S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/02/2016 - 21:13

టాలీవుడ్‌లో హిట్ అందించే హీరోయిన్‌గా ఎదిగిన రకుల్ ప్రీత్‌సింగ్ ప్రస్తుతం కాల్షీట్లు దొరకని కథానాయికగా ఎదిగింది. టాలీవుడ్ టాప్ హీరోలందరితో జోడీకడుతూ ఒక్క క్షణం తీరిక లేకుండా షూటింగులు చేస్తోంది. రకుల్ ప్రీత్‌సింగ్ ఇంత బిజీగా మారుతుందని మొదట ఎవరూ ఊహించలేదు. ఆమెతోపాటు తెరంగేట్రం చేసిన హీరోయిన్లు అందరూ అక్కడే ఉండిపోయారు.

12/02/2016 - 21:11

జె.వి.నాయుడు, రోషన్, రచనా స్మిత్ ప్రధాన తారాగణంగా శే్వతాక్రియేషన్స్ పతాకంపై జనార్దన్ శివలంకి దర్శకత్వంలో జాలే వాసుదేవనాయుడు రూపొందిస్తున్న చిత్రం ‘మనీ ఈజ్ హనీ’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేశారు. జి.వసంత్ అందించిన ఆడియోను హైదరాబాద్‌లో సి.కల్యాణ్ విడుదలచేసి తొలి కాపీని రాజ్ కందుకూరికి అందించారు. థియేటర్ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు.

12/02/2016 - 21:07

ధనుష్, రిచా గంగోపాధ్యాయ జంటగా ఓం శివగంగ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై శ్రీరాఘవ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘మిస్టర్ కార్తీక్’. ఈ చిత్రాన్ని కె.బాబూరావు, కె.మల్లికార్జున్‌లు తెలుగులో అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పాటల విడుదలై మ మంచి స్పందన పొందాయి.

12/02/2016 - 20:54

ఖయ్యూమ్, నందిని కపూర్ జంటగా షిర్డీ సాయి క్రియేషన్స్ పతాకంపై అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ దర్శకత్వంలో తాడి మనోహర్ కుమార్ రూపొందిస్తున్న చిత్రం ‘డర్టీగేమ్’. ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నారు.

12/02/2016 - 20:53

‘మంచి కథలు ఉన్న సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు చూడాలని అనుకుంటున్నారు. భాష అర్థం కాకపోయినా పొరుగు సినిమాలు చూడాలని ఆశిస్తున్నారు. ‘ప్రేమిస్తే’, ‘పిజ్జా’, ‘షాపింగ్‌మాల్’, ‘జర్నీ’ లాంటి బ్లాక్‌బస్టర్లు ప్రేక్షకుల్లో మారిన అభిరుచికి నిదర్శనం. ఆ తరహాలోనే వస్తున్న మరో సినిమా ‘మెట్రో’. ‘జర్నీ’ని మించి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టే చిత్రమిది’ అని అన్నారు హీరో నందు.

12/02/2016 - 20:51

విన్ను మద్దిపాటి, అక్షత జంటగా అఛీవర్ సిగ్నేచర్ ఎం.ఎఫ్.క్రియేషన్స్ పతాకంపై అక్షత దర్శకత్వంలో మద్దిపాటి సోమశేఖరరావు, మధుఫోమ్రా రూపొందించిన చిత్రం శేఖరం గారి అబ్బాయి. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని విడుదలకు ముస్తాబవుతోంది.

12/02/2016 - 20:49

యువ కథానాయకుడు జై, అంజలి జంటగా 70 ఎం.ఎం. ఫిలింస్ పతాకంపై టి.ఎస్.అరుణ్ బాలాజీ, కందస్వామి నందకుమార్ రూపొందించిన చిత్రం ‘బెలూన్’. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది.

12/02/2016 - 20:47

ప్రతీక్, శ్రావ్య, శ్రీసయ్యాని ప్రధాన తారాగణంగా రాహుల్ ప్రేమ్ మూవీ మేకర్స్ పతాకంపై ప్రతీక్ ప్రేమ్‌కరణ్ దర్శకత్వంలో లంకా కరుణాకర్‌దాస్ రూపొందిస్తున్న చిత్రం వానవిల్లు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు.

12/02/2016 - 05:30

ఒంగోలు, డిసెంబర్ 1: పెద్దనోట్ల రద్దు నేపధ్యంలో ఆర్థిక లావాదేవీలన్నీ డిజిటల్ పేమెంటు రూపంలోకి తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ నీతి అయోగ్ సిఇఒ అమితాబ్ సింగ్ జిల్లాకలెక్టర్లను ఆదేశించారు. గురువారం న్యూఢిల్లీ నుండి జిల్లాకలెక్టర్లతో డిజిటల్ చెల్లింపులపై వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకు ఖాతాలన్నింటిని ఆధార్‌తో అనుసంధానం చేయాలన్నారు.

12/02/2016 - 05:28

నెల్లూరు, డిసెంబర్ 1: కరెన్సీ కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పెద్దనోట్ల రద్దు ప్రభావం వృద్ధులు వికలాంగుల పింఛన్లపై పడింది. ప్రతినెల ఇంటి వద్దకు వచ్చి పింఛన్లు అందించే విధానానికి స్వస్తి చెప్పి నవంబర్ నెల పింఛన్లు బ్యాంకు ఖాతాలోనే వేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో వృద్ధులు, వికలాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Pages