S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/23/2016 - 22:07

వెంకటాచలం, సెప్టెంబర్ 22: మండల పరిధిలోని చెముడుగుంటకు చెందిన పామూరు కృష్ణారెడ్డి ఇంటిలోకి గుర్తుతెలియని దుండగులు ప్రవేశించి ధ్వంసం చేశారు. ఈ సంఘటనలో సుమారు రూ.30 లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. గత కొద్ది నెలల క్రితం ఇదే గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకుడు రవికుమార్ యాదవ్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే.

09/23/2016 - 22:06

నెల్లూరు, సెప్టెంబర్ 22: ఖాళీ స్థలాల్లో నీటి నిల్వలు, తాగి పారేసిన కొబ్బరిబొండాల నిల్వలు, కాలనీల్లో పేరుకుపోయిన చెత్తకుప్పలు, కాలువల ఆక్రమణలతో రహదారులపైనే మురుగునీరు ప్రవాహంతో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా తయారైంది. ఈక్రమంలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా మారడంతో దోమల సంతతి పెరిగిపోయి నెల్లూరు నగర ప్రజలను దడ పుట్టిస్తున్నాయి. గత రెండేళ్లలో పారిశుద్ధ్యానికి రూ.కోట్లు నిధులు ఖర్చు చేశారు.

09/23/2016 - 22:06

నెల్లూరుసిటీ, సెప్టెంబర్ 22: బారాషాహిద్ దర్గాలో జరిగే రొట్టెల పండుగ సందర్భంగా స్వర్ణాల చెరువులో జరిగే ఘాట్ పనులను రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ గురువారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ, విదేశాల నుండి కుల, మతాలకు అతీతంగా రొట్టెల పండుగకు దాదాపు 10 లక్షల మంది భక్తులు వస్తారని అన్నారు. ఈ పండుగకు రాష్ట్ర గుర్తింపు తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

09/23/2016 - 22:06

నెల్లూరుటౌన్, సెప్టెంబర్ 22 : దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ఖాదీ వస్త్రాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఖాదీ, గ్రామీణ పరిశ్రల దక్షిణ రాష్ట్రాల చైర్మన్ జి.చంద్రవౌళి పేర్కొన్నారు.

09/23/2016 - 22:05

నెల్లూరు కలెక్టరేట్, సెప్టెంబర్ 22: జిల్లాలో స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు కార్యక్రమాల అమలులో నిర్ధేశించిన లక్ష్యాలను పూర్తిచేయాలని కలెక్టర్ రేవు ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న తన ఛాంబర్‌లో ఆకర్షణీయ గ్రామాలు, వార్డుల కార్యక్రమాల అమలుపై గురువారం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

09/23/2016 - 22:05

నెల్లూరు కలెక్టరేట్, సెప్టెంబర్ 22: దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో గురువారం ఆయన దోమలపై దండయాత్ర, పరిసరాల పరిశుభ్రతపై ముద్రించిన పుస్తకాన్ని విడుదల చేశారు.

09/23/2016 - 22:03

కోవూరు, సెప్టెంబర్ 22: సిఎంఆర్ ధాన్యం సేకరించిన మిల్లర్లు ఇంకా గత సీజన్‌కు సంబంధించి దాదాపు 25 వేల టన్నుల బియ్యం ప్రభుత్వానికి బకాయి ఉన్నా వారిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని కోవూరు నియోజకవర్గ లోక్‌సత్తా పార్టీ ఇన్‌చార్జ్ నెల్లూరు నరసయ్య పేర్కొన్నారు.

09/23/2016 - 22:03

వెంకటగిరి, సెప్టెంబర్ 22: వేలాది భక్తకోటి మధ్య గురువారం సాయంత్రం వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ నిమజ్జనోత్సవం వైభవంగా ముగిసింది. ప్రతియేటా మాదిరిగా సాంప్రదాయబద్ధంగా అత్యంత వైభవంగా జాతర జరిగింది. బుధవారం రాత్రి అమ్మవారి ప్రతిమను పుట్టినిల్లయిన కుమ్మరివీధిలో తయారుచేసి అక్కడ రాత్రి పదకొండు గంటల వరకు ఉంచారు. అక్కడ నుంచి అమ్మవారిని అత్తవారి ఇల్లయిన జీనిగలవారి వీధికి నిరాడంబరంగా తీసుకెళ్లారు.

09/23/2016 - 22:01

హిందూపురం టౌన్, సెప్టెంబర్ 22 : పట్టణంలో ముగ్గురికి డెంగ్యూ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న 35 మందికి, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న మరో ఐదుగురికి డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పట్టణంలోని అహ్మద్‌నగర్‌కు చెందిన ఒకరికి, మడకశిర ప్రాంతానికి చెందిన ఇద్దరికి డెంగ్యూ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు.

09/23/2016 - 22:01

అనంతపురం, సెప్టెంబర్ 22 : ఖరీఫ్‌లో సాగు చేసిన వేరుశెనగ పంట తొలగింపు పూర్తి కానున్న నేపథ్యంలో అక్టోబర్ 1 నుంచి ఉచిత భూసార పరీక్షలు నిర్వహించేందుకు భూసార పరీక్ష కేంద్రం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈఏడాది డిసెంబర్ వరకూ 58వేల శ్యాంపిల్స్ (మట్టి నమూనాలు) పరీక్షించి ఇందుకు సంబంధించిన కార్డులు అందించేందుకు చర్యలు చేపడుతున్నారు.

Pages