S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/23/2016 - 01:13

పర్చూరు, జూలై 21 : నానాటికీ పెరిగిపోతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు కనీస వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలని పర్చూరు డివిజన్ సిఐటియు ప్రధాన కార్యదర్శి జి ప్రతాప్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో గురువారం కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.

07/23/2016 - 01:13

ఒంగోలు, జూలై 21 : ఎపిఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా జరుగుతున్న ప్రమాద రహిత వారోత్సవాల కార్యక్రమం గురువారం స్థానిక ఒంగోలు ఆర్టీసీ డిపో ఆవరణలో ఘనంగా ముగిశాయి. ఈ ముగింపు వారోత్సవాల కార్యక్రమంలో ఆర్టీసీ ప్రకాశం జిల్లా రీజియన్ ఆర్‌ఎం ఆదాం సాహెబ్ మాట్లాడుతూ ఆర్టీసీ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసే సమయంలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.

07/23/2016 - 01:12

ఒంగోలు, జూలై 21 : ఎస్‌సి, ఎస్‌టి సెల్ వన్ డిఎస్‌పి టి శ్రీ్ధర్ గురువారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు. ఆ మేరకు జిల్లాఎస్‌పి త్రివిక్రమవర్మను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందచేశారు.

07/23/2016 - 01:12

ఒంగోలు, జూలై 21 : జిల్లాలోని ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేసే 1026 మంది ఎయిడెడ్ ఉపాధ్యాయులకు సంబంధించి డిఎ అరియర్ బిల్లులు, రిటైర్ అయిన వారి బకాయిలను డిఇఓ ద్వారా బడ్జెట్ తెప్పించి బిల్లులను మంజూరు చేస్తామని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రమణ హామీ ఇచ్చారు. గురువారం స్థానిక ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆ మేరకు రమణ హామీ ఇచ్చారు.

07/23/2016 - 01:11

సంతనూతలపాడు, జూలై 21 : సంతనూతలపాడులో మినగా యలమందా, గోవిందమ్మల గృహంలో బుధవారం గుర్తుతెలియని దుండగులు చొరవబడి 54 వేల నగదు, జత బంగారు కమ్మలు, బంగారపు ఉంగరం దొంగలించారు. బాధితులు సోడా బండిపై జీవనం సాగిస్తూ నగదును, బంగారు వస్తువులను యధావిధిగా ఇంట్లో ఉంచి సోడాబండికి వెళ్లారు. కుటుంబానికి సంబంధించిన అప్పులు తీర్చేందుకు బెంగళూరులో బేల్దారి పనులు చేస్తున్న కుమారుడు పంపిన నగదును ఇంట్లో ఉంచారు.

07/23/2016 - 01:11

ఒంగోలు అర్బన్, జూలై 21 : వైకాపా నేతలు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక లాయరుపేటలోని వృద్ధాశ్రమంలో గురువారం ఫ్రొఫెసర్ శమంతకమణి ఆధ్వర్యంలో నిత్యావసర సరకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ వృద్ధాశ్రమంలో ఉంటున్న వృద్ధులకు నిత్యావసర వస్తువులు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు.

07/23/2016 - 01:03

జంగారెడ్డిగూడెం, జూలై 21: చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా త్వరలో ఎర్రకాల్వ, తమ్మిలేరు ప్రాజెక్టులను అనుసంధానం చేయనున్నట్టు రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమ, భూగర్భ గనుల శాఖల మంత్రి పీతల సుజాత వెల్లడించారు. మండలంలోని కొంగువారిగూడెం వద్ద శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలు ప్రాజెక్ట్ ఎడమ ప్రధాన కాలువకు గురువారం మంత్రి సాగునీటిని విడుదల చేసారు.

07/23/2016 - 01:03

ఆకివీడు, జూలై 21: మండలంలోని చినకాపవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం కూడా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం ఇంటి వద్ద నుంచి విద్యార్థులు ఉల్లాసంగా వస్తున్నప్పటికీ పాఠశాలకు వచ్చిన కొద్దిసేపటికే అస్వస్థతకు గురవుతున్నారు.

07/23/2016 - 01:02

ఏలూరు, జూలై 21 : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ రాజ్యసభ సభ్యులు కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు సహకారం అందించాలని, అప్పుడే ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరుతుందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎండి రఫీయుల్లాభేగ్ అన్నారు.

07/23/2016 - 01:02

ఏలూరు, జూలై 21 : జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్‌లోని విద్యార్ధినీ విద్యార్ధులెవరైనా అనారోగ్యం బారిన పడినా, లేదా ప్రమాదం జరిగినా సంబంధిత హాస్టల్ సంక్షేమాధికారిని బాధ్యులను చేసి కేసు నమోదు చేసి అరెస్టు చేయిస్తానని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్‌లో గురువారం సంక్షేమవసతిగృహాల పనితీరుపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.

Pages