S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/03/2016 - 06:34

వరంగల్, జూలై 2: వరంగల్ జిల్లాలో 8వ తేదీ నుంచి రెండువారాల పాటు జరుగనున్న హరితహారం కార్యక్రమంలో సమాజంలోని అన్ని వర్గాల వారిని భాగస్వాములను చేసి కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ అన్నారు. శనివారం వరంగల్ నుంచి జిల్లాలోని నియోజకవర్గ, మండల ప్రత్యేకాధికారులు, తహశీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

07/03/2016 - 06:34

నిజామాబాద్, జూలై 2: ఇకపై కేజ్‌వీల్స్‌తోనే రోడ్ల మీద యథేచ్ఛగా రాకపోకలు సాగించే ట్రాక్టర్లకు సంబంధించి అధికారులు కఠిన చర్యలు చేపట్టనున్నారు. రవాణా వ్యవస్థను మెరుగుపర్చాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం వందల కోట్ల రూపాయలను వెచ్చిస్తూ బి.టి రోడ్ల నిర్మాణాలు, మరమ్మతులు చేయిస్తుండగా, కేజ్‌వీల్స్ కారణంగా అవి ధ్వంసమవుతూ అనతికాలానికే శిథిలావస్థకు చేరుకుంటున్నాయి.

07/03/2016 - 06:34

శ్రీకాకుళం, జూలై 2: సరిహద్దులు దాటుకుంటూ ప్రయాణిస్తాయి. మూడు నెలలు విడిది చేస్తాయి. గుడ్లు పెట్టి పొదిగి పిల్లలు ఎదిగేదాక ఇక్కడే ఉండి, మళ్లీ తమ దేశాలకు ఎగిరిపోతాయి. ఇది శతాబ్దాలుగా సిక్కోల్ ప్రజలు తిలకిస్తున్న దృశ్యం. శ్రీకాకుళం జిల్లాలో సందడి చేయడానికి సైబీరియన్ పక్షులు వచ్చేశాయి. పక్షుల రాకతోనే వర్షాలు వస్తాయని ఇక్కడ ప్రజల నమ్మకం.

07/03/2016 - 06:32

న్యూఢిల్లీ, జూలై 2: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఉగ్రదాడిలో భారతీయ యువతి తరుషి మృతి చెందడం తనకు ఎంతో బాధ కలిగించిందని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ శనివారం ఒక ట్వీట్‌లో తెలిపారు. ఆమె తండ్రి సంజీవ్ జైన్‌తో తాను మాట్లాడానని, మన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశానని ఆమె తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో దేశం యావత్తు ఆ కుటుంబానికి అండగా నిలుస్తుందని ఆమె తెలిపారు.

07/03/2016 - 06:31

నిజామాబాద్, జూలై 2: తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల జాబితాలో కొనసాగుతున్న నిజామాబాద్ జిల్లాలో ఐఎస్‌ఐ కదలికలపై ఇటీవలి కాలంలో పోలీసు వర్గాల నిఘా సన్నగిల్లినట్టు కనిపిస్తోంది. రాష్ట్రంలోని ఏ మూలన, ఎలాంటి తీవ్రవాద సంఘటన జరిగినా దాని వెనుక ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నిజామాబాద్ జిల్లాకు సంబంధాలు ఉన్నట్టు అనేక సందర్భాల్లో వెల్లడైంది.

07/03/2016 - 06:31

హైదరాబాద్, జూలై 2: తెలంగాణలోని గ్రామాల్లో వేస్తున్న అంతర్గత పైప్‌లైన్లతోనే ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ వేయాలని ఆర్‌డబ్ల్యుయస్ ఇఎన్‌సి బి సురేందర్‌రెడ్డి అన్నారు. దీనికి సంబంధించి అవసరమైన డక్ట్‌లను కొనుగోలు చేయాలని వర్క్ ఏజెన్సీలకు సూచించారు. మిషన్ భగీరథ పనులపై అన్ని జిల్లాల ఎస్‌ఇలతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

07/03/2016 - 06:30

నల్లగొండ టౌన్, జూలై 2: రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థలో గత పది సంవత్సరాల నుండి పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పని లేదంటూ మార్చి నెల నుండి తొలగించినందునా వారంతా వారి కుటుంబాలతోపాటు రోడ్డున పడ్డారని, వారిని ఇతర శాఖలలో సర్దుబాటు చేసి కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ శనివారం జిల్లా పరిషత్ ఆవరణలో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డికి తెలంగాణ రాష్ట్ర హౌజింగ్ కార్పోరేషన్ ఔట్ సోర్సింగ్ ఎంప్లయిస్ యూనియన్

07/03/2016 - 06:30

హైదరాబాద్/ చార్మినార్, జూలై 2: ‘మా హైకోర్టు మాకు కావాలి.. దాన్ని సాధించుకునే వరకు పోరాడుతాం. న్యాయమైన మా నాలుగు డిమాండ్లను సాధించుకునే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదు. అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు, ఎంపీలు మా వెంటే ఉన్నారు. అవసరమైతే ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ధ ధర్నా చేస్తాం. పార్లమెంటునైనా ముట్టడిస్తాం..’ అని రిటైర్డ్ జడ్జిలు, న్యాయవాదుల జెఎసి ప్రతినిధులు అన్నారు.

07/03/2016 - 06:27

విశాఖపట్నం, జూలై 2: విజయవాడలో హిందూ దేవాలయాలను రాత్రికి రాత్రే కూల్చివేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అరిష్టం అని విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. రుషీకేష్‌లో చాతుర్మాస్య దీక్షలో ఉన్న స్వామి శనివారం ఒక ప్రకటన జారీ చేశారు. దేవాలయాల నిర్మాణమైనా, వాటిని తొలగించాలన్నా ఆగమశాస్త్రం ప్రకారమే జరగాలన్నారు.

07/03/2016 - 06:27

చౌటుప్పల్, జూలై 2: కాంగ్రెస్ పార్టీ అదిష్టానానికి పిసిసి ఛీఫ్ ఉత్తమ్ నాయకత్వంపై విశ్వాసముందని 2019వరకు పిసిసి నాయకత్వ మార్పు ఉండబోదని రాజ్యసభ సభ్యులు పాల్వాయి గోవర్థన్‌రెడ్డి అన్నారు. శనివారం చౌటుప్పల్‌లో విలేఖరులతో మాట్లాడుతూ 2019వరకు పిసిసి ఛీఫ్ పదవిపై ఆశపెట్టుకున్న వారికి భంగపాటు తప్పదంటూ పరోక్షంగా కోమటిరెడ్డి బ్రదర్స్‌కు తేల్చి చెప్పారు.

Pages