S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/20/2016 - 07:28

హైదరాబాద్, జూన్ 19:మల్లన్న సాగర్ ప్రాజెక్టు అధికార పక్షం, విపక్షం ఇద్దరికీ ఒకే ఆయుధం. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నాలుగు గ్రామాలకు సమస్య అయితే మూడు జిల్లాల్లో 20లక్షల ఎకరాలకు ప్రయోజనం కలిగించే అంశం. దీంతో అటు విపక్షాలు, ఇటు అధికార పక్షం తమ తమ రాజకీయ కోణాల్లో ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకు వెళుతూ ఆందోళనలు సాగిస్తున్నాయి.

06/20/2016 - 07:03

హైదరాబాద్, జూన్ 19: హైదరాబాద్‌లోని బేగంపేటలో గల ఆక్టోపస్ ప్రధాన కార్యాలయం ఆవరణలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శివకుమార్ (25) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీస్ 13వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ శివకుమార్ ఆదివారం సెంట్రీ డ్యూటీలో ఉన్నాడు. తన సర్వీసు తుపాకి 9ఎంఎంతో కంఠం కింద కాల్చుకొని కుప్పకూలి పోయాడు.

06/20/2016 - 06:59

హైదరాబాద్, జూన్ 19: సేద్యంలో యాజమాన్యం, నిర్వహణ సక్రమంగా, ప్రణాళికాబద్ధంగా ఉంటే కొద్దిపాటి భూమిలో కూడా మంచి పంటలు పండించి, కుటుంబపోషణకు అవసరమైన డబ్బు సంపాదించవచ్చని నిరూపించాడు సత్యారెడ్డి అనే ఒక సామాన్యరైతు. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలంలోని అల్మాస్‌గుడాకు చెందిన రామిడి సత్తిరెడ్డి (85) అనేక దశాబ్దాలుగా సేద్యం చేస్తున్నాడు. ఈ రైతుకు ఉన్న పొలం కేవలం అర ఎకరమే.

06/20/2016 - 06:58

హైదరాబాద్, జూన్ 19: తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఈ అంశంపై సంబంధిత నిపుణులతో చర్చలు జరుపుతున్నారని తెలిసింది. కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, నియమావళిని రూపొందించడం, సమర్థవంతంతగా నిర్వహించడం తదితర అంశాలపై ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

06/20/2016 - 04:44

మంజూరైన డబుల్ బెడ్‌రూంలు 2.65 లక్షలు టెండర్లు ఖరారైనది 5.6 వేల ఇళ్లకే
రేటుపై వెనక్కి తగ్గుతున్న కాంట్రాక్టర్లు స్థానికులకు అవకాశమివ్వనున్న సర్కారు
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం బాలారిష్టాల నుంచి ఇప్పటికీ బయటపడలేకపోతోంది. హైదరాబాద్‌లో ఐడిహెచ్ కాలనీ, సిఎం దత్తత గ్రామాలు నర్సన్నపేట, ఎర్రవెల్లిలో మాడల్ ఇళ్లు తప్ప రాష్ట్రంలో
మరెక్కడా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు

06/20/2016 - 04:43

హైదరాబాద్, జూన్ 19: 46 గనులు, 63 విభాగాలు, 25 కాలనీలు, 12 స్టేడియాల్లో ఈనెల 21న ఒకేసారి వేలాది మంది యోగా చేయనున్నారు. కొన్ని వేలమంది కార్మికులు ఒకేసారి యోగా చేయడం దేశంలో ఇదే మొదటిసారి అని సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం కావడంతో ఈ సందర్భంగా చరిత్రలో నిలిచిపోయేలా వేలాదిమందితో యోగా చేయాలని సింగరేణి నిర్ణయించింది.

06/20/2016 - 04:43

హైదరాబాద్, జూన్ 19: రికార్డుస్థాయిలో రాష్ట్ర ఆదాయ వృద్ధి పెరగడానికి కారణమైన ఎక్సైజ్ శాఖ నుంచి మరిన్ని నిధులు రాబట్టాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఇందులో భాగంగా నెలాఖరుతో ముగియనున్న బార్ షాపుల లైసెన్స్‌ల స్థానే జూలైలో జారీ చేయనున్న కొత్త లైసెన్స్ ఫీజులను భారీగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

06/20/2016 - 04:41

హైదరాబాద్/ కొడిమ్యాల, జూన్ 19: 24 గంటల్లో ఆపరేషన్ పైప్‌లైన్ నిర్వహించి శెభాష్ అనిపించుకున్నారు అధికారులు. యుద్ధప్రాతిపదికన రైల్వే లైన్ తొలగించి పైప్‌లైన్ నిర్మించడమే కాకుండా, 24 గంటలు తిరగకుండానే ట్రాక్‌ను పునరుద్ధరించే ఆపరేషన్‌ను విజయవంతం చేశారు.

06/20/2016 - 04:40

ఆదిలాబాద్, జూన్ 19: ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులోని మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. తెలంగాణ గ్రేహౌండ్స్ దళాల ఆపరేషన్‌తో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది.

06/20/2016 - 04:39

సికింద్రాబాద్, జూన్ 19: తెలంగాణలో తెరాసను ఎదుర్కొనే సత్తా బిజెపికి మాత్రమే ఉందని ఆ పార్టీ కార్యవర్గ సమావేశం అభిప్రాయపడింది. తెరాస పాలనలో పారదర్శకత లేదని తీవ్రస్థాయిలో మండిపడింది.

Pages