S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/23/2016 - 16:30

హైదరాబాద్: తాను చేస్తే నీతి, ఎదుటివారు చేస్తే అవినీతి అన్నట్లు టిడిపి అధినేత చంద్రబాబు వ్యవహరిస్తున్నారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ విమర్శించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, గతంలో తాను టిడిపికి రాజీనామా చేసి తెరాసలో చేరినపుడు చంద్రబాబు నీచంగా మాట్లాడారని, ఇపుడు వైకాపా ఎమ్మెల్యేలను ఏ విలువలతో పార్టీలో చేర్చుకుంటున్నారో నోరు విప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

02/23/2016 - 16:28

హైదరాబాద్: వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు బస్వరాజు సారయ్య మంగళవారం తెరాసలో చేరారు. ఆయన తెలంగాణ సిఎం కెసిఆర్‌ను క్యాంప్ ఆఫీసులో కలిశారు. గులాబీ కండువా కప్పి బస్వరాజును తెరాసలోకి కెసిఆర్ ఆహ్వానించారు. కాగా, సారయ్యను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టి.పిసిసి ప్రకటించింది.

02/23/2016 - 16:27

హైదరాబాద్: ఎపి హౌసింగ్ కార్పొరేషన్‌లో డిపాజిట్ల గల్లంతుపై సిఐడి పోలీసులు నగరంలో దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని 8 ప్రాంతాల్లో అనుమానితుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు.

02/23/2016 - 16:27

హైదరాబాద్: దేశద్రోహం కేసులో అరెస్టు చేసిన జెఎన్‌యు విద్యార్థి సంఘం నాయకుడు కన్నయ్యకు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని, కోర్టు ప్రాంగణంలోనే అతనిపై దాడి జరగడం దారుణమని సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ఆయన మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, దేశంలో మతతత్వ శక్తులు పేట్రేగిపోతుండగా సర్వత్రా అప్రకటిత ఎమర్జన్సీ కనిపిస్తోందన్నారు.

02/23/2016 - 13:38

హైదరాబాద్: నగర శివారులోని జవహర్ నగర్ డంపింగ్ యార్డులో మంగళవారం ఉదయం కోటి రూపాయల నగదు ఉన్న బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డులు డంపింగ్ యార్డును పరిశీలిస్తుండగా డంప్ ఆపరేటర్ ఓ బ్యాగుతో వెళుతూ అనుమానాస్పదంగా తచ్చాడడాన్ని గమనించారు. వెంటనే బ్యాగులో ఏముందని ప్రశ్నించి దాన్ని తెరిచి చూడగా సుమారు కోటి రూపాయల నగదు ఉన్నట్లు గార్డులు గమనించారు.

02/23/2016 - 11:57

నల్గొండ: ప్రేమపేరుతో వేధించి పదో తరగతి విద్యార్థిని భార్గవి ఆత్మహత్యకు కారకుడైన వేణు అనే ఆకతాయి యువకుడిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు ఆందోళన ప్రారంభించారు. వేములపల్లి మండలం శెట్టిపాలెంలో భార్గవి వొంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుని సోమవారం ఆత్మహత్య చేసుకుంది. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

02/23/2016 - 08:49

హైదరాబాద్: దేశ సమగ్రతను కోరుకునే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై తిరుగుబాటు చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. జెఎన్‌యులో దేశ వ్యతిరేక కార్యక్రమాలను నిరసిస్తూ సోమవారం ఇందిరా పార్కు వద్ద బిజెపి ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాకు వివిధ జిల్లాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు.

02/23/2016 - 08:49

హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటి వరకు ఎనిమిది జిల్లాలను గుడుంబా రహిత జిల్లాలుగా గుర్తించామని ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావు తెలిపారు. తెలంగాణను గుడుంబా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో సోమవారం ఆయన ఎక్సైజ్, ప్రొహిబీషన్ శాఖ ఉద్యోగుల డైరీని ఆవిష్కరించారు.

02/23/2016 - 08:40

మహబూబ్‌నగర్: వ్యవసాయశాఖ అధికారుల పనితీరు పట్ల మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన జడ్పీ చైర్మన్ అతిథిగృహంలో వ్యవసాయశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం.. పలువురు ఏడిఏలను వ్యవసాయ శాఖ పనితీరుపై ఆరా తీశారు. అధికారులు సరైన సమాధానం చెప్పలేకపోయారు. గ్రామాల్లో సీడ్ ప్రాజెక్టు ఏ విధంగా నడుస్తోందని..

02/23/2016 - 08:40

నార్కట్‌పల్లి: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలోని ఒసిటిఎల్ ఫ్యాక్టరీని యాజమాన్యం సోమవారం రాత్రి ఆకస్మికంగా లాకౌట్ ప్రకటించింది. నాలుగు రోజుల క్రితం ఫ్యాక్టరీ ఎజిఎం కోయ మస్తాన్‌రావుపై కార్మికులు దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడి మృతి చెందారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఫ్యాక్టరీ యాజమాన్యం ఉద్రిక్తతల మధ్య పరిశ్రమను నడిపించలేమని భావించి తాత్కాలిక లాకౌట్ ప్రకటించింది.

Pages