S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/21/2016 - 08:46

నార్కట్‌పల్లి: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి ఒసిటిఎల్ ఫ్యాక్టరీలో కార్మికుల దాడికి గురైన ఫ్యాక్టరీ ఎజిఎం కోయ మస్తాన్‌రావు(51) ఎల్‌బి నగర్ కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందారు. రెండు రోజుల క్రితం కార్మికుల దాడిలో తలకు తీవ్ర గాయాలై రక్తస్రావం జరిగి ఆయన కోమాలోకి వెళ్లి చికిత్సలో ఉండగానే మృతి చెందారు.

02/21/2016 - 08:41

హైదరాబాద్: వరంగల్ జిల్లా హనుమకొండలో కాళోజీ కళాకేంద్రంకు నిర్మాణం కోసం 50 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దశలవారిగా నిధులు విడుదల చేస్తున్నారు. 3.5 ఎకరాల్లో నాలుగు అంతస్థుల్లో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఒకేసారి 11వందల మంది కూర్చునే విధంగా భారీ ఆడిటోరియం నిర్మిస్తారు.

02/21/2016 - 06:41

మేడారం: కోటిన్నర మందికి పైగా భక్తులను కరుణించిన చల్లని తల్లులు... తమ కోసం తరలివచ్చిన భక్తజనావళిని ఆశీర్వదించి తల్లుల వనప్రవేశంతో మేడారం మహాజాతర ప్రధానఘట్టం శనివారం సాయంత్రం ముగిసింది. నాలుగురోజుల పాటు భక్తజన నీరాజనాలు అందుకున్న సమ్మక్క-సారలమ్మ దేవతలు సాయంత్రం వనప్రవేశం చేసారు.

02/21/2016 - 06:23

హైదరాబాద్: గత ఏడాది ఉల్లి ధరలు వినియోగదారులకు కన్నీళ్లు తెప్పిస్తే, ఈసారి రైతులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. గత సీజన్‌లో ఓపెన్ మార్కెట్‌లో ఉల్లి ధర కేజీ 80 నుంచి వందకు చేరింది. రైతు బజార్లలో రేషన్ కార్డు, ఆధార్ కార్డు వంటి ఆధారాలు చూపితే ప్రభుత్వం సబ్సిడీతో ఉల్లిని అమ్మించింది. ఒకవైపు సబ్సిడీ భరిస్తూ ఉల్లి అమ్మించడంతో పాటు రైతులకు 70 శాతం సబ్సిడీతో ఉల్లి విత్తనాలు అందజేశారు.

02/21/2016 - 06:21

హైదరాబాద్: రాష్ట్రంలో గోదావరి తీరంవెంట 330 కి.మీ పొడువున నాలుగు లైన్లతో రోడ్ కారిడార్‌ను నిర్మించాలనే రాష్ట్రప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం ఓకె చెప్పింది. ఈ కారిడార్‌కు దాదాపు రూ.3000 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో గోదావరి నది తీరం పొడువునా కారిడార్ (రోడ్డు) నిర్మాణం వల్ల ఆర్ధికపరమైన కార్యకలాపాలు పుంజుకుంటాయి.

02/21/2016 - 06:17

హైదరాబాద్: ప్రభుత్వ వైద్యం బలోపేతం చేసేందుకు ఎన్ని నిధులైనా విడుదల చేస్తామని సిఎం కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి నిమ్స్‌వరకు ఏ ఆస్పత్రికి ఏంకావాలో సమగ్ర నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. బడ్జెట్ సమీక్షలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖపై క్యాంపు కార్యాలయంలో శనివారం సమీక్షించారు.

02/20/2016 - 16:22

హైదరాబాద్: గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర రాజధాని స్థాయి వరకూ వైద్య, ఆరోగ్య శాఖను పటిష్టం చేసేలా తగినన్ని నిధులిస్తామని తెలంగాణ సిఎం కెసిఆర్ అన్నారు. వైద్య, ఆరోగ్య శాఖకు బడ్జెట్‌లో కేటాయించాల్సిన నిధుల గురించి ఆయన శనివారం అధికారులతో సమావేశమైన సందర్భంగా మాట్లాడారు. హైదారాబాద్‌లో నాలుగు చోట్ల వెయ్యి పడకల ఆస్పత్రుల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు.

02/20/2016 - 12:01

వరంగల్: మేడారం జాతరలో చివరి రోజైన శనివారం నాడు భక్తులు ఇంకా భారీగా తరలి వస్తున్నారు. రెండు రోజులుగా గద్దెలపై కొలువుతీరిన సమ్మక్క, సారలమ్మలను ఈ రోజు సాయంత్రం తిరిగి వన ప్రవేశం చేయిస్తారు. సమ్మక్కను చిలకలగుట్టకు, సారలమ్మను కనే్నపల్లిలోని గుడికి తీసుకువెళ్తారు. సాయంత్రం ఏడు గంటలకు దేవతలను వన ప్రవేశానికి సిద్ధం చేస్తారు.

02/20/2016 - 12:00

నిజామాబాద్: తాగునీటి సమస్యను తీర్చాలని కోరుతూ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా నాయకులు పట్టించుకోనందుకు నిరసనగా నిజామాబాద్ జిల్లా పిట్లం గ్రామానికి చెందిన మహిళలు జాతీయ రహదారిపై శనివారం రాస్తారోకో చేపట్టారు. దీంతో నాందేడ్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది.

02/20/2016 - 02:44

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 19: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించిన పథకాల్లో ప్రధానమైన సాగునీటి ప్రాజెక్టు పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ఒకటి. శ్రీశైలం జలాశయం బ్యాక్‌వాటర్‌ను ఎత్తిపోసి మూడు జిల్లాల పరిధిలో దాదాపు పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.

Pages