S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం

12/29/2018 - 17:25

పధ్నాలుగు వేల మంది క్రూరులైన రాక్షస శ్రేష్టు లు, ఖరుడు, దూషణుడు, త్రిశిరుడు- ఒంటరిగా యుద్ధం చేసిన శ్రీరాముడి చేతిలో చావడం చూసిన శూర్పణఖ- ఇతరులకు సాధ్యం కాని రాముడి పరాక్రమంగా స్వయంగా చూసి భయపడి, బొబ్బలు పెట్టుకుంటూ, ఏడ్చుకుంటూ, శీఘ్రంగా రావణుడు పాలించే లంకకు పోయింది.

12/22/2018 - 18:41

అకంపనుడు శ్రీరాముడి వధోపాయంగా సీతాపహరణం చేయమని ఇలా చెప్పాడు రావణుడితో. ‘ఓ అసురరాజా! రామచంద్రుడి భార్యైన సీత గురించి నేనేం చెప్పగలను? రాముడి గురించి వృత్తబాహుడని, వృషాంసుడని చెప్పాను కాని సీతాదేవి విషయం చెప్పడానికి నాకు సాధ్యం కాదు. అయినా చెప్పాలి కాబట్టి చెప్తాను. ఆమె అందం లాంటి అందం ముల్లోకాలలో ఎక్కడా లేదు. ఆమె నడక ఏనుగు నడకలా ఉంటుంది. నడి వయస్సులో ఉంది.

12/15/2018 - 17:25

జనస్థానం నుండి అకంపనుడనే రాక్షసుడు, రావణుడి వేగులవాడు, శీఘ్రంగా బయల్దేరి లంకకు పోయి, లంకాసురుడైన రావణాసురుడితో ఇలా అన్నాడు. ‘రాజా! జనస్థానంలో వున్న ఖరుడుతో సహా రాక్షసులందరూ యుద్ధంలో చంపబడాడరు. నేనెలాగో స్ర్తి వేషం వేసుకుని అతి కష్టం మీద ప్రాణాలను దక్కించుకుని ఈ వృత్తాంతాన్ని నీకు చెప్పడానికి వచ్చాను’. ఈ మాటలు విన్న రావణుడు అదిరిపడి, కళ్లల్లో నిప్పులు కురుస్తుంటే, ‘ఓరీ!

12/08/2018 - 18:19

ఇలా తనను నిష్ఠూరాలు ఆడుతున్న రామభద్రుడిని చూసి, అవి తన మేలు కొరకై చెప్పబడుతున్న మాటలని తెలుసుకోలేని ఆ ఖరుడు, ఇవన్నీ యుద్ధంలో సాధారణంగా చెప్పే బెదిరింపు మాటలని భావించి, కోపంతో కళ్లు ఎర్రచేసి నవ్వుతూ ఇలా అన్నాడు.

12/01/2018 - 18:45

యుద్ధంలో దూషణుడు, త్రిశిరుడు చావడం చూసి ఖరుడు తన గుండె ఝల్లుమనగా ఇలా అనుకున్నాడు. ‘ఆహా! ఇదేమి విక్రమం? ఔరా! ప్రసిద్ధికెక్కిన బలశాలులను పధ్నాలుగు వేల మందిని, దూషణుడిని, త్రిశిరుడుని ఒక్కడిని కూడా వదలకుండా ఒంటరిగానే రాముడు చంపాడు. ఏమి భయంకర బలం? నేనొక్కడినీ వీడికి లక్ష్యమా? అయినా కానిమ్ము.

11/24/2018 - 18:33

ఐదు వేల మంది కఠిన దేహాలు, మనస్సు కల రాక్షసులను రామభద్రుడిని చంపడానికి పంపాడు దూషణుడు. వాళ్లు వజ్ర సమానమైన శూలాలను, ఖడ్గాలను, బాణాలను వర్షంలాగా కురిపిస్తూ రాముడి మీదకు వస్తుంటే, ఆయన పరాక్రమించి తన బాణాలతో వారి ఆయుధాలన్నింటినీ ఖండించాడు. దూషణుడితో సహా సైన్యాన్నంతా దుఃఖ దశకు తీసుకొచ్చాడు. బాణ వర్షంతో వారందరినీ స్నానం చేయించాడు రాముడు.

11/17/2018 - 19:34

కోపంతో, శత్రు సంహారకుడిలా కనిపిస్తున్న యుద్ధ సన్నద్ధుడైన కోదండధరుడు శ్రీరామభద్రుడిని చూసిన ఖరుడు తన సారథితో ఆయన వున్న ప్రదేశానికి తన రథాన్ని పోనివ్వమన్నాడు. ఆయన అలా చెప్పగానే ఆయన చుట్టూ మూగిన రాక్షసులు సింహనాదాలు చేశారు. ఖరుడు ఆలస్యం చేయకుండా పదునైన బాణ పరంపరలను విస్తారంగా రాముడి మీదకు వేశాడు.

11/10/2018 - 18:25

లక్ష్మణుడు చేయాల్సిన పనేదో చెప్పాడు శ్రీరాముడు ఇలా: ‘సీతాదేవి ఇక్కడుంటే ఆమెకు వాళ్లు కీడు కలిగిస్తారు. కాబట్టి ఆమె ఇక్కడ ఉండకూడదు. ఒంటరిగా ఎక్కడికీ పంపకూడదు. నువ్వు ఆమెను పిల్చుకొని, విల్లు- బాణాలు ధరించి దట్టంగా వున్న చెట్ల గుంపులు కల కొండ గుహలోకి పొండి. ఆమెను లోపల వుంచి నువ్వు బయట కాపలాగా ఉండు. ప్రయాణంకండి తొందరగా. లేలే. నేనొక పని, నువ్వొక పని చేయాల్సి ఉంది. రెండూ ముఖ్యమైనవే కదా?’

11/03/2018 - 18:51

ఈ విధంగా రాక్షసులు యుద్ధ కాంక్షతో పోతుంటే, గాడిద రంగు కల మేఘం రక్తవర్షం కల నీళ్లను వానగా కురిసింది. రథానికి కట్టిన గుర్రాలు, ఎత్తుపల్లాలు, గుంటలు లేని సమానమైన ప్రదేశంలో పూలున్న చోట తటాలున జారిపడ్డాయి. సూర్యుడి చుట్టూ కొరివి చక్రంలాగా గుండ్రంగా, నల్లగా, అంచున ఎర్రగా, భయంకరంగా పరివేషం కనపడింది. బంగారు ధ్వజ దండం మీద గద్ద ఒకటి వాలి కూచుంది. మాంసం తినే జంతువులు వికార స్వరాలతో అరిచాయి.

10/27/2018 - 18:39

భయంకరంగా గట్టిగా ఏడ్చుకుంటూ, జనస్థానంలో వున్న ఖరాసురుడి దగ్గరకు వచ్చిన శూర్పణఖను (రాక్షస నాశనానికి కారకురాలు కాబోతున్న) చూసి ఖరుడు ఇలా అన్నాడు. ‘ఎందుకే మళ్లా ఏడుస్తూ వచ్చావు? నువ్వు కోరినట్లే, నీ ఇష్ట ప్రకారమే, మిక్కిలి శూరులైన రాక్షస శ్రేష్ఠులను నీ వెంట పంపాను కదా? ఇంకా ఎందుకు ఏడుస్తావు? ఆ పధ్నాలుగు మంది నేనంటే భక్తి కలవారు. చెప్పిన కార్యం చేయక మానరు. మిక్కిలి ధీరులు. అనురాగం కలవారు.

Pages