S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవీ .. ఇవీ..

08/12/2016 - 22:19

టీవీల్లో ఛానల్స్ మార్చుకోవడం కోసం మనం రిమోట్‌ను వినియోగిస్తున్నాంకదా. శునకాలకోసం కూడా అలా ఓ రిమోట్‌ను తయారు చేస్తే పోలా అనుకున్నారు కొందరు. ప్రస్తుతం ఆ పనిలనో పడ్డారు. మనం వాడే రిమోట్‌కన్నా చాలాపెద్దదిగా, శునకాలు తమ పాదాలతో అదమడానికి వీలుగా ఆ రిమోట్ పాడ్ ఉండేలా ప్లాన్ చేశారు. పైగా ఎక్కువ బటన్‌లుకూడా ఉండవు. అవి తేలికగా ఉపయోగించేలా తర్ఫీదు ఇస్తారుట కూడా.

08/06/2016 - 21:58

రష్యా రాజధాని మాస్కోలో ఈమధ్య చైనా సాంస్కృతిక సౌరభాన్ని చాటే ఉత్సవం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో చైనా కళాకారులు ఓ ప్రదర్శనలో ఇలా కన్పించారు. ఈ భంగిమలో భారతీయతకూడా కన్పిస్తోందికదూ!

08/06/2016 - 21:49

ఇక్కడ చిన్నపిల్లల విన్యాసాలు చూస్తే ఆశ్చర్యమేస్తోంది కదూ. శరీరాన్ని మెలికలు తిప్పి వారు చేసే వ్యాయామం చూపరులను ఆకట్టుకుంటోంది. మంగోలియాలో ఈ తరహా వ్యాయామశిక్షణ ఇచ్చే కేంద్రాలు కోకొల్లలు.

08/06/2016 - 21:47

ఫ్రాన్స్‌లోని నాంటెస్ రోడ్లపైకి ఉన్నట్లుండి ఓ భారీ సాలీడు దూసుకువచ్చింది. ఎనిమిది కాళ్లతో భయంకరమైన రూపంతో అది నడుస్తూ వస్తూంటే మొదట జనం భయపడ్డారు. తరువాత అది రోబో స్పైడర్ అని అర్థమయ్యాక దానిముందు నిల్చుని ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. కలప, ఉక్కుతో లెస్‌మెషిన్స్ నెల్లి అనే పరిశ్రమ యాజమాన్యం దీనిని రూపొందించింది. దీని బరువు 38 టన్నులు.

07/30/2016 - 21:52

సర్కస్‌లలో జంతువులతో ఆటాడించడం మామూలే! సాధారణంగా చింపాంజీలు, కోతులు, చిలుకలు, పులులు, సింహాలు, ఎలుగుబంట్లు, శునకాలతో ఆటలు అందరికీ తెలిసిందే. అయితే సైబీరియాలోని క్రిస్నోయాస్క్ నగరంలో నిర్వహిస్తున్న ఓ సర్కస్‌లో ఇలా నీటిఏనుగలతో చేయించిన విన్యాసం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

07/30/2016 - 21:50

హాలీవుడ్ చిత్రం ఘోస్ట్‌బస్టర్స్ చిత్రంలోని ఓ పాత్ర పేరు ‘స్టే పఫ్ట్ మార్షమల్లొ మ్యాన్’. ఆ సినిమాలో ఈ పాత్రలో కన్పించిన బొమ్మ ఎత్తు దాదాపు 112 అడుగులు. ఉన్నట్లుండి లండన్‌లోని వాటర్‌లూ స్టేషన్ రోడ్డును ఛిద్రం చేస్తూ ఇలా చొచ్చుకొచ్చాడేంటా అనుకోనవసరం లేదు. ఘోస్ట్‌బస్టర్స్ తాజా చిత్రం ప్రచారంకోసం ఈ ఏర్పాటు చేశారంతే!.

07/30/2016 - 21:48

దాదాపు 11 అడుగుల పొడవు, అరివీర భయంకరమైన కోరలతో భారీ నోళ్లు తెరచి చుట్టూ పదుల సంఖ్యలో చేరిన మొసళ్లకు కేవలం కొద్ది అడుగుల దూరంలో తిరిగితే ఎలా ఉంటుంది? ఆ అనుభూతికోసం తపించేవాళ్లు చైనాలోని ఓ మొసళ్ల సంరక్షణ కేంద్రానికి వెళ్లి ఇలా ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. చిన్ననీటి కుంటలో పదుల సంఖ్యలో భారీ మొసళ్లను పెంచుతున్నారు.

07/23/2016 - 22:57

వికారంగా కన్పిస్తున్న ఈ శునకం ‘జుగుప్సాకరంగా కన్పించే శునకాల’ పోటీలో ఛాంపియన్‌గా నిలిచింది. కాలిఫోర్నియాలో ఈమధ్య నిర్వహించిన వరల్డ్ అగ్లీయెస్ట్ డాగ్ కంటెస్ట్‌లో పాల్గొన్ని ఎట్టకేలకు తన లక్ష్యాన్ని సాధించింది. మూడో ప్రయత్నంలో దానికి ఛాంపియన్‌షిప్ దొరికింది.

07/23/2016 - 22:54

స్పెయిన్‌లో అతి వేడుకగా నిర్వహించే పండుగ యూరోపియన్ బెలూన్ ఫెస్టివల్. ఇటీవల అక్కడ నిర్వహించిన ఈ వేడుకలో ఆకాశంలో ఎగురుతూ అందరినీ విశేషంగా ఆకర్షించింది ఈ బెలూన్. యూరోప్‌కు చెందిన అనేక దేశాలు ఈ హాట్ బెలూన్ వేడుకకు హాజరయ్యారు.

07/23/2016 - 22:51

లోకో భిన్నరుచిః అంటే ఇదేమరి. ఇక్కడ ఫొటోల్లో కన్పిస్తున్నవి నిజమైన షూ కాదు...మొసలీకాదు. అవి ఓ చర్చ్, ఓ ఇల్లు. విభిన్నమైన రూపాల్లో భవనాలు నిర్మించుకోవాలన్న ఇష్టమే వీటిని రూపొందించడానికి కారణమైంది. తైవాన్‌లోని చైయయిలో స్థానిక ప్రభుత్వం స్వయంగా 4.5 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి షూ ఆకారంలో కన్పించేలా ఓ చర్చిని నిర్మించాలని నిర్ణయించింది. వెంటనే పనులూ మొదలెట్టి మూడునెలల్లో పూర్తిచేసింది.

Pages