S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/23/2016 - 02:01

పిట్లం, జూలై 22: వర్షం భగవంతుడి వరమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. భగవంతుడు చెట్లకు, వర్షానికి సంబంధం పెట్టాడని, అడవుల ఎక్కువ శాతం ఉన్నచోటే అధికంగా వర్షాలు కురుస్తాయని అన్నారు. శుక్రవారం ఆయన పిట్లం మండలం తిమ్మానగర్ గ్రామంలో జరిగిన వ్యవసాయ దినోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు.

07/23/2016 - 02:00

భీమ్‌గల్, జూలై 22: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి ప్రకృతిని కాపాడాలని మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం భీమ్‌గల్ మండల కేంద్రంలో చేపట్టిన హరితహారం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

07/23/2016 - 01:59

మోర్తాడ్, జూలై 22: భారీ వర్షాలు కురిసినా పెద్దవాగులో వరద ప్రవాహం రాకపోవడంతో ఫిల్టర్‌బెడ్‌లు రీచార్జ్ కాలేదు. దీంతో పెద్దవాగు జలాలపైనే ఆధారపడ్డ చాలామంది రైతులు పంటల సాగు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి పెద్దవాగులో వరద ప్రవాహం వారం రోజుల పాటు కొనసాగితే రెండు సంవత్సరాల వరకు ఎలాంటి డోకా ఉండదని, ఇప్పటి వరకు అలాంటి అవకాశం రాలేదని రైతులు వాపోతున్నారు.

07/23/2016 - 01:58

కంఠేశ్వర్, జూలై 22: నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డును ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసినందున, రాష్ట్ర ప్రభుత్వం పసుపు రైతులకు బేషరతుగా క్షమాపన చెప్పాలని డిసిసి అధ్యక్షుడు తాహెర్‌బిన్‌హందాన్ డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలోని డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

07/23/2016 - 01:33

నార్త్ సౌండ్ (ఆంటిగ్వా), జూలై 22: కరీబియన్లతో నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా నార్త్ సౌండ్‌లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దుమ్ము రేపాడు. ఆతిథ్య వెస్టిండీస్ బౌలర్లను సమర్ధవంతంగా ప్రతిఘటించి కెప్టెన్ ఇన్నింగ్స్‌తో సత్తా చాటుకున్న కోహ్లీ టెస్టుల్లో తొలి డబుల్ సెంచరీని నమోదు చేసుకోవడంతో పాటు సరికొత్త రికార్డు సృష్టించాడు.

07/23/2016 - 01:30

మాంట్రియల్, జూలై 22: ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రీడాకారులు డోపింగ్ కుంభకోణానికి పాల్పడ్డారన్న అభియోగాలతో తీవ్రమైన అపఖ్యాతిని మూటగట్టుకున్న రష్యాను ప్రస్తుతం రియో ఒలింపిక్స్ నుంచి సంపూర్ణ నిషేధానికి గురయ్యే ప్రమాదం వెంటాడుతోంది.

07/23/2016 - 01:30

ముంబయి, జూలై 22: స్టార్‌స్పోర్ట్స్ ప్రోకబడ్డీ టోర్నమెంట్‌లో భాగంగా శుక్రవారం రాత్రి ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు పాట్నా పైరేట్స్‌ను 29-22 పాయింట్ల తేడాతో ఓడించి ఎనిమిదో వజయం సాధించింది. తొలి అర్ధ్భాగం ముగిసే సరికి 9-11 పాయింట్ల తేడాతో వెనకబడి ఉన్న పింక్ పాంథర్స్ రెండో అర్ధ భాగం ప్రారంభంలోనే సూపర్ టాకిల్ ద్వారా స్కోరును 13 పాయింట్ల వద్ద సమం చేయగలిగింది.

07/23/2016 - 01:29

న్యూఢిల్లీ, జూలై 22: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ)ను ప్రక్షాళన చేసేందుకు అనుసరించాల్సిన మార్గాల గురించి చర్చించేందుకు వ్యక్తిగతంగా తమ ఎదుట హాజరు కావాలని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎం.లోధా నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలను ఆదేశించింది.

07/23/2016 - 01:29

ముంబయి, జూలై 22: రియో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు పతకం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని హాకీ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎం సోమయ ఆశాభావం వ్యక్తం చేశాడు. 1980 మాస్కో ఒలింపిక్స్ తర్వాత భారత హాకీ జట్టు ఒలింపిక్స్‌లో పతకం సాధించని విషయం తెలిసిందే.

07/23/2016 - 01:28

కోల్‌కతా, జూలై 22: ఒలింపిక్స్‌లో రెండో పతకం సాధించడంతో పాటు భారత్ తరఫున డేవిస్ కప్‌లో అత్యధిక సింగిల్స్ విజయాలు సాధించిన రామనాథన్ కృష్ణన్ రికార్డును బద్దలు కొట్టాలన్నది లియాండర్ పేస్ లక్ష్యమట. వచ్చే నెల జరిగే రియో ఒలింపిక్స్‌లో ఆడడం ద్వారా ఏడవసారి ఒలింపిక్స్‌లో పాల్గొనే రికార్డు కోసం పేస్ ఇప్పుడు సంసిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ‘పేస్‌కు కొన్ని లక్ష్యాలున్నాయి.

Pages