S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/23/2017 - 01:26

అమరావతి, నవంబర్ 22: మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి గురువారం సాయంత్రం తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీలు సహా 1500 మంది కార్యకర్తలు ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు.

11/23/2017 - 01:25

విజయవాడ, నవంబర్ 22: విశాఖలో భూ రికార్డుల తారుమారుకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పొడిగింపుపై ప్రజల్లో అనుమానం వ్యక్తం అవుతోందని ఎమ్మెల్సీ ఎంవివిఎస్ మూర్తి తెలిపారు. ఇప్పటికే మూడు సార్లు పొడిగించారని, మరోసారి పొడిగిస్తారనే అమనుమానాలు వస్తున్నాయన్నారు. మరింత జాప్యం జరిగితే జ్యుడీషియల్ ఎంక్వైరీ అవసరం రావచ్చన్నారు.

2873 ఫిర్యాదులు వచ్చాయి : కేఈ

11/23/2017 - 01:25

అమరావతి, నవంబర్ 22: బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనందసూర్యపై బ్రాహ్మణ సంఘాల్లో తిరుగుబాటు మొదలయింది. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలు, కార్పొరేషన్ పథకాల ప్రచారం బదులు తన సొంత సంస్థను ప్రోత్సహిస్తోన్న ఆయనను తక్షణం తొలగించాలని రాష్ట్రంలోని వివిధ బ్రాహ్మణ సంఘాలు పార్టీ కార్యాలయానికి వెల్లువలా ఫిర్యాదులు పంపుతున్నారు.

11/23/2017 - 01:24

విజయవాడ (క్రైం), నవంబర్ 22: రాష్ట్ర ప్రభుత్వశాఖల్లోని అవినీతి పరులు, లంచావతారాలకు అవినీతి నిరోధక శాఖ మరో అవకాశం ఇచ్చింది. ఏసిబి డిజిగా గత ఏడాది బాధ్యతలు చేపట్టిన ఆర్‌పి ఠాకూర్ అవినీతిపరులకు ఆర్నెల్లు గడువు ఇస్తున్నట్లు అప్పుడే ప్రకటించారు. ఆయన ఏడాదికాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మళ్లీ ఆర్నెల్లు గడువు ఇస్తున్నట్లు ప్రకటించారు.

11/23/2017 - 01:23

విజయవాడ, నవంబర్ 22: ప్రతిష్ఠాత్మక సైన్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన ‘ఇంటర్నేషనల్ జనరల్ నాలెడ్జ్ ఒలింపియాడ్’ (ఐజీకేఓ) పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కస్తూర్బా గాంధీ బాలికా పాఠశాలలకు చెందిన విద్యార్థినులు (కేజీబీవీ) సత్తా చాటారు. సైన్స్ ఒలింపియాడ్ ప్రపంచ వ్యాప్తంగా 30 దేశాల్లో ఈ పరీక్షలను నిర్వహించింది.

11/23/2017 - 01:09

గుంటూరు, నవంబర్ 22: ఇకపై విశ్వవిద్యాలయాల భోదనేతర సిబ్బంది నియామకాల్లో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీసీ)కీ అధికారం కల్పిస్తూ నిర్దేశించిన చట్ట సవరణ బిల్లును బుధవారం శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. బిల్లును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సభలో ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదించారు.

11/23/2017 - 01:09

అనంతపురం, నవంబర్ 22: ‘ఐ హావ్ కమ్ నాట్ టు డిస్టర్బ్ ఆర్ డెస్ట్రాయ్ ఎనీ ఫెయిత్, బట్ టు కన్‌ఫర్మ్ ఈచ్ ఇన్ హిజ్ ఓన్ ఫెయిత్, సో దట్ ద క్రిస్టియన్.. బికమ్స్ ఎ బెటర్ క్రిస్టియన్, ద ముస్లిం.. ఎ బెటర్ ముస్లిం, ద హిందూ.. ఎ బెటర్ హిందూ..

11/23/2017 - 01:08

మదనపల్లె, నవంబర్ 22: కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నుంచి మదనపల్లెకు వస్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ సంఘటన బుధవారం ఉదయం రాష్ట్ర సరిహద్దు కర్ణాటక రాష్ట్రం రాయల్పాడు సమీపంలో చోటుచేసుకుంది. రాయలపాడు ఎస్‌ఐ నటరాజ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బెంగళూరు నుంచి ప్యాసింజర్లతో మదనపల్లె బయలుదేరిన ప్రైవేట్ బస్సుకు ముందు కారు వెళ్తోంది.

11/23/2017 - 01:07

విజయవాడ (క్రైం), నవంబర్ 22: అసెంబ్లీ ముట్డడికి ప్రయత్నించిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు బుధవారం కొంతసేపు హల్‌చల్ చేశారు. ఎస్సీ వర్గీకరణకు చర్యలు చేపట్టకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమకు అన్యాయం చేస్తున్నారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) ఆరోపిస్తోంది. వెంటనే బిల్లు పెట్టాలని డిమాండు చేస్తూ గత కొద్దిరోజులుగా ఏపిలో జిల్లాల వారీగా ఆందోళన కొనసాగిస్తోంది.

11/23/2017 - 01:07

విజయవాడ, నవంబర్ 22: రాష్ట్రంలో తీవ్రమైన మంచినీటి ఎద్దడి సమస్య ఉన్నదనే విషయం ఇంతవరకు ప్రభుత్వ దృష్టికి రాలేదని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పిన సమాధానం పట్ల అధికార పక్షానికి చెందిన సభ్యులే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ గుక్కెడు నీటికోసం అల్లాడిపోతున్న గ్రామాలనేకం ఉన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేయడం బుధవారం శాసనసభలో ప్రశ్నోత్తరాలలో ఒకింత కలకలం సృష్టించింది.

Pages