S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/23/2016 - 01:01

ఏలూరు, జూలై 21 : ఉద్యోగం చేసే ప్రాంతంలోనే ఎంఇవోలు, ప్రధానోపాధ్యాయులు, టీచర్లు అంతా ఖచ్చితంగా స్థానికంగా నివాసం ఉండాలని అలా స్థానికంగా లేకుండా వేరే ప్రాంతాల నుండి వచ్చేవారిపై చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ హెచ్చరించారు. స్థానిక కలెక్టరు కార్యాలయంలో గురువారం విద్యాశాఖాధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు.

07/23/2016 - 00:58

పోలవరం, జూలై 21: సముద్రంలోకి వృథాగా పోతున్న గోదావరి జలాలను కృష్ణా జిల్లాకు తరలించి అక్కడి రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదుకున్నారని మాకినేని వెంకటరమణ ఛారిటబుల్ ట్రస్టు ఛైర్మన్ మాకినేని పరమేశ్వరరావు అన్నారు. అనుమోలు ఛారిటబుల్ ట్రస్టు, మాకినేని వెంకటరమణ ఛారిటబుల్ ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా రైతులను ఎత్తిపోతల చూపించేందుకు గురువారం ఉదయం తీసుకువచ్చారు.

07/23/2016 - 00:57

ఏలూరు, జూలై 21 : ఎపిఎస్ ఆర్టీసీ కార్మికులు ప్రయాణీకులకు అందించే సేవలు ప్రశంసనీయమని జిల్లా ఎస్‌పి భాస్కర్ భూషణ్ అన్నారు. ఆర్‌టిసి ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన ప్రారంభమైన ప్రమాద రహిత వారోత్సవాలు గురువారంతో ముగిసిన నేపధ్యంలో ఆర్‌టిసి గ్యారేజ్ వద్ద జిల్లాలోని ఎనిమిది డిపోల పరిధిలో ప్రమాద రహితంగా నడిపిన ఆర్‌టిసి డ్రైవర్లకు మెమెంటోలు అందించే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

07/23/2016 - 00:55

ఏలూరు, జూలై 21 : జిల్లా కేంద్రమైన ఏలూరు ట్రాఫిక్ డి ఎస్‌పిగా ఎ శ్రీనివాసరావు గురువారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఆయన గుంటూరు అర్బన్ ఎస్‌సి, ఎస్‌టి సెల్ డి ఎస్‌పిగా పనిచేస్తూ బదిలీపై వచ్చారు. ఇప్పటి వరకు డి ఎస్‌పిగా పనిచేసిన పి సుధాకరరావును ఎసిబి డి ఎస్‌పిగా బదిలీ చేసిన విషయం తెలిసిందే.

07/23/2016 - 00:54

వీరవాసరం, జూలై 21: వీరవాసరం మండలంలోని మత్స్యపురిపాలెం పంచాయతీలో నరసాపురం డిఎల్‌పిఒ గోగులమండ శ్రీరాములు గురువారం విచారణ నిర్వహించారు. గ్రామపంచాయతీలో అవకతవకలు జరిగాయంటూ పంచాయతీబోర్డు ఉపసర్పంచ్, ఎంపిటిసి మరికొంతమంది చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టారు. పంచాయతీ రికార్డులను పరిశీలించారు. పంచాయతీ కార్యదర్శి ప్రభాకరరావు రికార్డులను డిఎల్‌పిఒకు చూపించారు.

07/23/2016 - 00:53

పాలకొల్లు, జూలై 21: పట్టణంలోని ఎర్రవంతెన వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు కూలగొట్టారు. ఈ విగ్రహాన్ని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీని పై విచారణ చేపట్టి నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాత విగ్రహం స్థానంలో కొత్తవిగ్రహాన్ని ఏర్పాటుచేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

07/23/2016 - 00:51

సిద్దిపేట, జూలై 22 : ఎఎన్‌ఎంల సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తు కళ్లకు గంతలతో శుక్రవారం నిరనస వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈసందర్భంగా సిఐటియు డివిజన్ ఉపాధ్యక్షురాలు హేమలత మాట్లాడుతూ ఎఎన్‌ఎంల సమస్యల పరిష్కరించాలని గత ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవటం దారుణమన్నారు. ఎఎన్‌ఎంలకు 10వ పిఆర్‌సి ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

07/23/2016 - 00:51

తూప్రాన్, జూలై 22 : హరితహారం సాదించడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రాష్ట్ర ఐటి శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని మనోహరాబాద్ శివారులో గల ఐటిసి కన్సూమర్ గూడ్స్ తయారీ యూనిట్‌లో, ముప్పిరెడ్డిపల్లి శివారులో గల ఇండస్ట్రియల్ పార్క్‌లో మొక్కలు నాటిన సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించడంలో భాగస్వామ్యులు కావాలన్నారు.

07/23/2016 - 00:50

తొగుట, జూలై 22: ప్రజల ఇష్టాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం మల్లన్నసాగర్‌పై నిరంకుశంగా వ్యవహరించడం వల్లే రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, రైతులవి ఆత్మహత్యలు కాదని, ప్రభుత్వ హత్యలేనని మాజీ మంత్రులు దామోదర్ రాజనర్సింహ, సునితా లక్ష్మారెడ్డిలు ఆరోపించారు. శుక్రవారం మండలంలోని పల్లెపహడ్‌లో మల్లన్నసాగర్ ముంపు బెంగతో ఆత్మహత్య చేసుకున్న రైతు నర్సింలు కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.

07/23/2016 - 00:50

కోల్‌కతా, జూలై 22: దేశీయ ఎఫ్‌ఎమ్‌సిజి దిగ్గజం ఐటిసి.. 2030 నాటికి ప్రతిష్ఠాత్మకంగా లక్ష కోట్ల రూపాయల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. శుక్రవారం ఇక్కడ ఐటిసి 105వ వార్షిక సాధారణ సమావేశం (ఎజిఎమ్) జరిగింది. ఈ సందర్భంగా వాటాదారులనుద్దేశించి సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వైసి దేవేశ్వర్ మాట్లాడుతూ పొగాకు వ్యాపారం వృద్ధిపథంలోనే కొనసాగుతోందని చెప్పారు.

Pages