S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

07/07/2016 - 04:24

హైకోర్టు విభజన అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీలో దీక్ష చేస్తానని చెప్పడం ఏ విధంగా సబబు? కెసిఆర్ కావాలనుకుంటే అమరావతిలో దీక్ష చేయాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కలిసి తేల్చుకోవల్సిన అంశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని లాగడం, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదు. ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్యకు ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ముందుకు రావాలి.

06/30/2016 - 00:27

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల పంపిణీ వివాదం కొనసాగుతోంది. మంత్రుల స్థాయిలో జరిగిన భేటీలో ఇరు రాష్ట్రాలూ పట్టువీడకపోవడంతో వ్యవహారం కొలిక్కి రాలేదు. రెండుసార్లు భేటీ అయినా ఎలాంటి ఫలితం ఇవ్వకపోవడంతో కృష్ణా నదీ జలాల పంపిణీలో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించుకునే క్రమంలో జూలై 5వ తేదీన మరోమారు సమావేశం కావాలని నిర్ణయించారు.

06/30/2016 - 00:25

కెఆర్‌ఎంబి ఏర్పాటవగానే అమలులో ఉన్న ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఆయా ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకురావాలి. తెలంగాణ తెలిసీ తెలియక మొండివాదన చేస్తోంది. తెలంగాణ వైఖరి అమానుషం, దుర్మార్గం. స్వార్థ ప్రయోజనాలకోసం ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టాలని చూస్తోంది.

06/30/2016 - 00:22

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య కృష్ణా జలాల పంపిణీని వితండవాదంతో ఆంధ్రప్రదేశ్ సంక్లిష్టంగా మారుస్తోంది. న్యాయంగా తెలంగాణకు దక్కాల్సిన వాటాను వదులుకునే ప్రసక్తి లేదు. మా వాటా మాకు కావాలి కానీ ఆంధ్రకు చెందిన ఒక్క నీటి చుక్క కూడా మాకు అవసరం లేదు. కర్నాటక, మహారాష్టల్రతో సమస్యలను పరిష్కరించుకుంటున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం వితండ వాదంతో సమస్యను సంక్లిష్టంగా మారుస్తోంది.

06/30/2016 - 00:21

కృష్ణా జలాల పంపిణీ విషయంలో తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు విపక్షాల అభిప్రాయం తీసుకునేందుకు తక్షణం ఎపి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్షం సమావేశాలు ఏర్పాటు చేయాలి. ఏ ప్రభుత్వమైనా ప్రజాస్వామ్య విధానాలకు విలువ ఇవ్వాలి.

06/30/2016 - 00:19

నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిన విషయం వాస్తవమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణకు కృష్ణా నదీ జలాల కేటాయింపు అవసరం కూడా ఉంది. దీనికోసం ప్రభుత్వం ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టే రీతిలో ఇరు ప్రాంతాల ప్రజల మధ్య పంచాయితీలు పెట్టే విధంగా కాకుండా కేంద్ర ప్రభుత్వంతో చర్చించుకుని, తర్కించుకుని పరిష్కరించుకోవడానికి అవకాశం ఉన్న సమస్య.

06/30/2016 - 00:18

జలాల వినియోగం విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేస్తున్నారు. యజ్ఞాలు, యాగాలు చేయడంలో ఇరువురు కూడా పరస్పరం ఒకరినొకరు ఆహ్వానించుకుంటూ, గౌరవించుకుంటున్నారు కదా! అదే విధానాన్ని ప్రజల సమస్యల సందర్భంగా కూడా అమలు చేస్తే బాగుంటుంది. ఏదైనా సమస్య వస్తే దాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలే తప్ప మరింత జటిలం చేయకూడదు.

06/30/2016 - 00:17

కృష్ణా నదిలో నీళ్లే లేవు. మహారాష్ట్ర, కర్నాటక గతంలో ఎడాపెడా ప్రాజెక్టులు కట్టేవి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కడుతోంది. బ్రిజేష్ ట్రిబ్యునల్ వివరాలు ప్రకటించాల్సి ఉంది. సుప్రీం కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాల్లో వాటా కోసం వెళ్లింది. ఇవన్నీ తేలేవరకు బచావత్ ట్రిబ్యునల్ అమలులో ఉంటుంది. ఆల్మట్టి నుంచి దిగువన ఉన్న నాగార్జునసాగర్ వరకు అన్ని జలాశయాలు ఎండిపోయి ఉన్నాయి.

06/30/2016 - 00:16

మాటలు కూడబెడితే వ్యక్తికి మంచిది... డబ్బు కూడబెడితే పిల్లలకు ఉపయోగం... జలాలు కూడబెడితే యావత్ జాతికి ప్రయోజనం. కృష్ణా జలాలపై ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం లేదు. ప్రస్తుత పాలకులకు మల్లన్నసాగర్ వంటి ఇరిగేషన్ ప్రాజెక్టులపై తీసుకుంటున్న శ్రద్ధ, టిఆర్‌ఎస్ పార్టీలోకి ఆహ్వానించి కండువాలు కప్పడంపై చూపుతున్న ఆసక్తి కృష్ణా జలాలు రప్పించడంపై లేదు. నీరు అందరికీ అవసరమే, సరిహద్దు రాష్ట్రాల వివాదాలు మానాలి.

06/30/2016 - 00:15

కొత్తగా నీటి పారుదల ప్రాజెక్టులు రావాలి. కానీ ముంపు లేకుండా చూడాలి. అదే బిజెపి విధానం. ఈ విషయంలో బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూడా చాలా స్పష్టతతో ఉన్నది. ప్రాజెక్టు వల్ల ఒక ఇల్లు, ఒక గ్రామం ముంపునకు గురైతే ప్రత్యామ్నాయంగా నిర్మించాలి. నిర్వాసితులు నష్టపోరాదు.

Pages