S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధనం మూలం

04/27/2019 - 20:09

చిన్నప్పటి కథలు కొన్ని మనకు ఇప్పటికీ గుర్తుంటాయి. మన ఆలోచనలపై ప్రభావం చూపుతాయి. ఒక వ్యక్తికి బంగారు నాణాల పాత్ర ఒకటి దొరుకుతుంది. ఆ పాత్ర కొద్దిగా ఖాళీగా ఉంటుంది. తన జీవితంలో ఊహించనంత బంగారం ఒకేసారి చూసే సరికి ఆ వ్యక్తికి మతిపోయినంత పనవుతుంది. ఆ బంగారు పాత్రను చూసి రకరకాలుగా ఆలోచిస్తాడు.

04/20/2019 - 19:27

‘‘ఈ రోజుల్లో కూడా కులాలు ఉన్నాయా? కులాలు, మతాలు మనం సృష్టించుకున్న కృత్రిమ గోడలు. నిజానికి ఇవేమీ లేవు.’’ చాలా మంది మేధావుల నుంచి ఇలాంటి మాటలు తరుచుగా వినిపిస్తుంటాయి. ఒకవైపు కుల సంఘాలకు నాయకత్వం వహిస్తూ మరోవైపు ఈ రోజుల్లో కూడా కులాలా? అని మనం నిర్మొహమాటంగా చెప్పగలం. కులాలు లేని సమాజం ఏర్పడాలని కోరుకుందాం తప్పు లేదు. కానీ అవి ఉన్నాయి అనేది వాస్తవం.

04/13/2019 - 18:58

‘‘మా ఇంటిపై నరదిష్టి పడింది. ఎవరి కన్నుకుట్టిందో కానీ ఇబ్బందులన్నీ మాకే. జీతం రాగానే అస్సలు డబ్బులు మిగలడం లేదు. పిల్లలు పెద్దవారవుతున్నారు. వారి చదువులు, ఇతర ఖర్చులు తలుచుకుంటే భయమేస్తుంది’’
‘‘మరేం చేద్దామనుకుంటున్నారు.?’’

04/06/2019 - 22:47

ప్రశ్న తప్పుగా అనిపిస్తుంది కదూ? నిజమే రిటైర్‌మెంట్ వయసును మనకు మనం నిర్ణయించుకోలేం. ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఆయా సంస్థలు నిర్ణయిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం అయితే ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రైవేటు ఉద్యోగం ఐతే ఆ కంపెనీ నిర్ణయిస్తుంది. ఇంతకు ముందు 58 ఏళ్లు రిటైర్‌మెంట్ వయసు ఐతే ఆంధ్రలో 60కి పెంచారు. 61కి పెంచనున్నట్టు తెలంగాణలో హామీ ఇచ్చారు.

03/30/2019 - 19:04

ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే పండు. పూరి జగన్నాథ్ సినిమాలోని ఈ డైలాగు తెలుగు నెలను ఒక ఊపు ఊపింది. ఇది అందరికీ తెలుసు కాని విషయం ఏమంటే ... చాలా మంది జీవితాల్లో ఇలా దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేట్టు చేసే పండుగాడు చాలా మంది జీవితాల్లో ఉంటారు. చివరకు ఆ డైలాగు రాసిన పూరి జగన్నాథ్ జీవితంలో కూడా ఉన్నాడు. తెలుగులో ఇప్పటి వరకు ఎవరూ సంపాదించనంత డబ్బు సంపాదించిన దర్శకుడు ఆయన.

03/23/2019 - 18:44

ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు. ఈ రెండూ చాలా కష్టమైన పనులు అనే ఉద్దేశంతో మన పూర్వీకులు ఈ మాటన్నారు. కానీ కాలం మారింది. అడిగి మరీ రుణాలు ఇచ్చే బ్యాంకుల వల్ల గృహ నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందింది. పాత రోజుల్లో ఐతే రిటైర్ అయ్యే టైంలో ఇళ్లు కడితే గొప్ప అన్నట్టుగా ఉండేది. ఈ కాలంలో ఉద్యోగంలో చేరిన కొత్తలోనే బ్యాంకు రుణాలతో చాలా మంది ఇండ్లు కట్టేస్తున్నారు.

03/16/2019 - 18:11

బ్బుకు సంబంధించి మీకు ఎలాంటి ఆలోచనలు వస్తాయి. మీ భవిష్యత్తు నిర్ణయించేది ఇలాంటి ఆలోచనలే. ఆలోచనలు సక్రమమైన మార్గంలో వెళుతున్నాయా? లేదా? మీకు మీరే తేల్చుకోండి.

03/09/2019 - 20:24

ప్రతి ఒక్కరూ సంపన్నులు కావాలని కోరుకుంటారు. ప్రశాంతమైన జీవితం, ఆర్థిక భద్రత అందరూ కొరుకుంటారు. దీనికి ఉద్యోగం బెటరా? వ్యాపారమా? అంటే మనలో ఎక్కువ మంది ఉద్యోగమే బెటర్ అంటారు. వ్యాపారం అంటే ఎన్నో సమస్యలు. ఎంతో రిస్క్. కానీ ఉద్యోగం అయితే నెల నెలా జీతం వస్తుంది. ఎలాంటి సమస్య ఉండదు అనుకుంటారు. చిన్నప్పటి నుంచే మనలో ఇలాంటి ఆలోచనలు ఏర్పడతాయి.

02/23/2019 - 19:06

ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్ర్తి ఉంటుంది అంటారు. విజయం సాధించిన స్ర్తి వెనుక ఐనా, పురుషుడి వెనక అయినా కచ్చితంగా లాంగ్ విజన్ ఉంటుంది. ఈ రోజు సంపాదించాం, ఈ రోజు అనుభవించాం, ఈ రోజు సుఖంగా గడిచింది అది చాలు ఆనే ఆలోచన ఉన్నవారి జీవితం గొర్రె తోక బెత్తెడు అన్నట్టుగానే ఉంటుంది. అలా కాకుండా దూరదృష్టితో భవిష్యత్తు గురించి ఆలోచించిన వారి జీవితం కచ్చితంగా మెరుగ్గా ఉంటుంది.

02/16/2019 - 18:32

బెస్ట్ ఇనె్వస్ట్‌మెంట్ ఏది అని అడిగితే మీరేం చెబుతారు? ఆలోచించండి.
ఒక్కోక్కరు ఒక్కో రకంగా చెబుతారు. రియల్ ఎస్టేస్, స్టాక్ మార్కెట్, బంగారం, బ్యాంకులో డిపాజిట్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇలా తమ అనుభవం మేరకు సమాధానం చెప్పవచ్చు. ఇవన్నీ నిజమే.కానీ వీటన్నిటి కన్నా విలువైన ఇనె్వస్ట్‌మెంట్ ఉంది? అంతే కాదు ఇవన్నీ విలువైనవే అని మనకు తెలిపేది ఏమిటి? అదే బెస్ట్ ఇనె్వస్ట్‌మెంట్.

Pages