S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవీ .. ఇవీ..

,
07/02/2016 - 21:08

సృజనాత్మకతకు అచ్చమైన ఉదాహరణలు ఇక్కడి ఫొటోలు. లేనిదానిని ఉన్నట్లు చూపడంలో దిట్ట స్వీడిష్ ఫొటోగ్రాఫర్, రీటచర్ ఎరిక్ జాన్సన్. మంచి ఫొటోగ్రాఫర్ కావడంతో అద్భుతమైన దృశ్యాలను తన కెమెరాలో బంధించి, ఆ తరువాత క్రియేటివిటీతో ఇలా మ్యాజిక్ చేయడం అతడికి అలవాటు. ఈ విద్యను ఎవరివద్దా అతడు నేర్చుకోలేదు. కేవలం ఆసక్తితో, తనకు తానుగా నేర్చుకున్నాడు.

06/25/2016 - 22:46

సృజనాత్మకతకు అచ్చమైన ఉదాహరణలు ఇక్కడి ఫొటోలు. లేనిదానిని ఉన్నట్లు చూపడంలో దిట్ట స్వీడిష్ ఫొటోగ్రాఫర్, రీటచర్ ఎరిక్ జాన్సన్. మంచి ఫొటోగ్రాఫర్ కావడంతో అద్భుతమైన దృశ్యాలను తన కెమెరాలో బంధించి, ఆ తరువాత క్రియేటివిటీతో ఇలా మ్యాజిక్ చేయడం అతడికి అలవాటు. ఈ విద్యను ఎవరివద్దా అతడు నేర్చుకోలేదు. కేవలం ఆసక్తితో, తనకు తానుగా నేర్చుకున్నాడు.

06/25/2016 - 22:45

ఈ పిల్లిని చూసి ముచ్చటపడని వారు లేరంటే నమ్మాలి. ముఖ్యంగా సోషల్ మీడియాలో దీని హవా స్పష్టంగా కన్పిస్తుంది. నెదర్లాండ్‌కు చెందిన జొనె్న స్మెర్స్ దీని యజమాని. దీని పేరు జోయ్. దీనికి ఓ తోబుట్టువుకూడా ఉంది. ఈ రెండింటిని ఓ జూనుంచి జొనె్న దత్తత తీసుకుని పెంచుకుంటున్నాడు. ఆ తరువాత వీటిలో జోయ్ ఫొటోను సోషల్ నెట్‌వర్క్‌లో పోస్ట్ చేశాడు. ఇక అంతే దాని పేరు మారుమోగిపోయింది.

06/25/2016 - 22:43

అప్పుడెప్పుడో విడుదలై ఇప్పటికీ జనాదరణ కలిగిన స్పైడర్‌మన్ సినిమాలు ఇప్పటికీ అందరికీ గుర్తే. ఆ చిత్రంలో హీరో వేసుకున్న డ్రెస్ చాలా పాపులారిటీ సంపాదించింది. ఇదిగో అశాంతితో రగిలిపోతున్న గాజాలో ఓ కుర్రాడు ఇప్పుడు ఓ స్పైడర్‌మన్ గా పేరు కొట్టేశాడు. ఆ పట్టణంలో నలుగురు కన్పించినచోట ఇదిగో..ఇలా మెలికలు తిరిగిపోతూ ఇచ్చే ప్రదర్శనలు, అతడు వేసుకున్న డ్రెస్‌తో అతడికి ఆ పేరు వచ్చేసింది.

06/18/2016 - 20:56

కళాకారుడి అద్భుత పనితనానికి ఈ ఆకృతులు ఓ చక్కటి ఉదాహరణలు. పెన్సిల్ కొనపై సృష్టించిన కళాఖండాలు ఇవి. బోస్నియా-హెర్జిగోవినాకు చెందిన జసెంకో జోర్జెవిక్ తనకు తానుగా ఈ పెన్సిల్ (గ్రాఫైట్) కొనలపై కళాఖండాలను తీర్చిదిద్దే కళను నేర్చుకున్నాడు. తుజ్లాలో ఈ మధ్య ఆయన ఓ ప్రదర్శన ఏర్పాటు చేసి తాను రూపొందించిన కళాఖండాలను ఉంచాడు. గాంధీజీ చెప్పిన ‘మూడుకోతులు’ కానె్సప్ట్‌ను జసెంకో ఎంతో అందంగా రూపొందించాడు.

06/18/2016 - 20:53

ఈ చిత్రంలో కనిపిస్తున్న అద్దాల వంతెనకు ఓ ప్రత్యేకత ఉంది. ప్రపంచంలో ఈ అద్దాల వంతెన అత్యంత ఎతె్తైనది, పొడవైనదికూడా. వంతెనపై నడవాల్సిన ప్రదేశం (అడుగుభాగం) అంతా మందమైన గాజుతో చేసినదే. చైనాలోని హూనన్ ప్రావిన్స్‌లో జాగ్జియాజీ గ్రాండ్ క్యానన్‌లో ఇది కన్పిస్తుంది. పర్యాటకులకు ఇది పెద్ద ఆకర్షణగా మారింది.

06/18/2016 - 20:51

ఈ సీగల్‌కు చికెన్ కర్రీపై మనసుపడింది. వేల్స్‌లోని ఓ చికెన్ రెస్టారెంటవద్ద తిరుగుతున్న ఈ పక్షి ఉన్నట్లుండి ఓ డస్ట్‌బిన్‌లో చికెన్ కర్రీని గమనించి అందులోకి దూకేసింది. తీరా దానికి చికెన్‌పీస్‌లు దొరకలేదు. కానీ చికెన్‌టిక్కా మసాలా గ్రేవీలో ఇది పూర్తిగా ములిగిపోయింది. తెల్లగా మెరిసిపోవాల్సిన సీగల్ మసాలా ఒంటపట్టించుకుని ఇదిగో ఇలా తయారైంది.

06/18/2016 - 20:47

ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీలో పలు ఉద్యానవనాలు, జంతుప్రదర్శన శాలలు నెల్లాళ్లుగా విద్యుద్దీప కాంతులతో మిలమిల మెరిసిపోతున్నాయి. ఏటా మే చివరివారంనుంచి జూన్ మూడోవారం వరకు ఈ వెలుగుల పండుగను జరుపుకుంటారు. కొత్త ఆలోచనలు, విద్యుత్‌కాంతులు, ప్రదర్శనలు ఈ వేడుక ప్రత్యేకతలు. సిడ్నీ ఒపెరాసహా ప్రధాన కూడళ్లన్నీ ఇలా మెరిసిపోతున్నాయి.

06/11/2016 - 20:53

పూలకుండీల్లో, గార్డెన్‌లో మొక్కలు పెంచడంలో మజా ఏముంది. ఇలా జీన్ ఫ్యాంట్ జేబుల్లోనూ మొక్కలు పెంచొచ్చు అంటున్నారు కొందరు ఔత్సాహికులు. పశ్చిమ లండన్‌లో ఇలా తీగలకు వేళ్లాడదీసిన బట్టల జేబుల్లో మొక్కలు పెంచడం ఇప్పుడు ఓ ఫ్యాషన్ అయిపోయింది.

06/11/2016 - 20:50

ఫ్యాషన్ ప్రపంచం ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. పూలతోటలోకి వచ్చిన ఓ మోడల్ ఇలా పూలపొదమాటునుంచి అందాలు ఆరబోస్తోంది. లండన్ ఫ్లవర్ షోలో ఆమె ఇలా కన్పించింది.

Pages