S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/24/2016 - 12:51

సికింద్రాబాద్: సికింద్రాబాద్‌లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఆదివారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిఎం కెసిఆర్ దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి పూజల్లో పాల్గొన్నారు. మంత్రులు తలసాని, ఇంద్రకరణ్ రెడ్డి, నాయిని నరసింహారెడ్డి, జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దనరెడ్డి తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.

07/24/2016 - 12:51

హైదరాబాద్: మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్-2 ప్రవేశపరీక్ష ఆదివారం ఉదయం ప్రారంభమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖ కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ జరిగే పరీక్ష కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌లో 23వేల మంది, విజయవాడ,విశాఖల్లో 20 వేల మంది అభ్యర్థులు నీట్-2కు దరఖాస్తు చేశారు.

07/24/2016 - 04:23

ఆదివారం జరిగే సికింద్రాబాద్ ఉజ్జయని మహంకాళి బోనాల జాతరకు
ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ఆహ్వానిస్తున్న ఆలయ అర్చకులు

,
07/24/2016 - 04:07

పటన్‌చెరు, జూలై 23: పటన్‌చెరు మండలం అమీన్‌పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని అక్రమ లేఅవుట్లపై హెచ్‌ఎండిఏ అధికారులు ఉక్కుపాదం మోపారు. శనివారం పోలీసు బందోబస్త్తు మధ్య దాదాపు ఎనిమిది వెంచర్లపై దాడిచేశారు. హెచ్‌ఎండిఏ డిప్యూటీ కలెక్టర్ రాజేషం నేతృత్వంలో పలువురు హుడా అధికారులు అనుమతి లేని లేఅవుట్లపై విరుచుకుపడ్డారు. వాటికి సంబంధించిన ప్రహరీగోడలను, కమాన్‌లను కూలదోసి, స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.

07/24/2016 - 04:02

నక్కలగుట్ట (వరంగల్), జూలై 23: తెలంగాణ సాహితీ దిగ్గజం, తెలుగు సాహిత్యంలో విశేషకృషి చేసిన కోవెల సుప్రసన్నాచార్యులు ఆశీతి మహోత్సవాన్ని పురస్కరించుకుని ‘సన్నుతి’ అభినందన సం చికను ఆదివారం వరంగల్‌లో ఆవిష్కరిస్తున్నట్లు అభినందన సమితి సభ్యులు గన్నమరాజు గిరిజామనోహర్‌బాబు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ నగరానికి కీర్తి తెచ్చిన మహానుభావుడు కోవెల అని కొనియాడారు.

07/24/2016 - 03:59

సంగారెడ్డి, జూలై 23: పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి కరుణ, కరవు నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంపై అధికారులు ఎవరు నిర్లక్ష్యం వహించినా సహించేది లేదంటూ భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు మరోమారు ఫైర్ అయ్యారు.

07/24/2016 - 03:56

హైదరాబాద్, జూలై 23: నిజాం నవాబు పాలనలో అభివృద్ధికి అగ్రపీఠం వేశారని తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నార్సింహరెడ్డి అన్నారు. నిజాముల పరిపాలనలో రోడ్లు, డ్రైనేజి వ్యవస్థ, మంచినీటి చెరువులు, విద్యుత్, విమానయానం, రైల్వే, బస్సుల రవాణా, విద్య, ఆరోగ్యాలకు ప్రాధాన్యత ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.

07/24/2016 - 03:53

గోదావరిఖని, జూలై 23: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కరీంనగర్ జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిండుకుండలా కనిపిస్తోంది. ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు చేరుకోవడం జలకళ సంతరించుకుంది. గత ఏడాది వర్షాకాలంలో కూడా ప్రాజెక్ట్‌లో ఇంత పెద్ద మొత్తంలో నీరు నిల్వ కాలేదు.

07/24/2016 - 03:49

పరకాల, జూలై 23: కాన్పు కోసం పరకాల ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే పసికందును కాటేసిన సంఘటన శనివారం వరంగల్ జిల్లా పరకాల ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆసుపత్రి ఎదుట ధర్నా, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడంతో ఉద్రిక్తత నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి.

07/24/2016 - 03:40

హైదరాబాద్, జూలై 23: మల్లన్న సాగర్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో బహిరంగ చర్చకు సిద్ధం అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, గోదావరి నదీ జలాల వినియోగ ఫోరం కన్వీనర్ మర్రి శశిధర్ రెడ్డి సవాల్ విసిరారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ అనవసరమని గవర్నర్‌ను కలిసి కోరనున్నట్లు ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో తెలిపారు.

Pages