు అక్రమాలు జరిగినట్లు సిబిఐ అధికారులు అభియోగాలు నమోదు చేశారు.

12/09/2016 - 02:21

హైదరాబాద్, డిసెంబర్ 8: తెలంగాణ రాష్ట్రంలో వాహనాల కాలుష్యం పరీక్షల ఫీజులను పెంచారు. ఇరవై సంవత్సరాల క్రితం నిర్ణయించిన ధరలపై 100 శాతం ఫీజు పెంచారు. పెంచిన ఫీజు శుక్రవారం నుండి అమల్లోకి వస్తుంది. ద్విచక్ర వాహనాలకు కాలుష్య పరీక్షకు ప్రస్తుతం 15 రూపాయలు ఫీజు వసూలు చేస్తుండగా దీన్ని 30 రూపాయలకు పెంచారు.

12/08/2016 - 07:25

హైదరాబాద్, డిసెంబర్ 7: పంచాయతీరాజ్ శాఖలో జనవరి 10 నుండి నగదు రహితలావాదేవీలు కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ అంశంలో బ్యాంకర్లు, పోస్టల్ సిబ్బంది సహకారం అందించాలని పంచాయితీ, గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. నగదు రహిత లావాదేవీలు చేపట్టే అంశంలో కూలంకషంగా చర్చించేందుకు బ్యాంకర్లు, పోస్టల్ అధికారులతో సచివాలయంలో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

12/08/2016 - 07:22

హైదరాబాద్/వనస్థలిపురం, డిసెంబర్ 7: వైద్యుడు దేవుడితో సమానమంటారు..చేతులెత్తి మొక్కుతారు. అలాంటి వైద్యులే కార్పొరేట్ ఆసుపత్రుల్లో రోగుల పాలిట యమదూతల్లా వ్యవహరిస్తున్నారు. అలాంటి ఓ దారుణ ఘటన నగరంలోని ఎల్బీనగర్‌లోగల కామినేని ఆసుపత్రిలో చోటుచేసుకుంది. పది రోజుల క్రితం స్వాతి అనే గర్భిణిని ప్రసవం కోసం ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువచ్చారు. సిజేరియన్ ద్వారా వైద్యులు ప్రసవం చేశారు.

12/08/2016 - 07:19

వరంగల్, డిసెంబర్ 7: దేశంలో నల్లధనాన్ని వెలికితీయడానికి కేంద్రం తాజాగా చేపట్టిన పెద్దనోట్ల రద్దు కార్యక్రమం కేవలం ప్రారంభమేనని, దశాబ్దాలుగా అక్రమంగా దాచుకున్న నల్లధనాన్ని బయటకు తీసుకురావటానికి కేంద్రం భవిష్యత్తులో అనేక రకాల చర్యలు తీసుకుంటుందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు తెలిపారు.

12/08/2016 - 07:19

మహబూబ్‌నగర్, డిసెంబర్ 7: రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని బాధ్యత గల రాజకీయ పార్టీగా.. రైతు గొంతుకగా నిలుస్తామని.. అసెంబ్లీ శీతకాల సమావేశాలు ఎప్పుడు నిర్వహించినా అప్పుడు రైతుల సమస్యలపై అసెంబ్లీని స్తంభింపజేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ హెచ్చరించారు. మహబూబ్‌నగర్‌లో బుధవారం బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహాధర్నా నిర్వహించారు.

12/08/2016 - 07:17

సంగారెడ్డి టౌన్, డిసెంబర్ 7: పేద విద్యార్థులకు కడుపునిండా అన్నం పెట్టాలనే ఉద్దేశ్యంతో అక్షయపాత్ర ఫౌండేషన్ ముందుకు రావడం అభినందనీయమని సాగునీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. మండల కేంద్రమైన కంది శివారులో నిర్మించనున్న అక్షయపాత్ర భోజన శాల తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి హై-టెక్ భోజనశాలగా నిలిచిపోతుందన్నారు.

Pages