S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవీ .. ఇవీ..

10/02/2016 - 00:16

ఈ చిత్రంలో కన్పిస్తున్న ఈ జీవిని పరీక్షగా చూడండి. అప్పుడే అది తాబేలని తెలుస్తుంది. లేదంటే ఏదో భయంకరంగా కన్పించే కొత్తజీవి అనుకుంటారు. ప్రపంచంలోని దాదాపు అన్ని సముద్రాల్లో కన్పించే భారీరకం తాబేలు ఇది. లాగర్‌హెడ్ టర్టిల్‌గా దీనిని పిలుస్తారు. దీన తల రూపును బట్టి దానికి ఆ పేరు వచ్చింది. భారీ సైజులో, అధిక బరువుతో ఇవి ఉంటాయి. ఇంతకీ ఈ ఫొటోలో కన్పిస్తున్నది ఎదిగిన లాగర్‌హెడ్ టర్టిల్ కాదు.

10/02/2016 - 00:14

సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఎన్ని పనులైనా చేసేయొచ్చని ఎప్పుడో రుజువైంది. శస్తచ్రికిత్సలలో కూడా వినియోగిస్తున్న రోబోలు యుద్ధాల్లోనూ తమ సేవలు అందిస్తున్నాయి. అలాంటి వంటింట్లో సేవలకు పనికిరావా ఏంటి. ఇదే ఆలోచన కొందరికి వచ్చింది. దాంతో పిజ్జాల తయారీకి వాటిని ఎలా తీర్చిదిద్దాలో కొందరు ఊహించి వాటికో రూపం ఇచ్చారు.

09/24/2016 - 22:12

ఈ ఫొటోను పరీక్షగా చూడండి. అందమైన బొమ్మలో..అందులోని రంగులనే మేనికి వేసుకుని కలసిపోయినట్లు ఫోజిచ్చిన ఓ అమ్మడు కన్పిస్తుంది. ఔనా! జపాన్‌కు చెందిన ప్రఖ్యాత ఆర్టిస్ట్ షిగెకి మత్సుయమ ఈ చిత్రాన్ని వేశారు. ‘రూమ్స్33’ సంస్థ సారథ్యంలో ప్రతి ఆరునెలలకు ఓమారు నిర్వహించే ఫ్యాషన్ అండ్ డిజైన్ ట్రేడ్ షోలో ఇలాంటి ఎగ్జిబిట్స్ వందల్లో వస్తాయి.

09/24/2016 - 22:10

సాంకేతికత, కళాత్మకత కలగలసిన అందమైన రూపాలు అక్కడ దర్శనమిస్తాయి. అమెరికాలోని నెవెడ ఎడారి ప్రాంతంలో ప్రతి ఆగస్టు చివరి సోమవారం, సెప్టెంబర్ మొదటి సోమవారం మధ్య జరిగే జాతరలో ఈ అపురూపమైన కళాకృతులు కనువిందు చేస్తాయి. ఏటా నెవెడాలో జరిగే ‘బర్నింగ్‌మ్యాన్’ వేడుకకు ఈసారి 70వేలమంది హాజరయ్యారు.

09/18/2016 - 22:08

సెల్ఫీలు తీసుకోవడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. మరికొందరికి అది పాషన్ అయింది. అలాగే రష్యాకు చెందిన 23 ఏళ్ల ఏంజిల నికొలొవ్‌కు ప్రమాదపు అంచుల్లో నిలబడి తీరిగ్గా సెల్ఫీ తీసుకోవడం అంటే మహాఇష్టం. ఆమె చేసే సాహసం ప్రాణాలతో చెలగాటమే. ఆమె తీసుకున్న సెల్ఫీలను చూస్తేనే గగుర్పాటు కలిగిస్తుంది.

09/18/2016 - 22:04

జపాన్‌లో ఓ సుమో యోధుడు ఓ పిల్లాడితో ఇలా ఆడుతూ అలరించాడు. జపాన్ సంప్రదాయ సుమో పోటీలకు ప్రారంభ సూచికగా ఇలా చేశాడు. ఓ రకంగా అసలు పోటీకి సిద్ధమవుతూ మనసును తేలిక చేసుకునే ప్రయత్నం అన్నమాట.

09/11/2016 - 23:07

ఓ చిన్నసైజు మోటార్‌బైక్‌పై రెండు కప్పలు ప్రయాణిస్తున్నట్లు కన్పిస్తున్న ఈ దృశ్యం ఇండోనీషియాలో కన్పించింది. అచ్చం ఎవరో కూర్చోపెట్టినట్లున్న ఈ డంపీ ట్రీ ఫ్రాగ్స్ కొద్దిసేపు అలా ఉండి తరువాత చటుక్కున గెంతుతూ వెళ్లిపోయాయి.ఓ చిన్నసైజు మోటార్‌బైక్‌పై రెండు కప్పలు ప్రయాణిస్తున్నట్లు కన్పిస్తున్న ఈ దృశ్యం ఇండోనీషియాలో కన్పించింది.

09/11/2016 - 23:05

లండన్‌లోని ఓ పార్కులో కన్పించిన ఈ రోబో ఓ పుస్తకాన్ని తదేకంగా చూస్తున్నట్లుంది కదూ. కానీ అది అలా పుస్తకం చూస్తూ ఓ కథ చెబుతోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొంత పుంతలు తొక్కుతున్నదనడానికి ఇది ఓ ఉదాహరణ. ‘ఇంటరాక్టివ్ స్టోరీ టెల్లింగ్ విత్ ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్’ ధీమ్‌తో ఈ రోబోలు తయారు చేస్తున్నారు. ముందుగా ఊహించని, తీర్చిదిద్దని అంశాలపై అప్పటికప్పుడు ఈ రోబోలు కథలు చెబుతాయి.

09/11/2016 - 23:03

వర్షపు నీరు నిలిచినప్పుడు కాగితంతో చేసిన పడవలు వేసి, అవి కదులుతూంటే ఆనందించడం చిన్ననాటి సరదా. కానీ అమెరికా, ఇంగ్లండ్‌సహా కొన్ని ప్రాంతాల్లో పాలప్యాకెట్ల ప్యాకింగ్‌కోసం వాడే అట్టపెట్టలతో చేసిన పడవలతో రేసింగ్ నిర్వహించడం ఓ సంప్రదాయం. పోర్ట్‌ల్యాండ్, మినె్నపోలిస్, లాట్వినావంటి సరస్సుల్లో ఏటా ఈ పోటీలను నిర్వహించడం ఆనవాయితీ. అందంగా రూపొందించే ఈ పడవలు చూడటానికి బాగుంటాయి.

09/03/2016 - 21:20

ఓ నదిలో కదులుతున్న నీటిలో ఓ వేదికపై సంగీత కచేరీ ఇస్తే ఎలా
ఉంటుందోనన్న ఆలోచన కొందరికి వచ్చింది. ఆలోచన వచ్చినదే తడవుగా ఓ అందమైన తేలియాడే వేదిక సిద్ధం చేశారు. బ్రెజిల్‌లోని మనౌస్ నగరంలో నీగ్రో నదిపై సిద్ధం చేసిన ఫ్లోటింగ్ డయాస్‌పై రాక్ అడ్ రియో మ్యూజిక్ కానె్సర్ట్‌ను అద్భుతంగా నిర్వహించారు. అమెజానియా వేడుకల్లో భాగంగా చేపట్టి ఈ సంగీత కార్యక్రమం వీనులవిందు చేసింది.

Pages