S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/23/2016 - 22:24

యడ్లపాడు, సెప్టెంబర్ 22: అల్పపీడనం కారణంగా కురిసిన భారీవర్షానికి యడ్లపాడు మండలంలోని పలు గ్రామాలు నీట మునిగాయి. మండలంలోని వివిధ గ్రామాలకు వెళ్లే లింకురోడ్లు జలమయం కావడం వల్ల వాగులు పొంగుతుండటం వల్ల జాతీయ రహదారికి పడమటి వైపు గ్రామాలకు మండల కేంద్రంతో రాకపోకలు నిలిచిపోయాయి. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు పడిపోయాయి.

09/23/2016 - 22:24

నకరికల్లు, సెప్టెంబర్ 22: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నకరికల్లు మండలం అతలాకుతలమైంది. ఇప్పటివరకు ఇంత వర్షాన్ని చూడలేదని పలువురు తెలిపారు. డివిజన్‌లోనే రికార్డు స్థాయిలో 241.4 మిమీ వర్షపాతం గురువారం ఉదయం 7.30 గంటలకు నమోదైనట్లు తహశీల్దార్ లీలా సంజీవ్‌కుమార్ తెలిపారు. గత 100 సంవత్సరాల నుండి ఇంత భారీ వర్షం కురిసినట్లు దాఖలాలు లేవని పలువురు వృద్ధులు పేర్కొన్నారు.

09/23/2016 - 22:24

మేడికొండూరు, సెప్టెంబర్ 22: గత మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలతో పలు గ్రామాలను వ రదనీరు చుట్టుముట్టగా... పంట పొ లాలు నీటిలో నానుతున్నాయి. గ్రామ శివారు కాలనీల్లోని గృహాల్లో నీరు ప్రవేశించింది. వరద కారణంగా గుంటూ రు- సత్తెనపల్లి రహదారిలోని మేడికొండూరు వద్ద నూతనంగా నిర్మిస్తున్న రెండు వంతెనల వద్ద తాత్కాలికంగా వేసిన అప్రోచ్ రోడ్లు తీవ్రంగా దెబ్బతిని, గండి పడింది.

09/23/2016 - 22:22

అమలాపురం, సప్టెంబర్ 22: నవ్యాంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో చర్చించినట్లు పిసిసి ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు తెలిపారు. గురువారం రాత్రి ఆయన కాన్పూర్ నుండి ఫోన్‌లో ఆంధ్రభూమితో మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో రాష్ట్ర ప్రత్యేక హోదా అంశాన్ని చర్చించినట్లు గిడుగు తెలిపారు.

09/23/2016 - 22:22

విఆర్ పురం, సెప్టెంబర్ 22: మండలంలో కాళ్ల వాపుల రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో విశాఖపట్నం కింగ్‌జార్జి హాస్పటల్ ప్రొఫెసర్ల బృందం గురువారం రోగులపై పరిశోధన నిర్వహించారు. ఈ ప్రొఫెసర్ల బృందం స్థానిక రేఖపల్లిలోని ప్రభుత్వ వైద్యశాలను సందర్శించి, ఆసుపత్రిలో ఉన్న రోగులను పరిశీలించారు. వ్యాధి లక్షణాలు, వారి ఆహారపు అలవాట్లు తదితర వివరాలన్నింటినీ సేకరించారు.

09/23/2016 - 22:21

కాకినాడ సిటీ, సెప్టెంబర్ 22: వివిధ కార్పొరేషన్‌ల ద్వారా లబ్దిదారులకు ఉపాధి యూనిట్లు, స్వయం సహాయ సంఘాల ఆర్ధిక కార్యక్రమాలు, చిన్నతరహా వ్యాపారాలు, వృత్తిదారులకు రుణాల కల్పనకు బ్యాంకులు మరింత చొరవతో ముందుకురావాలని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ బ్యాంకర్లకు పిలుపునిచ్చారు.

09/23/2016 - 22:21

డి గన్నవరం, సెప్టెంబర్ 22: మండల పరిధిలో నరేంద్రపురం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి గురువారం ఉదయం తరగతిలో పాముకాటుకు గురయ్యాడు. అంబాజీపేట గ్రామానికి చెందిన బీర సురేష్ గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. ఉదయం చదువుకునేందుకు బ్యాగ్‌లో పుస్తకాలు తీస్తుండగా పుస్తకాల మధ్యలో ఉన్న కట్లపాము కరవడంతో అస్వస్థతకు గురయ్యాడు.

09/23/2016 - 22:20

కొత్తపేట, సెప్టెంబర్ 22: కొత్తపేట శివారు ఏనుగుల మహల్ వద్ద ఒక ఇంటి వద్ద క్షుద్రపూజలు చేస్తుండగా గ్రామస్థులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గ్రామానికి చెందిన ఒక కుటుంబానికి చెందిన వారు కపిలేశ్వరపురానికి చెందిన ఒక వ్యక్తితో కొన్ని రోజులుగా ఇంటి వద్ద పూజ చేస్తుండగా విషయం తెలుకున్న గ్రామస్థులు భయంతో వారిని పట్టుకుని నిలదీశారు.

09/23/2016 - 22:20

కొత్తపేట, సెప్టెంబర్ 22: కొత్తపేట రెడ్డి అనసూయమ్మ ఇండోర్ షటిల్ కోర్టులో జరుగుతున్న రాష్టస్థ్రాయి అండర్ 19 బాలబాలిక షటిల్ పోటీలు రెండవ రోజు హోరాహోరీగా సాగాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి క్రీడాకారులు ఈ పోటీలల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో తొలిసారిగా కొత్తపేటలో ఈ పోటీలు జరుగుతున్నాయి. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సహకారంతో పోటీలను నిర్వహిస్తున్నారు.

09/23/2016 - 22:19

కాకినాడ రూరల్, సెప్టెంబర్ 22: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిఎంఅండ్ హచ్‌ఓ చంద్రయ్య కోరారు. ఈ మేరకు ఆయన కాకినాడ రూరల్‌లోని మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులులతో జరిగిన సమీక్షలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

Pages