S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం

05/11/2019 - 20:35

పరాక్రమవంతుడైన రావణుడు ఇంకో విల్లు తీసుకుని, బాణవర్షంలో జటాయువును ముంచేశాడు. బాణాల మధ్యలో పక్షిలాగా కాసేపున్న జటాయువు, తన రెక్కల వేగంతో వాటన్నిటినీ చెదరగొట్టి, బాణాలను, విల్లును తుంచాడు. అంతటితో ఆగకుండా జటాయువు రావణాసురుడి కవచాలను తన రెక్కల దెబ్బలతో పొడి పొడి చేసి నేల మీద పడేశాడు. బంగారు కవచాలలో ప్రకాశించే కంచర గాడిదల రథాన్ని నిలబడేశాడు.

05/04/2019 - 17:03

‘్ధర్మం అంటే ప్రీతికల రాజులు శాస్త్రం నిందించిన ధర్మ, అర్థ, కామాలకు ఆశపడరు. పులస్త్యుడంత గొప్పవాడికి మనుమడవై ధర్మజ్ఞానం తెలియకపోతే ఎలా? ధర్మార్థకామాలు చక్కగా తెలుసుకుని ధర్మాన్ననుసరించి మంచి పనులు చేసే రాజు పెద్ద నిధి లాంటివాడు. ధర్మం కానీ, పుణ్యం కానీ, పాపం కానీ రాజులు ఎలా చేస్తారో, ప్రజలు అలానే చేస్తారు. నువ్వు దొంగతనం చేస్తే నీ రాజ్యంలోని ప్రజలు కూడా అలానే చేస్తారు.

04/27/2019 - 19:47

రామలక్ష్మణులను తలచుకుంటూ ఏడుస్తున్న సీతాదేవికి, ఒక పెద్ద చెట్టు మీద వున్న గద్దరేడు జటాయువు కనిపించింది. రామవియోగ దుఃఖంతో, రామచంద్రమూర్తికి ఏమైందో అన్న భయంతో, బాధపడ్తూ వున్న సీత పెద్ద గొంతుతో గట్టిగా జటాయువును పిలిచింది. పిలుస్తూ.. ‘తండ్రీ! జటాయూ! ఇదిగో చూడు. ఈ పాపాత్ముడు రావణుడు క్రూరకార్యం తలపెట్టి, నేను ఏడుస్తున్నా వదలక, దయాహీనుడై దిక్కులేనిదానిలాగా నన్ను తీసుకుపోతున్నాడు.

04/20/2019 - 19:09

రావణుడికి కఠినంగా జవాబిస్తూ సీత, ‘ఏమిరా! దేవజాతులైన యక్షులకు, గుహ్యకులకు నాతుడై సర్వ భూతవంధ్యుడైన కుబేరుడి తమ్ముడివై, ఇలాంటి పాపపు పని చేయదల్చావు. ఛీ! సిగ్గులేనివాడా! ఇంద్రియాలను జయించలేని నిన్ను రాజుగా కలవారైనందున నీ మూలాన్న రాక్షసులందరూ చస్తారు. ఓరీ! ఇంద్రుడి భార్య శచీదేవిని అపహరించినా ఏదో ఒక విధంగా బతికితే బతకవచ్చేమో కానీ రామచంద్రమూర్తి భార్యను అపహరించి మళ్లీ బతకడం నీకు సాధ్యమా?

04/13/2019 - 18:46

తన కులం, బలం వర్ణిస్తూ రావణాసురుడు, సీతతో ఇలా అంటాడు. ‘చలించే జింక కళ్లదానా! ఈశ్వరుడి స్నేహితుడైన కుబేరుడికి నేను సహోదరుడిని. దశకంఠుడిని.. నీ మగడికి ఒకటే తల వుంటే, నాకు పది తలలున్నాయి. రావణుడు అనే సార్థక నామధేయం కలవాడిని. గంధర్వులు, పన్నగులు, గరుడులు నన్ను చూసి భయపడతారు.

04/06/2019 - 22:59

వాసుదాసు వ్యాఖ్యానం
*
అరణ్యకాండ
*

03/30/2019 - 18:55

బిక్షాపాత్ర, కమండలాలు ధరించి, బ్రాహ్మణ సన్న్యాసి వేషంలో ఉన్న రాక్షసుడిని, తనకు కీడుచేసే ఆలోచనలో వున్నవాడిని, విరోధించినా తాను గెలవలేని వాడిని, రాక్షసుడని తెలిసీ, బ్రాహ్మణుడిని పూజించిన విధంగానే ఆయననూ పూజించింది సీతాదేవి. ‘ఇదిగో దర్భాసనం.. ఇక్కడ కూర్చో. ఇదిగో అర్ఘ్యం.. ఇదిగో బాద్యం.. సర్వం సిద్ధం. ఇదిగో నీ ఆహారం కొరకు అడవిలోని పండ్లు..

03/23/2019 - 18:29

వినడానికి కూడా యోగ్యం కాని మాటలను జానకి లాంటిది పలకగా, జితేంద్రియుడైన లక్ష్మణుడు శరీరం గగ్గురపడగా, రెండు చేతులు జోడించి సీత వైపు తిరిగి, ఆమెకు బదులు చెప్పడానికి తన మనస్సు అంగీకరించడం లేదంటాడు. ఇంకా ఇలా అంటాడు. ‘నువ్వు నా పాలిట దేవతవని నా అభిప్రాయం. యోగ్యా యోగ్య విచారం చేయకుండా నోటికి వచ్చినట్లు కఠినంగా మాట్లాడడం స్ర్తిలకు కొత్త కాదు.

03/16/2019 - 17:59

సీతాదేవి తనను నిష్ఠూరాలు ఆడుతూ అంటున్న మాటలకు లక్ష్మణుడు జవాబు చెప్పాడు ఇలా. ‘వదినా! ఎందుకమ్మా ఇంతగా భయపడి దుఃఖపడతావు? నీ భర్తను యుద్ధంలో దేవతలు, మనుష్యులు, యక్షులు, సర్పాల రాక్షసులు, పిశాచాల నాయకులు, లేదా ఇంకెవరైనా నిలిచి పోరాడగలరా? వాళ్లకూ బతకాలని ఆశ వుండదా? ఎవరికైనా ప్రాణాలు చేదా? ఏది తీపి అంటే, ప్రాణాలే తీపి అనే సామెత లేదా? నీ నోట వచ్చిన మాటలు నువ్వు అనతగ్గవి కాదు.

03/09/2019 - 20:10

మూడు వంకరల విల్లు, బంగారు పిడికల బాకు, అంబుల పొదులు రెండు ధరించి శ్రీరాముడు ఆ మృగాన్ని పట్టుకోవడానికి వెంటనే బయల్దేరాడు. చేతిలో ధనుస్సు ధరించి వస్తున్న రాముడిని చూసి తనను చంపడానికి వస్తున్నాడని నిర్ణయించుకున్న మాయామృగం పారిపోతే రావణుడు చంపుతాడని భయపడింది. కాసేపు దూరంగా, కాసేపు చెట్ల గుంపులో దాక్కుంటూ రాముడికి కనిపించీ కనిపించకుండా తిరగసాగింది.

Pages