S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/27/2017 - 03:38

మంగళగిరి, నవంబర్ 26: టీడీపీ కేంద్ర కార్యాలయ భవన నిర్మాణం 9నెలల్లో పూర్తి చేస్తామని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు. గుంటూరు - విజయవాడ నగరాల మధ్య 16వ నెంబర్ జాతీయ రహదారి పక్కన మంగళగిరి మండలం ఆత్మకూరు పరిధిలో ఆదివారం కార్యాలయ నిర్మాణానికి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు.

11/27/2017 - 03:36

హిందూపురం, నవంబర్ 26: కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతూ, మతపరంగా దేశాన్ని భ్రష్టు పట్టిస్తోందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపించారు. రఘువీరా ఆదివారం అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గ సేవా మందిరంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

11/27/2017 - 03:35

ఒంగోలు, నవంబర్ 26: జిల్లా కేంద్రమైన ఒంగోలులోని ఆర్టీసీ బస్టాండు వద్ద ఆదివారం నిలిపి ఉంచిన ఓ కారులో భారీ చోరీ జరిగింది. చోరీ సంఘటనకు సంబంధించి ఒంగోలు పట్టణ డిఎస్‌పి బి శ్రీనివాసరావు అందించిన వివరాలిలా ఉన్నాయి.

11/27/2017 - 03:35

విశాఖపట్నం, నవంబర్ 26: విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడానికే నిర్ణయించుకున్నారు. ఆదివారం రాత్రి విశాఖ నుంచి నాలుగు బస్సులలో తన అనుచరులతో ఈశ్వరి విజయవాడకు బయల్దేరి వెళ్లారు. సోమవారం ఉదయం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో ఆమె చేరనున్నారు. కాగా, శనివారం రాత్రి విశాఖలో ఉన్న విజయసాయిరెడ్డిని ఈశ్వరి స్వయంగా వెళ్లి కలుసుకున్నారు.

11/27/2017 - 03:34

కడియం, నవంబర్ 26: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తోందని, ప్రస్తుతం రైతాంగానికి సరఫరా చేస్తున్న ఏడు గంటల ఉచిత విద్యుత్తు సరఫరాను తొమ్మిది గంటలకు పెంచే ప్రతిపాదన పరిశీలనలో ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంకలో మంత్రి సోమిరెడ్డి ఆదివారం విలేఖర్లతో మాట్లాడారు.

11/27/2017 - 03:33

రాజమహేంద్రవరం, నవంబర్ 26: రాజమహేంద్రవరం మేయర్ పంతం రజనీ శేషసాయి ఆదివారం కంటతడి పెట్టారు. ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ యూనివర్సిటీ అనుబంధ రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాల అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘించడంతో పాటు, ఫిర్యాదుచేసినా సొంత పార్టీకే చెందిన ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో అవమానంగా భావించిన ఆమె మనస్తాపానికి గురై కన్నీటిపర్యంతమయ్యారు.

11/27/2017 - 02:40

విజయవాడ (బెంజిసర్కిల్), నవంబర్ 26: అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మన రాష్ట్రంలో అపహాస్యం పాలవుతోందని, దీనికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి చంద్రబాబేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున ఆరోపించారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మహోన్నతమైన రాజ్యాంగం నేడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.

11/27/2017 - 02:34

రాజమహేంద్రవరం, నవంబర్ 26: ప్రతిపక్ష నేత వ్యవహార శైలి రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉందని, పదేపదే రైతుల వద్దకు వెళ్లి, వారిని కుంగుబాటులోకి నెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక విధాలుగా మేలుచేస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం లోటు బడ్జెట్‌లో ఉన్పప్పటికీ రుణ మాఫీచేస్తూ ఆదుకుంటోందన్నారు.

11/27/2017 - 00:35

కర్నూలు, నవంబర్ 26 : గత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక అసెంబ్లీ స్థానాలతో పాటు రెండు పార్లమెంటు సీట్లను కట్టబెట్టిన కర్నూలు జిల్లా నుంచే మరోమారు తొలి అభ్యర్థి ప్రకటన వెలువడింది.

11/27/2017 - 00:34

రాజమహేంద్రవరం, నవంబర్ 26: వ్యవసాయ శాఖలో అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయ విస్తరణ చేపట్టామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో శాటిలైట్ చిత్రాల ద్వారా భూసార పరీక్షలు నిర్వహించే అత్యాధునిక విధానానికి శ్రీకారం చుట్టామన్నారు.

Pages