S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/23/2016 - 22:13

తిరుపతి, సెప్టెంబరు 22: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 27 విశ్వవిద్యాలల్లో పనితీరు ఆధారంగా అంతర్జాతీయ సంస్థ అయిన టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఎస్వీయూకు ఉత్తమ ర్యాంకు లభించింది. 2016-17 సంవత్సరానికి గాను ప్రకటించిన ప్రపంచ ర్యాంకింగ్‌లో ఎస్వీయూ 601-800 ర్యాంకును సాధించి అగ్రస్థానంలో నిలిచింది.

09/23/2016 - 22:13

రామకుప్పం, సెప్టెంబర్ 22: తెలుగుదేశం పార్టీలో ప్రథమ స్థానం కార్యకర్తలకే అని మండలాధ్యక్షుడు ఆంజనేయరెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక స్ర్తిశక్తి భవనంలో పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, నేలతో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాలకు క్రీయాశీల సభ్యత్వ గుర్తింపు కార్డుతో హాజరు కావాలన్నారు.

09/23/2016 - 22:12

పెనుమూరు, సెప్టెంబర్ 22: మండలంలోని కలిగిరి కొండపై వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత కలిగిరి వెంకటేశ్వర స్వామికి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెరటాసి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గురువారం స్వామివారికి వైభవంగా పల్లకిసేవపై ఊరేగింపుకార్యక్రమం నిర్వహించారు.

09/23/2016 - 22:12

రొంపిచెర్ల, సెప్టెంబర్ 22: చట్టాలు అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా అడిషనల్ జడ్జి ఆదినారాయణ స్పష్టం చేశారు. స్థానిక పంచాయతీ కార్యాలయం ఆవరణలో గురువారం జరిగిన మండల న్యాయసేవా సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

09/23/2016 - 22:11

చిత్తూరు, సెప్టెంబర్ 22 : జిల్లాలో విపత్తు నివారణ చర్యల నిమిత్తం కమాండ్ అండ్ కంట్రోలు రూమ్‌లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. గురువారం సిఎం విజయవాడ నుంచి ఆయా జిల్లా కలెక్టర్లతో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

09/23/2016 - 22:11

తిరుమల, సెప్టెంబర్ 22: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు సంతృప్తికరంగా మూలమూర్తి దర్శనంతోపాటు వాహనసేవలు వీక్షించే అవకాశం కల్పించేందుకు తగిన ఏర్పాట్లు చేపడుతున్నామని టిటిడి తిరుమల జె ఇ ఓ శ్రీనివాసరాజు వెల్లడించారు. తిరుమలలో మాడ వీధులతోపాటు వాహనాల పార్కింగ్ ఏర్పాటుకోసం పలు ప్రాంతాలను జె ఇ ఓ గురువారం పరిశీలించారు.

09/23/2016 - 22:08

ఓజిలి, సెప్టెంబర్ 22: ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని తిరుపతి మాజీ పార్లమెంట్ సభ్యుడు చింతా మోహన్ హెచ్చరించారు. మండల కేంద్రమైన ఓజిలిలో గురువారం చింతా మోహన్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు.

09/23/2016 - 22:08

చిట్టమూరు, సెప్టెంబర్ 22: మండలంలోని మల్లాం గ్రామంలో వెలసిన స్వయంభు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారి అలకల తోపు భక్తులను ఎంతగానో అలరించింది. రాజు వేటకు వెళ్లే సమయంలో దొంగలు నగలు దోచుకెళ్లడం, దొర దొంగలను పట్టించే విధానాన్ని వేదపండితుల మంత్రాలు, ప్రత్యేక వేషధారణలతో నాటకీయ ఫక్కీలో దొర దొంగలను తరిమికొట్టడం కోలాహలంగా జరిగింది.

09/23/2016 - 22:08

తడ, సెప్టెంబర్ 22: పులికాట్‌లో చేపల వేటకు వెళ్లిన జాలర్ల వలకు భారీ చేప చిక్కింది. సముద్రంలో ఉండే 150 కిలోల బరువు గల టేకి చేప వలకు చిక్కడంతో రామాపురం మత్స్యకారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పట్టుబడిన చేపను ఒడ్డుకు చేర్చడంతో స్థానికులు, మత్స్యకారులు ఆసక్తిగా తిలకించారు.

09/23/2016 - 22:07

నెల్లూరు, సెప్టెంబర్ 22: వ్యవసాయ సీజన్ ప్రారంభం అవుతున్నందున మార్కెట్‌లోకి నకిలీ విత్తనాలు, నకిలీ మందులు, నకిలీ ఎరువులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరు కార్యాలయంలోని ఆయన ఛాంబర్‌లో వ్యవసాయాధికారులతో సమీక్షించారు.

Pages