S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/24/2016 - 18:15

హైదరాబాద్: బ్యాంకుల నుంచి భారీ మొత్తాల్లో రుణాలు తీసుకుని ఎగ్గొట్టినట్లు తన కుమారుడు కల్యాణ శ్రీనివాస్‌పై సిబిఐ పెట్టిన కేసులో వాస్తవాలు లేవని సిబిఐ మాజీ డైరెక్టర్, తెరాస నేత విజయరామారావు బుధవారం ఇక్కడ మీడియాతో అన్నారు. కావాలని కేసులో ఇరికించారే తప్ప తన కుమారుడు నిర్దోషి అని అన్నారు. సరైన సమయంలో దోషుల పేర్లను బయటపెడతానని ఆయన స్పష్టం చేశారు.

02/24/2016 - 18:13

మహబూబ్‌నగర్: ఉపాధి హామీ పథకం కింద పనులు చేసిన తమకు రెండు నెలలుగా డబ్బులు చెల్లించలేదని ఆగ్రహించిన కూలీలు కొడంగల్ ఎంపిడిఓ వీరబ్రహ్మచారిపై బుధవారం దాడి చేశారు. నర్సాపూర్ గ్రామానికి చెందిన కూలీలు ఒక్కసారిగా మండల పరిషత్ ఆఫీసుపైకి విరుచుకుపడి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఎంపిడీఓను నిలదీసి ఆయనపై దాడి చేశారు.

02/24/2016 - 18:12

నిజామాబాద్: జక్రాన్‌పల్లి వద్ద జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం ఓ కారు అదుపుతప్పి బోల్తాపడి దంపతులు మరణించారు. మృతులను డిచ్‌పల్లి మండలం గన్నారం గ్రామానికి చెందిన రవి,రమ్యలుగా బంధువులు గుర్తించారని పోలీసులు తెలిపారు.

02/24/2016 - 15:47

హైదరాబాద్: తెలంగాణలో వచ్చే మే2న ఎంసెట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఈ నెల 28 నుంచి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 24 నుంచి హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తొలిసారిగా అభ్యర్థులకు ఓఎంఆర్ కాపీలను అందజేస్తారు. మే2న ఎంట్రెన్స్ నిర్వహించి అదే నెల 12న ఫలితాలు విడుదల చేస్తారు.

02/24/2016 - 13:37

నల్గొండ: చోరీ కేసుకు సంబంధించి పోలీసులు తనను వేధిస్తున్నారని మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించిన ఘటన నల్గొండ జిల్లా తుంగతుర్తి పోలీస్ స్టేషన్ ఎదుట బుధవారం జరిగింది. పురుగుల మందు తాగిన ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటున్నారు.

02/24/2016 - 13:36

కరీంనగర్: కరీంనగర్ జిల్లా పెద్దపల్లి తెరాస ఎంపీ బాల్కసుమన్ సోదరి వివాహానికి హాజరయ్యేందుకు తెలంగాణ సిఎం కెసిఆర్ బుధవారం మెట్‌పల్లి వచ్చారు. వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు అందజేశారు.

02/24/2016 - 12:03

కరీంనగర్: తెలంగాణ సి.ఎం. కెసిఆర్‌ను చంపేస్తామంటూ కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగరరావుకు ఓ ఆగంతకుడి నుంచి బెదిరింపు ఫోన్‌కాల్ రావడంతో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం రాత్రి ఓ ఆగంతకుడి నుంచి వచ్చిన ఈ బెదిరింపు కాల్‌ను ఇంటర్నెట్ కాల్‌గా గుర్తించారు. ఈ రోజు కరీంనగర్ జిల్లాలో కెసిఆర్ పర్యటిస్తున్నందున పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

02/24/2016 - 12:01

మహబూబ్‌నగర్: అచ్చంపేటలో పోలీసులు బుధవారం ఇద్దరు దొంగలను అరెస్టు చేసి ఆరు తులాల బంగారం, పద్దెనిమిది తులాల వెండి, సెల్‌ఫోన్లు, కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు.

02/24/2016 - 12:00

హైదరాబాద్: తాను బిజెపిలో చేరబోతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని కాంగ్రెస్ ఎం.పి., సినీనటుడు చిరంజీవి స్పష్టం చేశారు. ఫిల్మ్‌నగర్ దైవ సన్నిధానంలో విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా బుధవారం హాజరైన ఆయన మీడియాతో కాసేపు మాట్లాడారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం కాంగ్రెస్‌లోనే ఉంటానని అన్నారు. వాట్సప్, సోషల్ మీడియాలో తనపై ఎందుకు దుష్ప్రచారం జరుగుతుందో తెలియడం లేదన్నారు.

02/24/2016 - 06:40

వేములవాడ: శృంగేరీ పీఠాధిపతి ఆశీస్సులతో త్వరలో 100 కోట్లతో ఆలయంతో పాటు పట్టణ అభివృద్ధి పనులను చేపడతామని ‘వాడా’ వైస్‌చైర్మన్, సిఇవో ముద్దసాని పురుషోత్తంరెడ్డి తెలిపారు. వైస్‌చైర్మన్‌గా చార్జ్ తీసుకున్న అనంతరం తొలిసారి మంగళవారం వేములవాడ రాజన్న కోవెలను సందర్శించి పూజలు గావించుకున్న అనంతరం ఎమ్మెల్యే రమేశ్‌బాబు, ఇవో ఇతర శాఖ అధికారులతో కలసి ఆలయ చెరువు కట్ట మాస్టర్‌ప్లాన్‌ను పరిశీలించారు.

Pages