S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/19/2016 - 08:47

అమ్రాబాద్, జూన్ 18: విభిన్న మతాలకు నిలమైన భారతదేశంలో దైవశక్తితోనే ఐక్యంగా ఉండడంతో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని త్రిదండి రామానుజుల చినజీయర్‌స్వామి అన్నారు.

06/19/2016 - 08:44

హైదరాబాద్/జీడిమెట్ల, జూన్ 18: ఇద్దరూ ఆడ పిల్లలే.. పోషించలేమోనన్న భయంతో వారి తల్లితండ్రులు ఒక శిశువును విక్రయించినట్లు సమాచారం అందడంతో సమగ్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి లావణ్యరెడ్డి, మేడ్చల్ ఐసిడిఎస్ సూపర్‌వైజర్ స్పందన ప్రాథమిక విచారణను చేపట్టారు. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం, దుండిగల్ తండా-1లో నివాసముండే నర్సింగ్ నాయక్‌కు ఇద్దరు కొడుకులు, ఓ కుమార్తె సంతానం.

06/19/2016 - 08:42

తొగుట, జూన్ 18: మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూసే కరణ తీరును నిరసిస్త్తూ ఆందోళన చేస్తున్న భూ నిర్వాసితులకు వ్యతిరేకంగా ప్రభుత్వం కావాలనే వివిధ జిల్లాల్లో ప్రాజెక్టుకు మద్దతుగా ఆందోళన చేయించడం ఎంతవరకు సమంజసమని భూనిర్వాసిత గ్రామాల ప్రజాప్రతినిధులు ప్రశ్నించారు.

06/19/2016 - 08:40

షాద్‌నగర్, జూన్ 18: స్కూల్ బస్సు కిందపడి చిన్నారి బాలిక మృతి చెందింది. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మండలం నాగులపల్లి రోడ్డులోని ఈద్గా వద్ద శనివారం ఉదయం జరిగింది. కాలనీవాసుల కథనం ప్రకారం.. పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌కు చెందిన బస్సు రోజూ మాదిరిగానే పిల్లలను ఎక్కించుకొని పాఠశాలకు తీసుకువెళ్లేందుకు వచ్చింది.

06/19/2016 - 08:32

హైదరాబాద్, జూన్ 18: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కళ్లు తెరవాలని, కేంద్రం అందజేస్తున్న సాయాన్ని అర్ధం చేసుకోవాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఇష్టారాజ్యంగా తెలంగాణలో పాలన సాగుతోందని, కేంద్రం ఇచ్చిన నిధులను ఖర్చుచేయలేకపోతున్న ప్రభుత్వానికి నిధులు ఇంకా ఇవ్వమని అడిగే హక్కు లేదని అన్నారు.

06/19/2016 - 08:31

హైదరాబాద్, జూన్ 18: తెలంగాణ ప్రభుత్వంపై రిజర్వేషన్ల అస్త్రం ప్రయోగించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. అదే సమయంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు సత్వర నిర్ణయాలు తీసుకోనుంది. జిల్లా, నియోజకవర్గ నేతలలో పోరాట స్ఫూర్తి కొనసాగించేందుకు హైదరాబాద్, వరంగల్‌లో శిక్షణ శిబిరాలు నిర్వహించనుంది.

06/19/2016 - 08:30

హైదరాబాద్, జూన్ 18: రవాణాశాఖను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి పరుస్తూ, రోడ్డు భద్రతకు ప్రాధాన్యత కల్పిస్తుందని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పి మహేందర్‌రెడ్డి అన్నారు. రూ. 25 కోట్లతో రవాణాశాఖకు చెందిన కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించనున్నట్టు ఆయన తెలిపారు. శనివారం మనే్నగూడ డ్రైవింగ్ ట్రాక్‌ను ఆయన ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, రవాణాశాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియాలతో కలసి ప్రారంభించారు.

06/19/2016 - 08:26

హైదరాబాద్, జూన్ 18: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాల్లో లబ్దిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం తగదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకరెడ్డి అన్నారు. సంక్షేమ పథకాల అమలులో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోయిందని ఆయన శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆరోపించారు. ప్రభుత్వమే పథకాల విధివిధానాలు రూపొందించాలని, వీటిని అధికారులు అమలు చేయాలని సూచించారు.

06/19/2016 - 08:25

న్యూఢిల్లీ,జూన్ 18: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు రెండేళ్ల పాలనలో మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని సి.పి.ఎం తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. వీరభద్రం శనివారం విలేకరులతో మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం రెండేళ్ల పాలన, తెలంగాణా రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై పార్టీ కేంద్రకమిటీ సమావేశంలో చర్చిస్తున్నామన్నారు.

06/19/2016 - 08:24

హైదరాబాద్, జూన్ 18: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ‘సబ్‌కా సాథ్..సబ్‌కా వికాస్’ అంటూ ప్రజలను మభ్యపెడుతోందని, ఇది వట్టి బూటకమని ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. కేంద్ర సర్కార్ ఎవరికీ చేయూతనివ్వలేదని..ఏ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదని విమర్శించారు. అభివృద్ధి ముసుగులో పాలకులు కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.

Pages