S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/23/2016 - 22:19

మండపేట, సెప్టెంబర్ 22: కుల ఘర్షణలలో పాల్గొని యువత తమకు సంబంధించిన ఎంతో విలువైన భవిష్యత్తును అంధకార బంధురం చేసుకోవద్దని జిల్లా ఎస్పీ డాక్టర్ ఎం రవిప్రకాష్ హెచ్చరికతో కూడిన సూచన చేశారు. కుల ఘర్షణలలో పాలుపంచుకునేవారు ఎంతటి వారైన పోలీసు యంత్రాంగం విడిచిపెట్టదని, తీవ్ర సంఘటనలకు పాల్పడే వారిపై కేసులు బనాయించడమే కాకుండా, రౌడీషీట్లు ఓపెన్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

09/23/2016 - 22:18

కోరుకొండ, సెప్టెంబర్ 22: బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో కోరుకొండ మండలంలో భారీ వర్షాలు కురిసాయి. రాజమహేంద్రవరం - భద్రాచలం రోడ్డులోని గాడాల వద్ద రహదారిపైకి భారీగా నీరు చేరింది. దీంతో రహదారికి ఇరువైపులా భారీ ఎత్తున రాకపోకలు స్తంభించాయి. పలు వాహనాలు బారులుతీరి నిలిచిపోయాయి. రోడ్డుపై మొలలోతు నీరు ప్రవహించడంతో బైక్స్, ఆటోలు, బస్సులు తదితర వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

09/23/2016 - 22:17

తిరుపతి, సెప్టెంబర్ 22: తిరుపతి నగరానికి నీటిని సరఫరాచేసే తెలుగుగంగ ప్రధాన పైప్‌లైన్‌కు అనుసంధానమైన రామాపురం పంప్ హౌస్‌లో కొత్తమోటార్లు అమర్చుతున్న కారణంగా తిరుపతి నగరంలో ఈనెల 24న నీటి సరఫరా ఉండదని ఎస్ సి సుధాకర్‌రావు గురువారం ఒక ప్రకటనలోతెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి తగునీటిని నిల్వ ఉంచుకోవాలన్నారు.

09/23/2016 - 22:17

ఏర్పేడు, సెప్టెంబర్ 22: చిత్తూరు, నెల్లూరు, కడపజిల్లాల్లోని ప్రజలు, రైతులు, నిరుద్యోగులకు ఎంతగానో మేలుచేసే మన్నవరం భెల్ ప్రాజెక్టు కు సంబంధించిన రెండోదశ పనులను నెలలోపు ప్రారంభించకపోతే గ్రామస్థాయిలో ప్రజలను చైనత్యం చేసి ఉద్యమిస్తానని, తిరుపతిలో సభ కూడా ఏర్పాటుచేస్తానని తిరుపతి మాజీ ఎంపి చింతామోహన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తీవ్రస్వరంతో హెచ్చరించారు.

09/23/2016 - 22:16

తిరుపతి, సెప్టెంబర్ 22: తిరుపతిలో అక్టోబర్ 23న ఏడుకొండలు పరుగుపందెం (సెవన్‌హిల్స్ మారథాన్) రాత్రి సమయంలో నిర్వహించడానికి సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు మారధాన్ అధికారి సుశాంత్ సుబుధి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈకార్యక్రమంలో వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొంటారని ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరవుతారన్నారు.

09/23/2016 - 22:15

తిరుపతి, సెప్టెంబర్ 22: ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇ ఎస్ ఎల్ నరసింహన్ ఈనెల 25,26 తేదీలలో జిల్లాలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 25వ తేదీన హైదరాబాద్ నుంచి స్పైస్ జెట్ విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు తిరుపతి విమానాశ్రయంకు చేరుకుంటారు.

09/23/2016 - 22:15

చిత్తూరు, సెప్టెంబర్ 22: జిల్లా వ్యాప్తంగా శనివారం తహశీల్దార్ కార్యాలయాల్లో రేషన్‌మేళా కార్యక్రమం నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గిరీషా ఆదేశించారు. గురువారం చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో సివిల్‌సప్లై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ డీలర్ షాపుల్లో నెలకొన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే విధంగా ఈమేళాలో తహశీల్దార్లు చర్యలు తీసుకోవాలన్నారు.

09/23/2016 - 22:14

తిరుపతి, సెప్టెంబర్ 22: ఎపిఎస్‌పిడిసిఎల్ పరిధిలో పరిశ్రమలు విద్యుత్ సర్వీసుల కోసం ఇకపై సాధ్యతా ధ్రువీకరణ పత్రాన్ని పొందాల్సిన అవసరంలేదని ఎపిఎస్‌పిడిసిఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హెచ్ వై దొర గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

09/23/2016 - 22:14

తిరుపతి, సెప్టెంబర్ 22: రోగుల భద్రతను దృష్టిలో ఉంచుకొని స్విమ్స్ ఆసుపత్రిలో అగ్నిప్రమాద నిరోధక ఏర్పాట్లకు స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ టి ఎస్ రవికుమార్ శ్రీకారం చుట్టారు. ఈనేపథ్యంలో గురువారం ఫైర్‌ఫైటింగ్ సిస్టమ్ ఇన్సులేషన్ పనులకు పూజలు నిర్వహించి ఆయన ప్రారంభించారు.

09/23/2016 - 22:13

కల్లూరు, సెప్టెంబర్ 22: పారిశుద్ధ్యంపై అలసత్వం వద్దని ఎంపిడిఓ సౌభాగ్యం తెలిపారు. పులిచెర్ల మండలం రెడ్డివారిపల్లి పంచాయతీ నవాబుపేటలో గురువారం పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన సదస్సును ఏర్పాటుచేశారు. ఈసందర్భంగా ఎంపిడిఓ మాట్లాడుతూ పారిశుద్ధ్యం లోపించకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతోందని, అంటువ్యాధులపట్ల ప్రజలు చైతన్యంగా ఉండాలన్నారు.

Pages