S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/03/2016 - 06:47

కడప,జూలై 2: జిల్లాలో ముస్లింలు రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో, సుఖశాంతులతో జరుపుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ కెవి సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. శనివారం కొత్త కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో రంజాన్ పురస్కరించుకుని ఏర్పాటుచేసిన శాంతికమిటీ సమావేశంలో కలెక్టర్, ఎస్పీ రామకృష్ణ పాల్గొన్నారు.

07/03/2016 - 06:47

కడప,జూలై 2: వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నుంచి గెలుపొందిన జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సి.ఆదినారాయణరెడ్డి, టి.జయరాములుపై స్పీకర్‌కు వైకాపా అధిష్ఠానం ఫిర్యాదు చేసిన దరిమిలా శనివారం స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆ ఫిర్యాదులను తిరస్కరించారు. దీంతో జమ్మలమడుగు ఎమ్మెల్యే సి.ఆదినారాయణరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే టి.జయరాములతోపాటు వారి అనుచరగణంలో ఆనందాని అవధులు లేవు.

07/03/2016 - 06:46

కడప,జూలై 2: రాష్ట్రప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి విశేష కృషి చేస్తుందని కలెక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. శనివారం స్థానిక నేక్‌నామ్‌ఖాన్ కళాక్షేత్రంలో చంద్రన్న రంజాన్‌తోఫాను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి సంక్షేమం కోసం కృషి చేస్తోందన్నారు. రాష్టవ్య్రాప్తంగా చంద్రన్న రంజాన్ కానుక అందజేయడం ముస్లింలకు ఎంతో సంతోషకరమైన విషయమన్నారు.

07/03/2016 - 06:45

కడప,(కల్చరల్)జూలై 2: రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరచిన సెయిల్ ఆధ్వర్యంలో రూ.20వేల కోట్లరూపాయలతో కడప జిల్లాలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుచేసేందుకు కేంద్ర ఉక్కుపరిశ్రమలశాఖ మంత్రి నరేంద్ర, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడులు హామీ ఇచ్చారని, ఇందుకోసం త్వరలో జిల్లాలో సెయిల్ టాస్క్ఫోర్స్ బృందం పర్యటిస్తుందని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర నాయకులు కందుల రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

07/03/2016 - 06:42

ఖమ్మం (కల్చరల్), జూలై 2: అధికార టిఆర్‌ఎస్‌పై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందని సిపిఎం రాష్ట్ర నాయకురాలు బుగ్గవీటి సరళ అన్నారు. సిపిఎం హావేలి కమిటీ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.

07/03/2016 - 06:40

ఖమ్మం(ఖిల్లా), జూలై 2: కాంట్రాక్ట్ కార్మికుల పట్ల మేయర్ అనుసరిస్తున్న ఏకపక్ష నిర్ణయాలు మానుకోవాలని సిఐటియు, ఇఫ్టూ నాయకులు విష్ణువర్ధన్, మందా వెంకటేశ్వర్లు అన్నారు. ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ కార్మికుల పట్ల మే యర్ అనుచిత నిర్ణయాలు తీసుకోవడంతో ఆందోళనకు గురవుతున్నారన్నా రు. 60 సంవత్సరాలు నిండిన కార్మికులను విధుల నుంచి తొలగించడం సరికాదన్నారు.

07/03/2016 - 06:39

ఖమ్మం, జూలై 2: ఉద్యమాలతో జిల్లాలు ఏర్పడవనే విషయాన్ని ప్రతిపక్షాలు గ్రహించాలని, ప్రజల అవసరాలు, సౌకర్యాలకు అనుగుణంగానే కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతుందని, దీనిపై రాద్ధాంతం అవసరం లేదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

07/03/2016 - 06:38

వరంగల్, జూలై 2: పంచాయతీరాజ్ శాఖ తరపున గ్రామాల్లో నిర్మించనున్న రహదారులపై ముందుగా గ్రామసభ పెట్టి సభలో వచ్చే సలహాలు, సూచనల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో సమావేశ మందిరంలో ఆయా శాఖలో పని చేస్తున్న ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు.

07/03/2016 - 06:36

వరంగల్, జూలై 2: వరంగల్ జిల్లా న్యాయస్థానం పోలీసు పహారా మధ్య నడుస్తోంది. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తూ.. అడ్వకేట్లు, న్యాయశాఖ ఉద్యోగులు వేర్వేరుగా చేస్తున్న ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. తెలంగాణ ప్రత్యేక హైకోర్టు, న్యాయమూర్తుల సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ.. గత 20 రోజులకు పైగా చేస్తున్న న్యాయవాదుల ఆందోళనకు న్యాయశాఖ ఉద్యోగులు తోడయ్యారు.

07/03/2016 - 06:35

వరంగల్, జూలై 2: మొక్కల పెంపక అవశ్యకతపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని శాంతి భద్రతల అదనపు డిజిపి, ఇన్‌చార్జి డిజిపి అంజనికుమార్ సూచించారు. ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యే రెండో విడత హరితహారం సందర్భంగా పోలీసు పక్షాన నిర్వహించే హరితహారంపై ఇన్‌చార్జి డిజిపి వరంగల్ పోలీసు కమిషనర్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Pages