S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

12/28/2017 - 19:54

చైనాకు చెందిన ప్రఖ్యాత సంస్థ హవాయి మరో విలక్షణమైన స్మార్ట్ఫోన్‌ను మార్కెట్‌లో రిలీజ్ చేసింది. ఆనర్-9 పేరుతో ఇప్పటికే చైనాలో విడుదలైన ఈ ఫోన్ భారతీయ మార్కెట్‌లో రంగప్రవేశం చేయడానికి సన్నాహాలు పూర్తయ్యాయి. 3, 4 జిబి ర్యామ్‌లలో విడుదలకాబోతున్న ఈ ఫోన్ ధరలను రూ.14,590, రూ. 17,500లుగా నిర్ణయించారు.

12/28/2017 - 19:53

స్మార్ట్ఫోన్ టచ్ స్క్రీన్ వలే పనిచేస్తూ 13.3 అంగుళాల తెరతో అందరినీ కట్టిపడేసేలా మార్కెట్‌లోకి రంగప్రవేశం చేసింది- ‘డెల్ ఎక్స్‌పిఎస్ 13’ ల్యాప్‌టాప్. హై రిజల్యూషన్‌తో పనిచేసే ఈ ల్యాపీని అల్యూమినియం ప్లేట్‌తో అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. 1.2 కిలోల బరువుండే ఈ ల్యాప్‌టాప్ ధరను రూ. 91,990లుగా నిర్ణయించారు. 12 నుంచి 14 గంటల సేపు బ్యాటరీ బ్యాకప్ కలిగి ఉండడం ఇందులోని మరో విశిష్టత.

12/28/2017 - 19:51

స్మార్ట్ఫోన్ వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ ‘10-ఆర్’ పేరుతో కొత్తరకం మొబైల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేస్తోంది. ‘10-ఆర్’ బ్రాండ్ స్మార్ట్ఫోన్లు జనవరి 5 నుంచి అందుబాటులోకి వస్తాయని తెలియగానే అపుడే వినియోగదారుల్లో ఆసక్తి మొదలైంది. ఈ ఫోన్‌లోని ప్రత్యేకతలు వినియోగదారులను అలరించేలా ఉంటాయని ‘అమెజాన్’ చెబుతోంది.

12/28/2017 - 19:50

చైనాకు చెందిన ఒప్పో కంపెనీ ఎ-83 పేరుతో సరికొత్త స్మార్ట్ఫోన్‌ను విడుదల చేసింది. కొద్ది రోజుల్లో భారతీయ మార్కెట్‌లో అందుబాటులో ఉండే ఈ ఫోన్‌లో 18.9 ఫుల్ విజన్ డిస్‌ప్లే, ఫేసియల్ రికగ్నిషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. భారత్‌లో దీని ధర రూ.13,700 గా ఉంటుందని అంచనా. ఇందులోని విశిష్టతలు...

12/21/2017 - 20:00

సూపర్‌హిట్ బాలీవుడ్ సినిమా ‘రాణి’ అంటే ఆమెకు తెగ ఇష్టం.. ఆ సినిమాలో కీలకపాత్రలో మెప్పించి జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న కంగనా రనౌత్ అన్నా మరీ ఇష్టం.. కంగనాకు, తనకు ఎన్నో పోలికలున్నాయని సన్నిహితులు చెబుతుంటే ఆమెకు ఎంతో సంతోషం.. ‘రాణి’ సినిమా సంగతిని పక్కన పెడితే- ఆమె మాత్రం ‘చదరంగ సామ్రాజ్యాని’కి మకుటం లేని మహారాణిలా జైత్రయాత్ర కొనసాగిస్తోంది.

