S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం

11/02/2019 - 19:24

అరణ్యకాండలో దీన సంరక్షణ అనే ధర్మాన్ని రామచంద్రమూర్తి అనుష్టించి చూపించాడు. కిష్కింధాకాండలో మిత్ర రక్షణ, అనుష్టించి చూపుతున్నాడు. పూర్వకాండలో జటాయువు లాంటి వారికి మోక్షమిచ్చి తన పరాత్పరత్వాన్ని వెల్లడి చేశాడు. ఈ కాండలో ఆయన అసంఖ్యాకమైన కళ్యాణ గుణాలలు చెప్పడం జరుగుతుంది. ప్రథమ కాండలో శరణాగతి మంత్రం అందులోని సీతాకళ్యాణం ద్వారా వివరించబడింది.

10/26/2019 - 18:20

చిలకపాటి విజయ రాఘవాచార్యులు గారి ఉపోద్ఘాతం: శ్రీరామ జయరామ కోదండరామ! కళ్యాణ గుణధామ! సీతారామ! సురవైరిగణభీమ! పట్ట్భారామ! శ్రీరామ జయరామ జయజయ రామ!!

10/19/2019 - 18:25

పడమటి దిక్కుగా పోతున్న రామలక్ష్మణులు దారిలో కొండలు, తీయటి పండ్లున్న అడవులు, చెట్లు చూసుకుంటూ పోయి కొండ దగ్గర ఆ రాత్రి గడిపి, సూర్యోదయం అవగానే పరిశుద్ధ జలాల పంపానదిని చూస్తూ తిరిగి ప్రయాణం కొనసాగించారు. పడమటి దిక్కున వున్నా ఒడ్డులో వెతికి అక్కడ శబరి వుండే రమ్యమైన ఆశ్రమాన్ని చూసి సమీపించారు. (పంప ఒడ్డున ఈ ఆశ్రమం ఇప్పటికీ వుందట.

10/12/2019 - 17:20

ఇంతదాకా రామలక్ష్మణులు దక్షిణ దిక్కుగానే ప్రయాణం చేశారు. తూర్పు, దక్షిణం, పడమర సముద్ర తీరాలలో ఆంధ్ర, పాండ్యాది దేశాలున్నాయి. కాబట్టి వాళ్లు తూర్పునకు పోలేదు. అదీకాకుండా కొండలు కూడా అడ్డం వస్తాయి అటుపోతే, జటాయువు కూడా దక్షిణం వైపే పొమ్మని సలహా నిచ్చాడు. ఈ మార్గానికి కిష్కింధ పడమరగా ఉంది. అంతేకాకుండా శబరి ఆశ్రమానికి పోవడానికి తూర్పు వైపు తప్ప మిగతా వైపున మార్గం లేదు. కొండలు అడ్డం వస్తాయి.

10/05/2019 - 18:30

కబంధుడు చెప్పిన మాటలు విన్న లక్ష్మణుడు వాడిన దహనం చేయడానికి సన్నాహాలు చేశాడు. అతడి శరీరాన్ని ఒక బిలంలో తోసి, ఎండు కట్టెలను పేర్చి, మండే కొరివి ఆ కట్టెల్లో వుంచి, అగ్నిని పురిగొల్పాడు. కొవ్వుతో నిండి, మాంసం ముద్దలాగా వున్న ఆ దేహాన్ని అగ్నిహోత్రుడు వేగంగా కాల్చకుండా మెల్లగా కాల్చసాగాడు.

09/28/2019 - 18:24

లక్ష్మణుడితో అతడి మనసు గట్టిపడే విధంగా మాట్లాడుతున్న రాముడిని చూసి కబంధుడు తనను చూసి వారెందుకు భయపడుతున్నారని అడిగాడు. వాళ్లను తన నోట్లో పడేట్లు బ్రహ్మ చేశాడని కూడా అన్నాడు. ఈ రాక్షసుడు మహా బలవంతుడనీ, భయంకర దేహం కల దుష్టుడనీ, ప్రపంచమంతా గెలవగల పరాక్రమం కలవాడిగా కనిపిస్తున్నాడనీ, కాబట్టి తమను మింగుతాడు కానీ వదలడని లక్ష్మణుడు అంటాడు. కబంధుడిని ఉద్దేశించి మాట్లాడుతూ, ‘మహాత్మా!

09/21/2019 - 18:49

జటాయువును సొదమీద పెట్టి, అగ్ని రగిలించి, తన తండ్రిలాగే ఆయనకూ నిప్పుపెట్టి జింక మాంసంతో పిండాలు చేశాడు. ఆ పిండాలను లేత పచ్చిక మీద వుంచి, బ్రాహ్మణులు స్వర్గప్రాప్తికోసం మనుష్య ప్రేతాలను ఉద్దేశించి ఏ మంత్రాలను చదువుతారో అవే చదివాడు. ఆ తరువాత గోదావరీ నదిలో తమ్ముడితో సహా స్నానంచేసి, జటాయువుకు నీళ్లు వదిలారు. మరణించిన గద్ద రాజు మహర్షి సమానుడైన రామచంద్రుడి చేత సంస్కారం పొంది పుణ్యలోకాలకు పోయాడు.

09/14/2019 - 18:35

జటాయువును సీత ఎక్కడున్నదని పదే పదే ప్రశ్నిస్తూ నేలమీద పడి మూర్ఛిల్లిన శ్రీరాముడు తేరుకుని, లేచి లక్ష్మణుడితో ఇలా అన్నాడు. ‘‘తమ్ముడా! మహోపకారం చేసిన ఈ పక్షిశ్రేష్ఠుడు నాకొరకు తెగించి యుద్ధం చేసి పడిపోయి కొనవూపిరితో వున్నాడు. మాట్లాడడానికి శక్తి కూడా లేదు. ఏదో ఒక మాట చెప్పినా స్వరం హీనంగా ఉంది’’. ఆ తరువాత జటాయువుతో ఇలా అన్నాడు. ‘‘ఓ గద్దరేడా! జటాయూ!

09/07/2019 - 18:16

శ్రేష్టమైన మంచి నీతి వాక్యాలను, వాటి అర్థాన్ని, చిన్నవాడైనా తమ్ముడు లక్ష్మణుడు చెప్పగా విన్న పెద్దవాడైన రామచంద్రమూర్తి, దాంట్లోని సారాన్ని గ్రహించి, కోపంతో లోగడ చేద్దామనుకున్న పనిని వదిలి, విల్లు ఆధారంగా నిలబడి, ‘నాయనా! లక్ష్మణా! సీతను వెదకడానికి ఏం చేయవచ్చు? ఎక్కడికి పోదాం?’ అని అడిగాడు. శోకతప్తుడైన రామచంద్రమూర్తి ఇలా అడగ్గా, లక్ష్మణుడు జవాబుగా ఇలా చెప్పాడు.

08/31/2019 - 18:57

శ్రీరాముడిని శాంతింప చేసే ప్రయత్నంలో లక్ష్మణుడు అన్నగారితో మరిన్ని విషయాలను చెప్తాడు. ఆయన పాదాల మీద పడి నమస్కరించి, ఇలా అంటాడు. ‘అన్నా! పూర్వజన్మలోనే కాకుండా ఈ జన్మలోనూ విస్తారంగా తపస్సు చేసి, ఎన్నో అశ్వమేథ యాగాలను చేసి, మరెన్నో గొప్ప పుణ్యకార్యాలను చేసి, మన తండ్రి అతి కష్టంతో దేవతలు అమృతాన్ని సంపాదించినట్లు నిన్ను కన్నాడు.’

Pages