S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/20/2016 - 02:44

మేడారం బృందం, ఫిబ్రవరి 19: మేడారం జాతరకు విచ్చేసిన భక్తులకు విఐపిలు, వివిఐపిల వాహనాలతో ఇక్కట్లు ఎదురయ్యాయి. విఐపిలు, వివిఐపిలు అంటూ కొంతమంది తమ వాహనాలను ప్రధాన ద్వారం వరకు తీసుకరావడంతో సామాన్య భక్తజనానికి తిప్పలు తప్పలేదు.

02/20/2016 - 02:43

మేడారం బృందం, ఫిబ్రవరి 19: భక్తుల సౌకర్యార్థం మేడారం జాతరకు విచ్చేసే విఐపిలను చేరవేసేందుకు ఏర్పాటుచేసిన హెలికాప్టర్ వస్తుందంటే మేడారం గద్దెల పరిసరాలలో ఎటు 3కిలోమీటర్ల దూరంలో బస చేసిన భక్తులు హడలిచస్తున్నారు. విషయం ఏంటంటే...వచ్చిన విఐపిలు ఏరియల్ వ్యూ అంటూ మేడారం పరిసరాలను రెండు రౌండ్‌లు వేసుకుని మరీ గద్దెల సమీపంలోని పోలీస్ క్వార్టర్స్ వెనుక భాగంలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్ద దిగుతున్నారు.

02/20/2016 - 02:43

స్వల్ప అస్వస్థతే కారణం: సిఎంఓ

02/20/2016 - 02:42

మేడారం బృందం, ఫిబ్రవరి 19: మేడారం జాతరలో సమ్మక్క-సారలమ్మ గద్దెలపై కొలువున్న క్షణం నుండి ప్రముఖుల తాకిడి ఎక్కువైంది. శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి తరపున రాష్ట్ర గిరిజన సంక్షేమ పర్యాటక శాఖ మంత్రి అజ్మీర చందూలాల్ తులాభారం తూగి 56 కిలోల బంగారాన్ని (బెల్లం) అమ్మవార్లకు సమర్పించారు.

02/20/2016 - 02:41

మేడారం, ఫిబ్రవరి 19: ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన తెలంగాణ కుంభమేళా మేడారం జాతర మహాఘట్టానికి శనివారంతో తెరపడనుంది. గత నాలుగు రోజులుగా జనారణ్యంగా మారిన మేడారం.. తల్లుల వనప్రవేశంతో బోసిపోనుంది. సుమారు కోటికి పైగా భక్త జనం తల్లులను దర్శించుకుని పరవశించిపోయారని అధికార యంత్రాంగం లెక్కలు చెపుతుండగా అంతకంటే ఎక్కువగానే ఉండవచ్చునని మరో అంచనా.

02/20/2016 - 02:40

మేడారం బృందం, ఫిబ్రవరి 19: మేడారం జాతరలో పోలీస్, రెవెన్యూ, దేవాదాయ శాఖ ఉద్యోగుల తీరు విమర్శలకు దారితీస్తుంది. తల్లుల దర్శనానికి వచ్చే భక్త జనానికి వారి తీరు చుక్కలు చూపిస్తుంది. తమ కుటుంబ సభ్యులు, బంధువులను రాచమర్యాదలతో స్వాగతం పలుకుతూ భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని భక్తులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. గురువారం రాత్రి సమ్మక్క రాకతో క్యూలైన్‌ల వద్ద భక్తులు గంటలతరపడి వేచి ఉన్నారు.

02/20/2016 - 02:39

మేడారం, ఫిబ్రవరి 19: బుధవారం ఏకకాలంలో ముగ్గురు దేవతలు గద్దెలపైకి చేరడంతో మేడారం జాతరకు నిండుశోభ సంతరించుకుంది. కనె్నపల్లి నుండి సారలమ్మ..కొత్తగూడ మండలం పూనుగొండ్ల నుండి పగిడిద్దరాజు.. ఏటూరునాగారం మండలం కొండాయి నుండి గోవిందరాజులు గద్దెలపైకి చేరగా గురువారం రాత్రి చిలకలగుట్ట నుండి సమ్మక్కతల్లి రాకతో మేడారం జాతర మురిసిపోయింది. తల్లులు గద్దెలపైకి చేరడంతో మేడారం అమ్మల ప్రభతో ప్రకాశవంతంగా మారింది.

02/20/2016 - 02:38

మేడారం, ఫిబ్రవరి 19: ఆదివాసీల ఆరాధ్యదైవాలు... వరాల తల్లులు సమ్మక్క-సారలమ్మ గద్దెలను అలంకరించడంతో భక్తజనం పోటెత్తింది. జంపన్నవాగులో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి తల్లిబిడ్డలకు మొక్కులు చెల్లించుకునేందుకు ఒడిబాల బియ్యం, కొబ్బరికాయలు, నిలువెత్తు బంగారం(బెల్లం)తో తరలివచ్చారు. శుక్రవారం నాటికి కోటి 20 లక్షలకు పైగా భక్తజనం జాతరలో అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

02/19/2016 - 16:39

హైదరాబాద్: దిల్లీలో జెఎన్‌యు విద్యార్థి సంఘం నాయకుడు కన్నయ్యను దేశద్రోహం కేసులో అరెస్టు చేసినందుకు నిరసనగా సిపిఐ నేతలు, కార్యకర్తలు శుక్రవారం ఇక్కడ రాజ్‌భవన్‌ను ముట్టడించేందుకు విఫల యత్నం చేశారు. రాజ్‌భవన్‌లోకి చొరబడేందుకు యత్నించిన పలువురు సిపిఐ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

02/19/2016 - 16:38

హైదరాబాద్: దిల్లీలోని పటియాలా హౌస్ వద్ద ఇటీవల జరిగిన దాడులకు సంబంధించి హైదరాబాద్‌లోని హైకోర్టు బార్ కౌన్సిల్ వద్ద రెండు వర్గాల లాయర్లు శుక్రవారం ఘర్షణ పడ్డారు. దిల్లీ ఘటనను ఖండించిన ముగ్గురు లాయర్లను బిజెపి సానుభూతిపరులైన కొందరు లాయర్లు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని చక్కదిద్దారు.

Pages