12/21/2017 - 19:57

నేటి సాంకేతిక యుగంలో జాబ్ మార్కెట్ అంతా వైవిధ్యం, నైపుణ్యంపైనే నడుస్తోంది.. ఓ నాలుగు కొత్త నైపుణ్యాలు సాధిస్తేనే ఉద్యోగాలకు అవకాశం.. ఎంతటి ప్రతిభ ఉన్నా కాలానుగుణంగా నైపుణ్యం పెంపొందించుకుంటేనే ‘కెరీర్ కలలు’ సాకారం అవుతాయన్నది కాదనలేని వాస్తవం.. ఈ క్రమంలో కంపెనీల్లో మారుతున్న సాంకేతిక, వ్యాపార, వాణిజ్య అవసరాలకు అనుగుణంగా ఉద్యోగార్థులకు ఎన్నో కొత్త కోర్సులు స్వాగతం పలుకుతున్నాయి..

12/21/2017 - 19:56

మన దేశంలో ఇంటర్నెట్ సౌకర్యాన్ని వాడుతున్న వినియోగదార్లకు ఇంటర్నెట్ స్పీడ్‌ను అంచనా వేసే ‘ఓక్లా’ అనే సంస్థ ఓ శుభవార్తను అందించింది. నవంబర్ మాసానికి సగటు మొబైల్ ఇంటర్‌నెట్ వేగం దాదాపు రెట్టింపు అయిందని, ఇది భారతీయ వినియోగదారులకు శుభవార్తేనని తెలిపింది. కాగా, మొబైల్ ఇంటర్‌నెట్ స్పీడ్‌లో భారత్ 109వ స్థానంలో నిలచింది. బ్రాండ్ బ్యాండ్ స్పీడ్‌లో 76వ స్థానంలో నిలిచింది.

12/21/2017 - 19:54

నేటి సాంకేతిక యుగంలో ఇన్‌స్టెంట్ మెసేజింగ్‌కు సంబంధించి వేగంగా దూసుకుపోతున్న యాప్ ఏది అంటే- అందరూ చెప్పే సమాధానం వాట్సాప్. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను వినియోగదారులకు అందిస్తూ తనకు పోటీ ఏదీ లేదని సగర్వంగా ఇది చాటి చెబుతోంది. అయితే- వాట్సాప్ సేవలు కొన్ని ఫోన్‌లలో నిలిచిపోనున్నాయి. త్వరలో కొన్ని ఫోన్‌లలో మాత్రం ఈ యాప్ పనిచేయకుండా వాటికి సపోర్టును నిలిపివేస్తారన్న ఊహాగానాలు జోరందుకుంటున్నాయి.

12/21/2017 - 19:53

నోకియా బెస్ట్ సెల్లింగ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్‌లలో ఒకటైన నోకియా 6 మరోసారి మార్కెట్‌లో మెరవబోతోంది. దీనికి సంబంధించిన 2018 వేరియంట్ జనవరిలో విడుదల కాబోతున్నట్లు సమాచారం. ఎచ్‌ఎండి గ్లోబల్ నేతృత్వంలో నోకియా బ్రాండ్ నుంచి విడుదలైన మొట్టమొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్‌గా ‘నోకియా-6’ చరిత్ర సృష్టించింది.

12/21/2017 - 19:51

లండన్‌లో కొద్ది రోజుల క్రితం హువాయి సబ్ బ్రాండ్ ఆనర్ సంస్థ తన ప్రతిష్ఠాత్మక స్మార్ట్ఫోన్ హానర్ వ్యూ 10ని విడుదల చేసింది. ఈ ఫోన్‌ను జనవరి 8న జరిగే గ్రాండ్ ఈవెంట్ ద్వారా ఇండియాకి పరిచయం చేస్తామని ఆనర్ తెలిపింది. గత వారం చైనాలో ఆనర్ వ్యూ వి10 తొలిసారిగా ఆవిష్కరించిన సంగతి విదితమే. దీని ధర ఇండియాలో సుమారుగా 38వేల రూపాయలు ఉంటుందని అంచనా.
అలరించే ఫీచర్లు

Pages