S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/22/2016 - 14:08

నల్గొండ: ప్రేమిస్తున్నానంటూ ఓ ఆకతాయి నిత్యం వేధింపులకు దిగడంతో టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్గొండ జిల్లా వేములపల్లి మండలం చెట్టిపాలెంలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన వేణు అనే యువకుడు ప్రేమపేరుతో వేధిస్తున్నందువల్లే భార్గవి అనే విద్యార్థిని ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించకుని ఆత్మహత్య చేసుకుందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు.

02/22/2016 - 12:06

హైదరాబాద్ ‌: అమీర్‌పేట్‌ గురుద్వార్‌ దగ్గర ఓ షాపులో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. చెత్తకు నిప్పుపెట్టడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు.

02/22/2016 - 12:04

నల్గొండ: నల్గొండ జిల్లా హుజూర్‌నగర్‌లోని చైతన్య స్కూల్‌ విద్యార్థి నాగార్జున రెడ్డి ఈ రోజు తెల్లవారుజామున మృతి చెందాడు. తోటి విద్యార్థులు వేధిస్తున్నారంటూ సూసైడ్ నోట్ రాసి పాఠశాల నుంచి వెళ్లిపోయిన నాగార్జున క్రిష్ణా జిల్లాలో గాలిన గాయాలతో పోలీసులకు దొరికాడు.

02/22/2016 - 11:58

నల్గొండ: ఏడు ఎకరాల్లో వేసిన పత్తిపంట ఎండిపోగా, 4 లక్షల మేరకు అప్పుల పాలవడంతో మనస్తాపానికి గురైన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం వెలుగుచూసింది. రాజపేట మండలం కొండారెడ్డిగూడెంలో వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకున్న కనకయ్య అనే రైతు మృతదేహాన్ని స్థానికులు సోమవారం ఉదయం గుర్తించారు.

02/22/2016 - 11:56

ఖమ్మం: సింగరేణి బొగ్గు గనుల్లో గిరిజన నిర్వాసితులకు ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేస్తూ మణుగూరు మాజీ ఎమ్మెల్యే కాంతారావు సోమవారం ఉదయం ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించారు. గిరిజనులకు ఉపాధి కల్పించటంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని ఆయన విమర్శించారు.

02/22/2016 - 05:42

హైదరాబాద్, ఫిబ్రవరి 21: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మెదడువాపు (ఎన్‌సెఫలైటిస్) వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రమాదకరమైన ఈ వ్యాధి చిన్నపిల్లలకు వైరల్, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ల ద్వారా సోకుతుంది. తాజాగా హెల్పింగ్ హేండ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో 2015-16కి గాను 203 మెదడువాపు వ్యాధి కేసులు నగరంలోని పలు హాస్పిటళ్లలో నమోదయ్యాయని తేల్చింది.

02/22/2016 - 05:35

మహబూబ్‌నగర్: తెలంగాణలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తుందని, అభివృద్ధి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్లు మండల కేంద్రంలో దాదాపు రూ.2.50 కోట్లతో నిర్మించిన పలు ప్రభుత్వ కార్యాలయాల నూతన భవనాల ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి దత్తాత్రేయ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

02/22/2016 - 05:34

నల్లగొండ: నల్లగొండ జిల్లా డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించే ఐదు రిజర్వాయర్ల నిర్మాణానికి ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ 3102కోట్లతో ప్రతిపాదనలు ఇవ్వడంతో ప్రభుత్వం రేపోమాపో టెండర్ల ప్రక్రియకు సిద్ధమవుతోంది. ఇప్పటికే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోథల పథకానికి 18ప్యాకేజీలుగా 29,928కోట్ల పనులకు టెండర్లను పిలిచిన ప్రభుత్వం తదుపరి డిండి ఎత్తిపోతల టెండర్ల ప్రక్రియ దిశగా అడుగులేస్తోంది.

02/22/2016 - 05:33

హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు పలు అంశాల్లో పరస్పరం విమర్శించుకుంటున్నా కొన్ని అంశాల్లో మాత్రం ఒకరినొకరు అనుసరిస్తున్నారు. నామినేటెడ్ పదవుల పంపకంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్.. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు తరహానే అనుసరిస్తున్నారు.

02/22/2016 - 05:15

హైదరాబాద్: దేశ రక్షణ విషయంలో రాజీధోరణి సరికాదని రక్షణ రంగ నిపుణుడు, బ్రిగేడియర్ రిటైర్డ్ ఏజి కృష్ణయ్య పేర్కొన్నారు. సియాచిన్‌పై భారత హక్కులను పొరుగు దేశాలు గుర్తించే వరకు భద్రతను కొనసాగించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆదివారం అవేర్‌నెస్ ఇన్ ఆక్సన్ సంస్థ ఆధ్వర్యంలో ఓయు లైబ్రరీ ఐసిఎస్‌ఎస్‌ఆర్ ఆడిటోరియంలో నిర్వహించిన ఇండియాస్ సెక్యూరిటీ ఇంపరేటివ్స్ అండ్ సియాచిన్ అనే అంశంపై సదస్సును నిర్వహించారు.

Pages