S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/22/2016 - 05:14

హైదరాబాద్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి ఒకరు మృతి చెందాడు. హైదరాబాద్‌లోని తార్నాకకు చెందిన మాథ్యూస్ అమెరికాలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. కాగా ఆదివారం అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మాథ్యూస్ మృతి చెందాడు. అయితే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ విద్యార్థి మరణ వార్తను అతడి తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో తార్నాకలో విషాదఛాయలు అలుముకున్నాయి.

02/22/2016 - 02:03

హైదరాబాద్: సిబిఐ మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి విజయరామారావు కుమారుడు కళ్యాణ శ్రీనివాసరావుపై సిబిఐ కేసు నమోదు చేసింది. పలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల చెల్లింపులో విఫలమయ్యారన్న అభియోగాల కింద సిబిఐ అధికారులు కేసులు నమోదు చేశారు. సెంట్రల్ బ్యాంకు సహా పలు బ్యాంకుల నుంచి రూ.304 కోట్లు రుణాలు తీసుకొని తిరిగి చెల్లించలేదని ఆయా బ్యాంకుల అధికారులు సిబిఐకి ఫిర్యాదు చేశారు.

02/22/2016 - 02:01

క్రమబద్ధీకరణ గడువు సాగుతూనే ఉందిగానీ, ప్రక్రియ మాత్రం ముందుకు సాగడం లేదు. సిఎం హామీలు సైతం నెరవేరక పోవడంతో మధ్య తరగతి ప్రజల్లో ఒకింత అసంతృప్తి నెలకొంటోంది.

02/22/2016 - 01:58

హైదరాబాద్: ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, అచ్చంపేట మున్సిపాలిటీకి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకానుంది. వెంటనే నామినేషన్లు దాఖలు చేయవచ్చు. 24 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 25న స్కూృటిని, 26న ఉప సంహరణ, మార్చి 6న పోలింగ్ జరుగుతుంది. 9న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన.

02/22/2016 - 01:57

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంచినీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చింది. జనవరి నాటికే భూగర్భ జల నీటి మట్టం 6.83 అడుగుల నుంచి 24.57 అడుగులకు పడిపోయింది. దీంతో రానున్న మే నెల నాటికి భూగర్భ జలాలు మరింత దిగజారి పోయే ప్రమాదం ఉంది. దీంతో భూగర్భ జలాలపై ఆధారపడిన దాదాపు 10 వేల ఆవాసాలు, శివారు ప్రాంతాలు మంచినీటికి తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొనే పరిస్థితి ఉంది.

02/21/2016 - 15:31

హైదరాబాద్ : నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా భూపాల్‌రెడ్డి ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. స్పీకర్ చాంబర్‌లో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. ఈనెల 13వతేదీన జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన మొత్తం 52 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే.

02/21/2016 - 15:31

హైదరాబాద్: గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు అచ్చంపేట మున్సిపల్ కౌన్సిల్‌కు ఎన్నికలు జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ నెల 22 నుంచి 24 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. 25న నామినేషన్ల పరిశీలన, 26న ఉపసంహరణ, 6 పోలింగ్, 8న కౌంటింగ్ జరపాలని నిర్ణయించారు.

02/21/2016 - 14:11

హైదరాబాద్:తెలంగాణలోని గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మున్సిపాల్టీల ఎన్నిల షెడ్యూల్ విడుదలైంది. సోమవారంనాడు వీటికి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎన్నికల సంఘం ఆదివారం నాడు ప్రకటించింది. సోమవారంనుంచి ఈనెల 24వ తేదీవరకు నామినేషన్ల స్వీకరణ, 25న నామినేషన్ల పరిశీలన, 26 మధ్యాహ్నం 3 గంటలవరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు.

02/21/2016 - 13:04

హైదరాబాద్:హైదరాబాద్ తార్నాకకు చెందిన మాథ్యూస్ అనే విద్యార్థి అమెరికాలో జరిగిన రోడ్డుప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. అక్కడ కంప్యూటర్ సైన్స్‌లో పిజి చేస్తున్న మాథ్యూస్ మరణవార్తను భారత విదేశాంగశాఖ ధ్రువపరిచింది.

02/21/2016 - 13:02

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మార్చి రెండోవారంలో నిర్వహించనున్నామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా గెలిచిన భూపాల్‌రెడ్డి ప్రమాణస్వీకారం అనంతరం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో విద్యుత్ సమస్యపై చర్చలేకుండానే నిర్వహిస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్‌పై చర్చతోనే గడిచిపోయేదని ఆయన గుర్తు చేశారు.

Pages