S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/23/2016 - 22:30

సిద్దవటం, సెప్టెంబర్ 22:ప్రభుత్వం కడప జిల్లాను మలేరియా హెల్త్ ఏమర్జెన్సీగా ప్రకటించినట్లు కలెక్టర్ సత్యనారాయణ వెల్లడించారని జాతీయ కీటక జనిత నిర్మూలన అధికారి త్యాగరాజు తెలిపారు. మండల కేంద్రమైన సిద్దవటం సబ్ యూనిట్ కార్యాలయాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

09/23/2016 - 22:29

కడప, సెప్టెంబర్ 22:ప్రభుత్వమేమో ఆహార ఉత్పత్తులకు అధిక ప్రాముఖ్యత కల్పించాలంటూ జిల్లాలో వేరుశెనగ తర్వాత ప్రధాన పంట అయిన ఈ ఏడాది వరిసాగుకు ఉరి పడి రైతులు ఆందోళన చెందుతున్నారు. కేవలం వరిసాగుకు కొన్ని ప్రాంతాలకే వర్షాలు పరిమితమయ్యాయి. అన్ని ప్రాంతా ల్లో అరకొర సాగుచేశారు. జిల్లా వ్యాప్తంగా వరికి తెగుళ్లు సోకి వేలాది ఎకరాల పంటలు ఎండుతున్నాయి.

09/23/2016 - 22:29

కడప(కల్చరల్), సెప్టెంబర్ 22:కడప నగరం విశ్వనాథపురంలో వెలసివున్న మైసూరుకు చెందిన శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమంలో గురువారం ఉదయం కొత్తగురు నిలయాన్ని శ్రీదత్తవిజయానంద తీర్థస్వామిజి ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలుత స్వామిజీ శ్రీచక్రపూజ, రుద్రహోం నిర్వహించారు. పైకార్యక్రమాల్లో నగరంతోపాటు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

09/23/2016 - 22:28

కడప(కల్చరల్),సెప్టెంబర్ 22:వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యం మేరకు 182 గ్రామాల్లో 42వేలు అక్టోబర్ 31లోగా పూర్తి చేయాలని ఎంపిడిఓలను కలెక్టర్ కెవి సత్యనారాయణ ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌హాల్‌లో ఆర్డీఓలు, మండల అభివృద్ధి అధికారులు, మండల ప్రత్యేక అధికారులతో కలెక్టర్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.

09/23/2016 - 22:28

కడప(కలెక్టరేట్), సెప్టెంబర్ 22:కాపులతో సహా 11 కులాలను బిసి జాబితాలో చేర్చాలన్న వినతులపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన జస్టిస్ మంజునాథ్ కమిషన్ ఈనెల 26న కడపకు రానుంది. జడ్పీ సమావేశ మందిరంలో మూడురోజులపాటు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. జిల్లాలోని వివిధ సంఘాల తరపున వినతులు స్వీకరిస్తారు.

09/23/2016 - 22:27

కడప, సెప్టెంబర్ 22:జిల్లాలో రుతుపవనాలు వల్ల వర్షాలు బాగా కురుస్తుండటంతో ఈ ఏడాది ఇప్పటి వరకు రైతులు 1.75లక్షల హెక్టార్లలో పంటసాగు చేస్తున్నారని, బ్యాంకర్లు రైతులకు రుణాలందించడంలో లక్ష్యాలను 120 శాతం అధిగమించి సాధించాల్సిందిగా కలెక్టర్ కెవి సత్యనారాయణ బ్యాంకర్లకు సూచించారు.

09/23/2016 - 22:27

కమలాపురం, సెప్టెంబర్ 22: గతవారం మండలపరిధిలోని గంగవరం రోడ్డులో మోటర్‌సైకిల్‌పై వెళుతున్న తిరుపాలయ్య మరో వాహనాన్ని ఢీకొని తీవ్ర గాయాలకు గురై తిరుపతి స్విమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. తిరుపతి ఔట్‌పోస్ట్ పోలీసుల నుంచి సమాచారం అందడంతో పోస్టుమార్టం నిమిత్తం అక్కడికి వెళ్లి కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు.
మహిళలకు తీవ్రగాయాలు

09/23/2016 - 22:26

మంగళగిరి, సెప్టెంబర్ 22: క్రికెట్‌లో టీం ఇండియాను నెంబర్ వన్‌గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని జాతీయ సీనియర్ భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్ మన్నవ శ్రీకాంత్ ప్రసాద్ (ఎంఎస్‌కె ప్రసాద్) అన్నారు.

09/23/2016 - 22:25

అమరావతి, సెప్టెంబర్ 22: అమరావతి-క్రోసూరు రహదారిలో జూపూడి, మునగోడు గ్రామాల మధ్య గల నక్కలవాగు, ఎద్దువాగులు ప్రమాదస్థాయిలో పొంగిపొరలి రాకపోకలకు అంతరాయం కల్గించాయి. సత్తెనపల్లి, పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీవర్షాల మూలంగా ఒక్కసారిగా వాగుల ప్రవాహం పొంగిపొరలడంతో జూపూడి, మునగోడు గ్రామాలకు చెందిన ఐదుగురు రైతులు ప్రవాహంలో కొట్టుకుపోయి సమీపంలో ఉన్న చెట్లు పట్టుకుని ప్రాణాలు దక్కించుకున్నారు.

09/23/2016 - 22:25

బెల్లంకొండ, సెప్టెంబర్ 22: అల్పపీడన ప్రభావంతో బుధవారం నుండి కురుస్తున్న భారీవర్షాలకు బెల్లంకొండ మండలం చిగురుటాకులా వణికింది. 8 గంటల పాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు, కుంటలు, చెరువులు కలిసిపోయాయి. ఈ క్రమంలో నాగిరెడ్డిపాలెం, ఊతవాగు, నాగమ్మచెరువు, మనె్నసుల్తాన్‌పాలెం, బంగారు నత్తవాగు, నందిరాజుపాలెం రెడ్డిచెరువు, మాచాయపాలెం పాపయకుంటకు గండ్లు పడ్డాయి.

Pages