S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/23/2016 - 08:39

చిగురుమామిడి: రాష్టాన్ని తుగ్లక్‌ల పాలిస్తూ, ప్రతిపక్షాల గొంతు నొక్కాలని యత్నిస్తున్న సిఎం కెసిఆర్ ఉడుత ఊపులకు భయపడేది లేదని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, టిడిఎల్పీ నేత ఎనుముల రేవంత్‌రెడ్డి సిఎం కెసిఆర్‌పై నిప్పులు చెరిగారు. సోమవారం సిఎం దత్తత గ్రామమైన చినముల్కనూర్‌లో రేవంత్‌రెడ్డి...

02/23/2016 - 08:30

హైదరాబాద్, ఫిబ్రవరి 22: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని పూర్తిగా వినియోగించుకుని సబ్సిడీ బియ్యం అక్రమ తరలింపును అడ్డుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై ప్రతి రేషన్ షాపులో సిసి కెమెరాలు అమర్చుతారు. అదేవిధంగా రేషన్ షాపులకు సబ్సిడీ బియ్యం పంపిణీ చేసే ఎంఎల్‌ఎస్ పాయింట్స్ వద్ద కూడా సిసి టీవి కెమెరాలు ఉంటాయి.

02/23/2016 - 07:14

హైదరాబాద్: మహానగర పాలక సంస్థకు ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తిపన్ను వసూళ్లపై సర్కారు ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆస్తిపన్నుపై వడ్డీ మాఫీ చేస్తూ, ఈసారి నెలరోజుల ముందే జీవో జారీ చేయటం ఇందుకు నిదర్శనం. ప్రతి ఆర్థిక సంవత్సరం జనవరి నుంచి పన్ను వసూలుపై పూర్తిస్థాయిలో దృష్టి సారించే అధికార యంత్రాంగం ఆదివారం, ఇతర సెలవురోజుల్లో కూడా విధులు నిర్వర్తించే వారు.

02/23/2016 - 07:12

హైదరాబాద్: ముఖ్యమంత్రి, శాసనసభ స్పీకర్, శాసనమండలి చైర్మన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అఖిల భారత సర్వీస్ అధికారులు, ఇతర ఉన్నతాధికారుల కోసం ఆధునాతన అధికారిక నివాస భవనాలు నిర్మించాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఈ నిర్మాణాలకు స్థల ఎంపికతో పాటు డిజైన్లను ఖరారు చేయడానికి సిఎస్ రాజీవ్ శర్మ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు సోమవారం ప్రకటించారు.

02/23/2016 - 07:07

హైదరాబాద్: ప్రతి శాసనసభా నియోజకవర్గం కేంద్రంలో ఎమ్మెల్యేలకు కార్యాలయాలు నిర్మించాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. వీటిని ఏడాదిలో పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్షలో భాగంగా క్యాంపు కార్యాలయంలో సోమవారం రోడ్లు, భవనాలశాఖ అధికారులతో సమీక్ష జరిపారు.

02/22/2016 - 18:26

హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో ఆస్తిపన్నుపై వడ్డీని మాఫీ చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 6.20 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుంది. కాగా, ఆస్తిపన్ను చెల్లించేందుకు గతంలో కొందరు గృహయజమానులు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని, అలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు.

02/22/2016 - 16:06

హైదరాబాద్: హైదరాబాద్ ఆర్మ్‌డ్ రిజర్వు విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రమణప్రసాద్ ఇక్కడి అల్వాల్ అయ్యప్పనగర్‌లోని తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సోమవారం ఉదయం స్థానికులు కనుగొన్నారు. సమాచారం తెలిశాక పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. రమణప్రసాద్ ఆత్మహత్యకు కారణాలేమిటన్న అంశంపై పోలీసులు విచారిస్తున్నారు.

02/22/2016 - 16:05

హైదరాబాద్: వరంగల్, ఖమ్మం నగరపాలక సంస్థలతో పాటు అచ్చంపేట మున్సిపల్ కౌన్సిల్‌కు ఎన్నికల సందర్భంగా సోమవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు మధ్యాహ్నానికి వరంగల్, ఖమ్మంలో చెరో నామినేషన్ దాఖలయ్యాయి. 25 వరకూ నామినేషన్లను స్వీకరిస్తారు. మార్చి 6న పోలింగ్, 9న కౌంటింగ్ జరుగుతుంది.

02/22/2016 - 16:04

హైదరాబాద్: ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో రహదారి నిర్మాణం పనులు నాణ్యతతో ఉండాలని, అవి భావితరాలకు ఉపయోగపడేలా అధికారులు శ్రద్ధ వహించాలని తెలంగాణ సిఎం కెసిఆర్ అన్నారు. ఆర్ అండ్ బి శాఖకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపుపై ఆయన సోమవారం ఉన్నతాధికారులతో సచివాలయంలో సమీక్ష జరిపారు. గ్రామాల నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధానికి సరైన రీతిలో రహదారులను నిర్మించాలన్నారు.

02/22/2016 - 14:10

మెదక్: ఆరేళ్ల బాలికపై వ్యాయామ ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలియడంతో విద్యార్థులు, గ్రామస్థులు పాఠశాలలో విధ్వంసానికి దిగిన ఘటన మెదక్ జిల్లా మిరుదొడ్డి మండలం అక్బర్‌పేటలో సోమవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు- సోమవారం ఉదయం గ్రామంలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో ఆరేళ్ల బాలికను వ్యాయామ ఉపాధ్యాయుడు కుమార్ ఓ గదిలోకి తీసుకుపోయి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

Pages