S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/23/2016 - 01:28

బింగ్‌హామ్టన్ (అమెరికా), జూలై 22: అమెరికాలో జరుగుతున్న ఎటిపి చాలెంజర్ టోర్నమెంట్‌లో భారత యువ ఆటగాడు రామనాథన్ రామ్‌కుమార్ (21) క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 214వ స్థానంలో కొనసాగుతున్న రామ్‌కుమార్ శుక్రవారం ఇక్కడి హార్డ్ కోర్టులో జరిగిన సింగిల్స్ ప్రీ-క్వార్టర్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌కు చెందిన జోస్ స్ట్థామ్‌పై అద్భుత విజయాన్ని సాధించాడు.

07/23/2016 - 01:27

హైదరాబాద్, జూలై 22: బ్రెజిల్‌లో వచ్చే నెల 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఒలింపిక్ క్రీడల్లో పోటీపడేందుకు ఆసక్తితో ఎదురు చూస్తున్నానని, సహచర భారత అథ్లెట్లతో కలసి ఈ క్రీడల్లో చక్కటి ప్రదర్శనతో రాణించగలనని ఆశిస్తున్నానని టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా స్పష్టం చేసింది. ‘ఒలింపిక్స్‌లో పోటీపడేందుకు ఆసక్తితో ఎదురు చూస్తున్నా. ఈ క్రీడల్లో పాల్గొనేందుకు శనివారం హైదరాబాద్ నుంచి కెనడాకు బయలుదేరుతున్నా.

07/23/2016 - 01:27

న్యూఢిల్లీ, జూలై 22: భారత క్రికెట్ లెజెండ్ సచిన్ తెండూల్కర్ రియో ఒలింపిక్స్‌కు వెళ్లనున్నాడు. భారత ఒలింపిక్ సంఘానికి సుహృద్భావ రాయబారిగా నియమితుడైన సచిన్‌ను ఆగస్టు 5వ తేదీ నుంచి బ్రెజిల్‌లో ప్రారంభమయ్యే ఒలింపిక్ క్రీడలకు విచ్చేయవలసిందిగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) అధ్యక్షుడు థామస్ బాచ్ ఆహ్వానించాడు. దీంతో సచిన్ వచ్చే నెల 2వ తేదీన రియో డీ జెనిరో నగరానికి బయల్దేరనున్నాడు.

07/23/2016 - 01:17

దొనకొండ, జూలై 21: దొనకొండ మండలం చందవరంలో 120కోట్ల రూపాయలతో స్పేర్‌పార్ట్స్ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్లు డాక్టర్ ఎపిజె అబ్దుల్‌కలాం స్వశక్తి కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ చైర్మన్ శ్రీనివాసులు తెలిపారు. గురువారం మండలంలోని చందవరం పంచాయతీలో 100 ఎకరాల ప్రభుత్వ భూమిని వారు పరిశీలించారు.

07/23/2016 - 01:17

గిద్దలూరు, జూలై 21: రాష్ట్రంలో 13 జిల్లాల్లో 202 తాలూకా యూనిట్లు ఉన్నాయని, క్షేత్రస్థాయిలో ఉద్యోగుల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు పర్యటనలు సాగిస్తున్నామని, ఇప్పటివరకు 70 తాలూకా పర్యటనలు చేసినట్లు రాష్ట్ర ఎన్‌జిఓ సంఘం అధ్యక్షులు అశోక్‌బాబు తెలిపారు. గురువారం స్థానిక రెవెన్యూ కార్యాలయం ఆవరణలో జరిగిన ఎన్‌జిఓ ఉద్యోగుల తాలూకా యూనిట్ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

07/23/2016 - 01:16

ఒంగోలు, జూలై 21 : రాష్ట్రంలో ప్రజాసాధికార సర్వేను వేగవంతంగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. గురువారం విజయవాడ నుంచి ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లతో ప్రజాసాధికార సర్వేపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో ప్రజాసాధికార సర్వే చేయడం వల్ల ప్రజలకు పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు అమలు చేయవచ్చని తెలిపారు.

07/23/2016 - 01:16

పొదిలి, జూలై 21 : రాష్ట్భ్రావృద్ధిలో ప్రభుత్వ ఉద్యోగులు భాగస్వాములు కావాలని ఎపిఎన్‌జివో అసోసియేషన్ అధ్యక్షుడు పి అశోక్‌బాబు కోరారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన గురువారం పొదిలికి విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్‌జివో హోంలో ఎర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఉద్యోగులకు 43 శాతం పిఆర్‌సి ఇవ్వడం హర్షణీయమన్నారు.

07/23/2016 - 01:15

ఒంగోలు అర్బన్, జూలై 21 : ప్రజలకు నిత్యావసర, అత్యవసర మందులపై ఎక్సైజ్, వ్యాట్‌టాక్స్‌ను వెంటనే ఎత్తివేయాలని ఎపి మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటీవ్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఇ గిరి డిమాండ్ చేశారు. గురువారం స్థానిక జిల్లా కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని మందుల ధరలు ప్రభుత్వ నియంత్రణలో ఉండాలని, ప్రభుత్వరంగ ఫార్మా కంపెనీలను కాపాడాలన్నారు.

07/23/2016 - 01:14

పర్చూరు, జూలై 21 : చాలాకాలంగా రైతుల వ్యవసాయ ఉత్పత్తులు తీసుకెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్వర్ణ డొంక రోడ్డును అభివృద్ధి పరుస్తున్నట్లు గ్రామానికి చెందిన టిడిపి నాయకులు శోభన్‌బాబు గురువారం తెలిపారు. గ్రామంలోని ఊర చెరువులోని మట్టి తోడి డొంక రోడ్డును అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆదేశించినట్లు తెలిపారు.

07/23/2016 - 01:14

పెద్దదోర్నాల, జూలై 21: వచ్చేనెల 12వ తేదీ నుంచి జరిగే కృష్ణా పుష్కరాలను పురష్కరించుకొని కర్నూలు జిల్లా కలెక్టర్ చల్లా విజయమోహన్ గురువారం పెద్దదోర్నాలలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ శ్రీశైలం వెళ్ళే భక్తులకు పెద్దదోర్నాలలో ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మల, మూత్రశాలల సౌకర్యం, తాగునీటి వసతి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Pages